ఇక అమెరికా, బ్రిటన్ ఎయిర్పోర్ట్స్ వదలం: ఐసిస్ | Pro-IS Twitter account warns of attack at US, Britain airports | Sakshi
Sakshi News home page

ఇక అమెరికా, బ్రిటన్ ఎయిర్పోర్ట్స్ వదలం: ఐసిస్

Published Sat, Jul 2 2016 12:04 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

ఇక అమెరికా, బ్రిటన్ ఎయిర్పోర్ట్స్ వదలం: ఐసిస్ - Sakshi

ఇక అమెరికా, బ్రిటన్ ఎయిర్పోర్ట్స్ వదలం: ఐసిస్

లండన్: అమెరికాను, బ్రిటన్ను కూడా వదలబోమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థకు మద్దతిచ్చేలా ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ బెదిరింపులు వెల్లడయ్యాయి. లాస్ ఎంజెల్స్ ఇంటర్నేషనల్, జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్, లండన్ లోని హ్యాత్రూ ఇంటర్నేషనల్ విమానాశ్రయంపైన, విమానాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐసిస్ హెచ్చరించింది. ఈ నెల (జూలై 4)న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల కాలంలో ఓర్లాండో ఘటన, తర్వాత టర్కీలోని ఇస్తాంబుల్, తాజాగా ఢాకాలో ఐసిస్ ఘటనలు చోటుచేసుకోగా.. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలో ఈ దాడుల ప్రణాళిక విఫలమైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మధ్య ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఐసిస్ తన పడగ విప్పుతునే ఉంది. తాజాగా మరోసారి అమెరికాకు, బ్రిటన్ కు ఈ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో ఆ దేశాలు ముందస్తు జాగ్రత్తకు దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement