కార్ల కంపెనీలకు భారీ ఊరట...
న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ వాహనాలపై సుప్రంకోర్టు సంచలన తీర్పు ను వెలువరించింది. ఢిల్లీ - ఎన్ సీఆర్ పరిధిలో 2000 సీసీ, ఆ పైన డీజిల్ వాహనాలకు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2200 సీసీ డీజిల్ కార్లపై నిషేధాన్ని ఎత్తివేసిన సర్వోన్నత న్యాయస్థానం కార్ల ఎక్స్-షోరూమ్ ధరలపై 1 శాతం సెస్సును చెల్లించడం ద్వారా డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్‌ను అనుమతించవచ్చంటూ పేర్కొంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెరిచే ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని దేశించింది. ఈ పేమెంట్ రసీదు చూసిన తరువాత ఆర్టీఏ శాఖ రిజిస్ట్రేషన్‌ను చేపడుతుందని తెలిపింది. అయితే 2200 సీసీ లోపు డీజిల్వాహనాలు, బారీ డీజిల్ వాహనాలపై లెవీ పెంపు తదితర అంశాలపై తమ నిర్ణయాన్ని తర్వాత వెలువరిస్తామని స్పష్టం చేసింది.
జర్మన్ కార్ల తయారీ మెర్సిడెస్ బెంజ్ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేసింది. అలాగే బెంజ్, టాటా మోటార్స్ లాంటి ప్రముఖ కార్ల కంపెనీలు 1 శాతం గ్రీన్ సెస్ చెల్లించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆటో రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ 3 శాతం జంప్‌చేయగా, మారుతీ తదితర షేర్లు లాభాలతో దూసుకుపోయాయి.