టాటా సన్స్‌కు ఊరట, ఆర్‌బీఐకి ఝలక్‌ | Delhi hc allows arbitration award settlement | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌కు ఊరట, ఆర్‌బీఐకి ఝలక్‌

Published Fri, Apr 28 2017 2:42 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

టాటా సన్స్‌కు ఊరట, ఆర్‌బీఐకి  ఝలక్‌

టాటా సన్స్‌కు ఊరట, ఆర్‌బీఐకి ఝలక్‌

న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్‌ ఎన్‌టీటీ డొకోమోతో వివాదాన్ని పరిష‍్కరించుకునేందుకు టాటా టెలికామ్‌కు  ఢిల్లీ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఆర్బిట్రేషన్‌  అవార్డును సమర్ధించడం ద్వారా ఈ ఒప్పందం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌  అభ్యంతరాలను  కోర్టు తోసిపుచ్చింది.    2016 జూన్‌లో లండన్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పు  ప్రకారం వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు   చెల్లించేందుకు టాటా అంగీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ  ఈ ప్రతిపాదనను ఆర్‌బీఐ  వ్యతిరేకించింది.  ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తదాఖలు  చేసిన మధ్యంతపర పిటీషన్ను  కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఈ వివాదంలో టాటా సన్స్‌కు భారీ ఊరట లభించింది.  
కాగా  జపాన్‌ టెలికామ్‌ సంస్థ ఎన్‌టిటి డొకోమోతో చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్‌ నిర్ణయించింది. ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించినంది.  తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ,  రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. ఈమేరకు  టాటా సన్స్‌ 117 కోట్ల డాలర్లను కోర్టులో డిపాజిట్‌ కూడా చేసింది. టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు.  అయితే దీన్ని ఆర్‌బీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement