మద్యం సీసాలు స్వాధీనం చేసుకుంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ, సిబ్బంది
పీఎం పాలెం(భీమిలి): ప్రైవేటు మద్యం దుకాణాల గడువు ముగిసిన తరువాత కూడా మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న వారి ఆటకట్టించారు ఎక్సైజ్, టాస్క్‌ఫోర్సు అధికారులు. పోతినమల్లయ్యపాలెం సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ టెంట్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఈ బాగోతాన్ని బట్టబయలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువైన మద్యాన్ని స్వాదీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించిన వివ రాలు ఇలా ఉన్నాయి. మదురవాడలో ఆర్‌కే నా యుడు వైన్స్, నర్సింగ్ వైన్స్, మిథులాపురి లే అవుట్‌లోని శ్రీసాయి వైన్స్ లైసన్స్‌లు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం సెప్టంబర్ 30తో ముగిశాయి. ఆయా దుకాణాల్లో ఉన్న లిక్కర్, బీ ర్లు ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించాల్సి ఉంది.
అయితే సెప్టెంబర్ 30 నాటికి తమ వద్ద ఉన్న సరకు అంతా అమ్ముడుపోయిందని ఆయా దుకాణాల యజమానులు అధికారులకు తప్పుడు లెక్క లు చూపారు. అనంతరం మద్యాన్ని టెంట్‌హౌస్‌కు తరలించారు. ఆయా మద్యాన్ని మదురవాడ ప్రాంతంలోని బెల్ట్ దుకాణాలకు గుట్టుగా తరలించి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వ్యక్తి మోటర్ సైకిల్‌పై రెండు కేసుల మద్యాన్ని తరలిస్తుండగా టెంట్‌హౌస్‌కు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ విభాగం సిబ్బంది తడ్ని అదుపులోకి తీసుకు ని విచారించారు. అతడు చెప్పిన సమాచారంతో టెంట్‌హౌస్‌కు వెళ్లి పరిశీలించగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బయటపడింది. 42 కేసుల బీర్లు, 19 కేసుల బ్రీజర్లు, వివిద రకాల బ్రాండ్ల లిక్కర్ 88 కేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంకా నర్శింగరావు, వి.పుల్లాజీ, ప్రసాద్, రామకృష్ణ, మన్మధరావు, సోంపాత్రుడులను అరెస్ట్ చేశా రు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎన్.అన్నపూర్ణ, సహాయ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ దొర, ఎస్‌ఐ బాబూరావు, సి బ్బంది దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మద్యం ప ట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment