allows
-
ఆకాశ ఎయిర్ ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్ వాలాకు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ పెట్ లవర్స్‌కు శుభవార్త అందించింది. త్వరలోనే తమ విమానాల్లో పెట్స్ తో సహా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది. ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజా ప్రకటన ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి తన విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక వ్యక్తికి 7 కిలోల వరకు బరువు ఉన్న ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని విమానయాన సంస్థ తెలిపింది. "పెంపుడు జంతువుల పాలసీకి సంబంధించి ఇది తొలి అడుగు అని, ప్రస్తుతం పెంపుడు పిల్లులు , కుక్కలను అనుమతిస్తాం త్వరలోనే మరింత విస్తరిస్తామని’’ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను జోడిస్తున్నామని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 18 విమానాలు, రానున్న అయిదేళ్లలో 72 విమానాల అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీంతో పెట్ లవర్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. Oh yayyy! https://t.co/8mrwX3Hyso — Chinmayi Sripaada (@Chinmayi) October 6, 2022 -
క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా?
సాక్షి, ముంబై: డిజిటల్ ఇండియాలో భాగంగా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారులకు కొత్త అవకాశాన్ని ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతినివ్వనుంది. ద్వైమాసిక పాలసీ సమీక్ష, రెగ్యులేటరీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రమోట్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌లతో తొలుత ఈ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. దీనికవసరమైన సిస్టమ్ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత తగిన సూచాలు అందిస్తామన్నారు. అలాగే యూపీఐలో మొత్తం 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారనీ మే నెలలో 594.63 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ.10.40 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రకటించారు. ఆర్బీఐ ప్రకటించిన ఈ వెసులుబాటుతో యూపీఏ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసి, కార్డు స్వైప్ చేయ కుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చన్న మాట. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్‌టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మాత్రమే పేమెంట్ పూర్తి చేయవచ్చు. కాగా ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్‌ను ఎంపిక చేసిన బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. పేమెంట్స్ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్ అనుసంధానం ఎలా? ♦ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత పేమెంట్ మెథడ్‌ను క్లిక్ చేస్తే యాప్‌లో బ్యాంకు అకౌంట్స్ జాబితా కనిపిస్తుంది ♦ ఇక్కడ యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన క్లిక్ చేయాలి. ♦ తరువాత కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేసి, సేవ్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. -
సినీ ప్రియులకు గుడ్‌న్యూస్.. థియేటర్లకు అనుమతి
సినీ ప్రియులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. జులై 8వ తేదీ నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది ఈ మాయదారి వైరస్. అయితే కేసులు తగ్గిపోతున్న తరుణంలో అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. అలా థియేటర్లు ఓపెన్ అయిన రెండు, మూడు నెలలకే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో దాదాపు అన్ని రాషష్ష్ర్టాల్లో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్ల అనుమతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాయిదా పడిన సినిమా షూటింగులు కొద్ది రోజుల నుంచి జోరందుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లకు అనుమతిచ్చినా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వందశాతం ఆక్యూపెన్సీతో త్వరలోనే థియేటర్ల అనుమతికి తెలంగాణ ప్రభత్వం పచ్చజెండా ఊపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
పాతనోట్ల మార్పిడికి వారికి గోల్డెన్ ఛాన్స్
