'మనపైనే ఐఎస్ కన్ను.. జాగ్రత్తగా ఉందాం' | ISIS poses threat to US and China: top officials From Lalit K Jha | Sakshi
Sakshi News home page

'మనపైనే ఐఎస్ కన్ను.. జాగ్రత్తగా ఉందాం'

Published Thu, Dec 3 2015 10:43 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

'మనపైనే ఐఎస్ కన్ను.. జాగ్రత్తగా ఉందాం' - Sakshi

'మనపైనే ఐఎస్ కన్ను.. జాగ్రత్తగా ఉందాం'

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు అగ్ర రాజ్యాలపైనే కన్నేసింది. ఆ సంస్థ ప్రస్తుతం అమెరికా, చైనా దేశాలపైనే తన దృష్టించిన సారించిందని, ఆయా దేశాల్లో దాడులతో దడపుట్టించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. తాజాగా అమెరికా వైట్ హౌస్ కూడా విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ దృష్టిలో తమ దేశంతోపాటు చైనా కూడా ఉందని, అందుకే తమ దేశాల రక్షణకు సమన్వయంతో ముందుకు సాగాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ విడుదల చేసిన ఓ ప్రకటన తెలిపింది.

ఇటీవల అధ్యక్షుడు ఒబామా వ్యక్తిగత భద్రతాదారుతో కలిసి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుశాన్ ఈ రైస్ చైనా జాతీయ భద్రతా సలహాదారు లిసా మోనాకోతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇరు వర్గీయుల మధ్య సైబర్ వ్యవహారాల చర్చ కూడా వచ్చినట్లు తెలిసింది. ఇతర వివాదాలు ఉంటే వాటిని వేరే మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఓ నిర్ణయానికి ఇరు దేశాల అధికారులు వచ్చారని అమెరికా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement