న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమోతో, టాటా సన్స్ సెటిల్‌మెంట్‌కు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పింది. టాటా డొకోమో మధ్య ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్‌బీఐ ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో తన వాదనను వినిపించింది.
డొకొమొ, షేర్ల బదిలీ అక్రమమని ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ సందర్భంగా ఆర్బీఐ వాదించింది. అయితే ఆర్‌బీఐ వాదనలను హైకోర్టు కొట్టి పారేసింది. దీనిపై పూర్తి వివరణను కోరింది. తమ అభ్యంతరాలపై నివేదిక సమర్పించ్సాలిందిగా జస్టిస్ ఎస్‌మురళీధర్ ఆర్‌బీఐని కోరారు.
తదుపరి విచారణ తేదీ మార్చి 14 న కోర్టు ముందు తన వైఖరిని సమర్పిస్తుందని ఆర్‌బీఐ చెప్పింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. వివాద పరిష్కారానికి రెండు సంస్థల ప్రయత్నాలకు ఇండో-జపనీస్ సంబంధాలకు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది.
కాగా గత రెండేళ్లు గా టాటా సన్స్ ,జపనీస్ ప్రముఖ టెలికాం సంస్థ ఎన్‌టీటీ డొకొమొ మధ్య సాగుతున్న వివాదానికి 1.17 బిలియన్ డాలర్లను(దాదాపు రూ. 7,900 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.17 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది.
టాటా-డొకోమొ సెటిల్‌మెంట్‌ను వ్యతిరేకించిన ఆర్బీఐ
Published Thu, Mar 9 2017 11:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement