![YesBank fraud case HC grants bail to Wadhawan brothers - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/08/20/Wadhawan%20brothers.jpg.webp?itok=NzAFhXTF)
ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో వాధవాన్ సోదరులకు బెయిల్ లభించింది. కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనపై జస్టిస్ భారతి డాంగ్రే సానుకూలంగా స్పందించారు. అయితే ఒక్కొక్కరూ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేయడంతోపాటు పాస్‌పోర్టులను అప్పగించాలని వీరిద్దరిని కోర్టు ఆదేశించింది.
మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని మే 14 న ఈడీ అరెస్టు చేసింది. అయితే జూలై 15 న వాధవన్స్, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్, అతని భార్య బిందు కపూర్, కుమార్తెలు రోష్ని, రేఖ, వారి చార్టర్డ్ అకౌంటెంట్ దులరేష్ కె జైన్‌తో పాటు సహచరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 'క్విడ్ ప్రో క్వో' కు సంబంధించి సీబీఐ 2020 మార్చి 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఈడీ ఈ కేసులో విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో వీరిద్దరూ జైలులో ఉండాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment