విశాఖపట్నం: అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడేపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు 150 కిలోల గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దాని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అధికారులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.