సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లోఉన్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (74) ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఈ సాయంత్రం 7 గంటల్లోగా బోర్డును ఏర్పాటు చేసి.. శుక్రవారం మధ్యాహ్నానికి నివేదిక అందచేయవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఎయిమ్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ( చిదంబరం ఫ్యామిలీ వైద్యులు ) నాగేశ్వర రెడ్డిని బోర్డులో చేర్చాలని తెలిపింది.
అక్టోబర్ 5న తీవ్ర అనారోగ్యానికి గురైన చిదంబరంను వైద్య పరీక్షల తరువాత వచ్చే16 వారాల పాటు స్టెరాయిడ్ చికిత్సలో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఎయిమ్స్ చికిత్సకు తన శరీరం స్పందించడం లేదనీ, హైదరాబాద్ ఏఐజీ వద్ద అత్యవసర చికిత్సకు బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోర్టును కోరారు. అటు చిదంబరం ఆరోగ్యపరంగా కోలుకునే వాతావరణాన్ని కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన దాదాపు ఏడు కిలోల బరువు కోల్పోయారన్నారు..పరిస్థితి క్షీణిస్తోందని, అతను శుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సిబల్ కోరారు. ఉదర సంబంధమైన తీవ్ర వ్యాధితో బాధపడుతున్న చిదంబరం సోమవారం అస్వస్థత కారణంగా ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
INX Media (Enforcement Directorate case): Delhi High Court directs AIIMS (All India Institute of Medical Sciences) to constitute a medical board comprising of Dr Nageshwar Reddy (family doctor of P Chidambram from Hyderabad) for Chidambram's treatment in AIIMS. (file pic) pic.twitter.com/uJZNqsVYWI
— ANI (@ANI) October 31, 2019
Comments
Please login to add a commentAdd a comment