న్యూఢిల్లీ : బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు అవకాశమిచ్చింది. పాత రూ.500, రూ.1000 నోట్లను కొత్తనోట్లతో మార్చుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ కాలంలో పోస్ట్ ఆఫీసులు, సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత నోట్లను నిర్ణీత గడువు లోపల మార్చుకోవచ్చని వివరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన అధికారిక నోటిఫికేషన్లో నోట్ల మార్పిడి అంశాన్ని ప్రకటించింది. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏ కార్యాలయంలో అయినా మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. దీనికి 30 రోజుల వ్యవధిని ఇచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను పొందవచ్చని తెలిపింది. సహకార బ్యాంకుల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న పాత నోట్ల నిల్వలు, రైతులకు రుణాలందించేందుకు అనేక జిల్లాల కో-ఆపరేటివ్ బ్యాంకుల దగ్గర తగిన నిధులు లేవన్ననివేదికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న సహకార బ్యాంకులకు, ముఖ్యంగా మహారాష్ట్ర సహకార బ్యాంకులకు భారీ ఉపశమనం లభించనుంది. సహకార బ్యాంకులలో కూడా పాత 500, 1000 రూపాయల నోట్లను జమ చేసుకునే అవకాశం కల్పించడంతో కుప్పలు తెప్పలుగా డిపాజిట్ లు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లకు గడుపుపెంచాలని ఇవి కోరాయి. నాసిక్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో రద్దయిన పాత నోట్ల విలువ రూ.340 కోట్లు అని, ఈ డబ్బు మార్పడి చేయకపోతే చెల్లింపులు చేయటం కష్టమవుతుందని నాసిక్ డిసిసిబి ఛైర్మన్ నరేంద్ర దరాడే పేర్కొన్నారు. అయితే డిమానిటైజేషన్ తరువాత దాదాపు ఆరు నెలల తర్వాత, తమ దగ్గర పాత కరెన్సీ నిల్వలు భారీగా ఉన్నాయని, మార్పిడికి అవకాశం ఇవ్వాలన్న వీటి ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. -
టాటా సన్స్‌కు ఊరట, ఆర్బీఐకి ఝలక్
న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ ఎన్టీటీ డొకోమోతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్‌కు ఢిల్లీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ అవార్డును సమర్ధించడం ద్వారా ఈ ఒప్పందం విషయంలో రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. 2016 జూన్‌లో లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా అంగీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను ఆర్బీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తదాఖలు చేసిన మధ్యంతపర పిటీషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదంలో టాటా సన్స్‌కు భారీ ఊరట లభించింది. కాగా జపాన్ టెలికామ్ సంస్థ ఎన్‌టిటి డొకోమోతో చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్ నిర్ణయించింది. ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా గ్రూప్ అంగీకరించినంది. తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ, రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. ఈమేరకు టాటా సన్స్ 117 కోట్ల డాలర్లను కోర్టులో డిపాజిట్ కూడా చేసింది. టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు. అయితే దీన్ని ఆర్బీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
కార్ల కంపెనీలకు భారీ ఊరట...
న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ వాహనాలపై సుప్రంకోర్టు సంచలన తీర్పు ను వెలువరించింది. ఢిల్లీ - ఎన్ సీఆర్ పరిధిలో 2000 సీసీ, ఆ పైన డీజిల్ వాహనాలకు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2200 సీసీ డీజిల్ కార్లపై నిషేధాన్ని ఎత్తివేసిన సర్వోన్నత న్యాయస్థానం కార్ల ఎక్స్-షోరూమ్ ధరలపై 1 శాతం సెస్సును చెల్లించడం ద్వారా డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్‌ను అనుమతించవచ్చంటూ పేర్కొంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెరిచే ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని దేశించింది. ఈ పేమెంట్ రసీదు చూసిన తరువాత ఆర్టీఏ శాఖ రిజిస్ట్రేషన్‌ను చేపడుతుందని తెలిపింది. అయితే 2200 సీసీ లోపు డీజిల్వాహనాలు, బారీ డీజిల్ వాహనాలపై లెవీ పెంపు తదితర అంశాలపై తమ నిర్ణయాన్ని తర్వాత వెలువరిస్తామని స్పష్టం చేసింది. జర్మన్ కార్ల తయారీ మెర్సిడెస్ బెంజ్ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేసింది. అలాగే బెంజ్, టాటా మోటార్స్ లాంటి ప్రముఖ కార్ల కంపెనీలు 1 శాతం గ్రీన్ సెస్ చెల్లించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆటో రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ 3 శాతం జంప్‌చేయగా, మారుతీ తదితర షేర్లు లాభాలతో దూసుకుపోయాయి. -
