సాక్షి, హైదరాబాద్: ఓ భవన నిర్మాణ అనుమతికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కె.విద్యాధర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మరపోచంపల్లి గ్రామంలో 40 అడుగుల వెడల్పుతో లోపలి రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులను పునః పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించినా అధికారులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదంటూ అక్షయ డెవలపర్స్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment