విశాఖ నగరం గోపాలపట్నం వద్ద ఆటోలో తరలిస్తున్న 68 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
విశాఖ నగరం గోపాలపట్నం వద్ద ఆటోలో తరలిస్తున్న 68 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం గోపాలపట్నం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ లేని ఆటో ఒకటి అటుగా వచ్చింది. ఆటోని తనిఖీ చేయగా 68 కిలోల గంజాయి కనిపించింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మన్మథరావు, రామారావు, భీమారావు, రమేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయిని పాడేరు నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు.