arbitration award
-
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
టాటా సన్స్‌కు ఊరట, ఆర్బీఐకి ఝలక్
న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ ఎన్టీటీ డొకోమోతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్‌కు ఢిల్లీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ అవార్డును సమర్ధించడం ద్వారా ఈ ఒప్పందం విషయంలో రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. 2016 జూన్‌లో లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా అంగీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను ఆర్బీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తదాఖలు చేసిన మధ్యంతపర పిటీషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదంలో టాటా సన్స్‌కు భారీ ఊరట లభించింది. కాగా జపాన్ టెలికామ్ సంస్థ ఎన్‌టిటి డొకోమోతో చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్ నిర్ణయించింది. ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా గ్రూప్ అంగీకరించినంది. తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ, రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. ఈమేరకు టాటా సన్స్ 117 కోట్ల డాలర్లను కోర్టులో డిపాజిట్ కూడా చేసింది. టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు. అయితే దీన్ని ఆర్బీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.