నల్లధనం కుబేరులకు ఊరట
న్యూఢిల్లీ: అప్రకటిత ఆదాయాన్ని వెల్లడించడానికి, నాలుగు నెలల గడువునిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడో మరో భారీ వెసులుబాటును కల్పించింది. నల్లధనం వెల్లడికి గాను ప్రభుత్వం తీసుకొచ్చిన వన్-టైమ్ కాంప్లియన్స్ విండో పథకంలో భాగంగా నల్లధనం డిక్లరెంట్స్ కు గుర్తుతెలియని ఆస్తులపై సర్ చార్జ్ మరియు పెనాల్టీ చెల్లింపులలో మార్పులేదని ఆదాయ పన్ను శాఖ గురువారం స్పష్టం చేసింది. అలాగే మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాల్సిన పన్నులో విడతలవారీగా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. కొంత భాగాన్ని ఈ సెప్టెంబర్‌లో, మరికొంతభాగాన్ని వచ్చే ఆర్థిక సం.రం. 2017 సెప్టెంబర్ లోపుగా చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఆదాయాల ప్రకటన, పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోదని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొంతమంది వాటాదారుల ఆచరణీయ ఆటంకాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం కింద చెల్లింపుల కోసం సమయం షెడ్యూల్ పునరుద్దరించాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం 2016 నవంబరు 30 లోపుగా నిర్దేశిత సర్ చార్జ్, పెనాల్టీ లో కనీసం 25 శాతం చెల్లించాలని పేర్కొంది. మరో 25శాతం మార్చి 31, 2017 లోపు, మిగిలిన మొత్తాన్ని 2017 సెప్టెంబర్ 30 లోపుగా చెల్లించాలని పేర్కొంది. కాగా 2016-17 బడ్జెట్లో 4 నెలల కాంప్లియన్స్ విండోను ప్రకటించారు. ఐడిఎస్(ఆదాయం వెల్లడి పథకం)-2016ను జూన్ 1న ప్రారంభించగా, సెప్టెంబర్ 30తో దీని గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. -
ట్విట్టర్ యూజర్స్ కి శుభవార్త
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తన ఖాతాదారులకు మరో శుభవార్త అందించింది. మార్కెట్ లో ప్రత్యర్థుల పోటీని తట్టుకొని నిలబడే క్రమంలో 140 అక్షరాల పరిమితిని తొలగించిన ట్విట్టర్ ఇపుడు యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వీడియోల పరిమితిని 140 సెకండ్లకు పెంచింది. ఇది ట్విట్టర్స్ ఓపెన్ ప్రోగ్రాం 'వైన్ ' కూడా ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లను ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే ప్రకటించారు. లండన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ, బెటర్ వీడియో, పిక్చర్ కంటెంట్ ను అందించే మ్యాజిక్ పోనీ టెక్నాలజీ సంస్థను టేక్ ఓవర్ చేసిన తరువాత ఈ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో 30 సెకండ్లకు మాత్రమే పరిమితమైన వీడియో షేరింగ్ నిడివి ఇపుడు 140 సెకండ్లకు పెంచిది. దీంతోపాటు... తమ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ 'వైన్' ద్వారా డబ్బులను ఆర్జించే పద్ధతికి కూడా అనుమతిస్తోంది. అలాగే వెన్ లో పోస్ట్ చేసే వీడియో నిడివి గతంలో ఆరు సెకండ్లను కూడా 140 సెకండ్లకు పెంచడం విశేషంగా మారింది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ ల దీటుగా ఖాతాదారులను పెంచుకునేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా ఫేస్బుక్ ఇంక్ , ఇన్ స్టా గ్రామ్ ల నుంచి మొబైల్ వీడియో రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుక వీలుగా ఈ చర్యలు తీసుకుంది. అలాగే ట్విట్టర్ ఎంగేజ్ అనే మొబైల్ యాప్ కూడా లాంచ్ చేసినట్టు డోర్సే వెల్లడించారు. 2016 ప్రారంభంతో పోలిస్తే తమ వీడియో ట్విట్స్ సంఖ్య 50 శాతానికి పైగా పెరుగిందన్నారు. అయితే మంగళవారం మార్కెట్ లో ట్విట్టర్ షేర్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. -
'రండి.. వాళ్లను చంపేయండి'
అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు టర్కీ ప్రభుత్వం మరింత వేగవంతమైన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం అమెరికా సాయం పొందనుంది. 32 మంది విద్యార్థులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టర్కీ.. తమ దేశంలో ఉన్న ఎయిర్ బేస్‌ను వాడుకుంటూ సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు రావొచ్చని ఆహ్వానించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఫోన్లో బుధవారం చర్చలు జరపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నుంచి దీని విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు టర్కీలోని ఇన్సిర్లిక్ బేస్ క్యాంపు అత్యంత అనుకూలమైనది. ఇక్కడి నుంచి దాడి చేసేందుకే అమెరికాను టర్కీ ఆహ్వానిస్తోంది. -
హర్యనాలో ఖాప్ పంచాయతీల నిర్ణయం