'రండి.. వాళ్లను చంపేయండి'
అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు టర్కీ ప్రభుత్వం మరింత వేగవంతమైన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం అమెరికా సాయం పొందనుంది. 32 మంది విద్యార్థులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టర్కీ.. తమ దేశంలో ఉన్న ఎయిర్ బేస్ను వాడుకుంటూ సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు రావొచ్చని ఆహ్వానించింది.
ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఫోన్లో బుధవారం చర్చలు జరపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నుంచి దీని విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు టర్కీలోని ఇన్సిర్లిక్ బేస్ క్యాంపు అత్యంత అనుకూలమైనది. ఇక్కడి నుంచి దాడి చేసేందుకే అమెరికాను టర్కీ ఆహ్వానిస్తోంది.