చీడికాడ, పాడేరు, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో 98 కిలోల గంజాయి పట్టుబడింది. కట్టవాని అగ్రహారం వంతెన వద్ద ఆటోలో తరలిస్తున్న 90 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని డ్రయివర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హెచ్‌సీ దాసు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం వడ్డాది నుంచి బైలపూడికి ఏపీ31టీడబ్ల్యు2001 నంబరున్న ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు అందించిన సమాచారం మేరకు కట్టవాని అగ్రహారం వంతెన వద్ద మాటువేశామని తెలిపారు. దిబ్బపాలెం తాడి రాజుకు చెందిన ఆటోను తనిఖీ చేయగా లగేజీ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయన్నారు. దీంతో ఆటో డ్రయివర్ తాడి రాజు (23)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుతెలిపారు.
కాలినడకన తీసుకెళ్తుండగా పట్టివేత
పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి కాలినడకన గంజాయి రవాణా చేస్తున్న నలుగురు గిరిజనులను గుర్తించి అరెస్టు చేశామని పాడేరు ఎస్‌ఐ ప్రసాద్ సోమవారం విలేకరులకు తెలిపారు. తమకు అందిన ఫోన్ సమాచారం మేరకు చింతలవీధి కూడలి వద్ద తనిఖీలు నిర్వహించగా కాలినడకన లగేజి బ్యాగులతో వస్తున్న జి.మాడుగుల మండలం గొడుగుమామిడి గ్రామానికి చెందిన సాగిన బాలకృష్ణ, జర్రాయికి చెందిన సిరగం బాలకృష్ణ, జోగులుపుట్టుకు చెందిన కూడెలి రవికుమార్, పెదబయలు మండలం లింగేటి గ్రామానికి చెందిన బోయిని కృష్ణారావును అదుపులోకి తీసుకోగా గంజాయి రవాణా వెలుగు చూసిందన్నారు. వీరి బ్యాగుల్లోని 8 కిలోల గంజాయితో పాటు రూ.లక్ష 56 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టయిన నలుగురినీ రిమాండ్‌కు తరలించామన్నారు.
98 కిలోల గంజాయి స్వాధీనం
Published Tue, Oct 8 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement