పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు
నేరడిగొండ(బోథ్) : మండలంలోని రోల్‌మామడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని గురువారం ఆబ్కారీశాఖ అధికారులు పట్టుకున్నారు. సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా జట్వే మాన్‌సింగ్ ఇంట్లో 4 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సీఐ రాజమౌళి తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగుతో పాటు నిల్వలు ఉంచితే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎస్సై అరుణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
నస్పూర్‌లో 300 గ్రాములు..
నస్పూర్(మంచిర్యాల): సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగంమల్లయ్యపల్లెలో గంజాయి విక్రయిస్తున్న ఎండీ.రసూల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రసూల్ ఇంటిపై దాడి చేసి 30 ప్యాకెట్‌లలో ఉన్న సుమారు 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. రసూల్‌ను సీసీసీ పోలీసులకు అప్పగించారు. గంజాయి విక్రేతలపై టాస్క్‌ఫోర్స్ నిఘా ఉంచిందని, గంజాయిని నిర్మూలించే విధంగా టాస్స్‌ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేఖర్, రవి, సుమలత పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment