chidambram
-
చిదంబరం ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లోఉన్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (74) ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఈ సాయంత్రం 7 గంటల్లోగా బోర్డును ఏర్పాటు చేసి.. శుక్రవారం మధ్యాహ్నానికి నివేదిక అందచేయవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఎయిమ్స్‌ను ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ( చిదంబరం ఫ్యామిలీ వైద్యులు ) నాగేశ్వర రెడ్డిని బోర్డులో చేర్చాలని తెలిపింది. అక్టోబర్ 5న తీవ్ర అనారోగ్యానికి గురైన చిదంబరంను వైద్య పరీక్షల తరువాత వచ్చే16 వారాల పాటు స్టెరాయిడ్ చికిత్సలో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఎయిమ్స్ చికిత్సకు తన శరీరం స్పందించడం లేదనీ, హైదరాబాద్ ఏఐజీ వద్ద అత్యవసర చికిత్సకు బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోర్టును కోరారు. అటు చిదంబరం ఆరోగ్యపరంగా కోలుకునే వాతావరణాన్ని కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన దాదాపు ఏడు కిలోల బరువు కోల్పోయారన్నారు..పరిస్థితి క్షీణిస్తోందని, అతను శుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సిబల్ కోరారు. ఉదర సంబంధమైన తీవ్ర వ్యాధితో బాధపడుతున్న చిదంబరం సోమవారం అస్వస్థత కారణంగా ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. INX Media (Enforcement Directorate case): Delhi High Court directs AIIMS (All India Institute of Medical Sciences) to constitute a medical board comprising of Dr Nageshwar Reddy (family doctor of P Chidambram from Hyderabad) for Chidambram's treatment in AIIMS. (file pic) pic.twitter.com/uJZNqsVYWI — ANI (@ANI) October 31, 2019 -
రైల్వే ఉద్యోగాలా? ఇది మరో జుమ్లా - చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రెండేళ్లలో నాలుగు లక్షల రైల్వే ఉద్యోగాలు కల్పిస్తామన్న రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటనపై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. ఇదొక నెరవేరని హామీగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైన రైల్వే శాఖ హఠాత్తుగా నిద్రలేచిందంటూ విమర్శించారు. గత ఐదేళ్లుగా రైల్వేలో దాదాపు 2,82,976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇపుడు అకస్మాత్తుగా ఈ మూడు నెలల్లోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పుడు మోదీ సర్కారు ప్రకటస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఇది మరో జుమ్లా అని ట్వీట్ చేశారు. అనే ప్రభుత్వ విభాగాల్లో ఇదే ధోరణి ఉంది. ఒక వైపు ఖాళీగా ఉన్న పోస్టులు, మరొకవైపు నిరుద్యోగ యువత అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2020 నాటికి రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రానున్న రెండేళ్లలో ప్రస్తుతం ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Railways leave 2,82,976 posts vacant for nearly 5 years and suddenly wake up to say we will fill them in 3 months! Another jumla! The story is the same across many departments of the government. Vacant posts on one side, unemployed youth on the other. — P. Chidambaram (@PChidambaram_IN) January 24, 2019 -
ఈసీకి మొక్కాలా..?
సాక్షి,న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై చెలరేగిన దుమారం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌కు లేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదని ఈసీని కాంగ్రెస్ ప్రశ్నించడాన్ని ప్రధాని తప్పుపట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది.పౌరులు ఈసీని ప్రశ్నించకుంటే మరి ఎవరు ప్రశ్నిస్తారని నిలదీశారు. ‘పౌరులు ఇక ఏం చేయాలి ఈసీకి మొక్కాలా..? ’అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. ఇటీవల గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైన తర్వాత తిరిగి రీకౌంట్ జరిగిన అనంతరం ఆ పార్టీ అభ్యర్థి గెలిచారని..ఇందులో మతలబు ఉందని ప్రధాని చేసిన వ్యాఖ్యలనూ చిదంబరం తిప్పికొట్టారు. తాము రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్‌కు ముందే ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.గుజరాత్ ఎన్నికల తేదీల ప్రకటనలో జాప్యం పట్ల ఈసీని గతంలో కూడా చిదంబరం విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం ప్రధానికి ఈసీ కట్టబెట్టిందని సెటైర్లు వేశారు.మరోవైపు గుజరాత్ ఎన్నికలను జాప్యం చేసేందుకు ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఆక్షేపించింది. -
అఫిడవిట్ ఎందుకు మార్చారు: వెంకయ్య
న్యూఢిల్లీ : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్ మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆయన బుధవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై పేర్కొన్నారు. అంతేకాకుండా ఐబీ అధికారులపై ఒత్తిడి తేవాలని తనను ఇబ్బంది పెట్టారంటూ నాటి హోంశాఖ కార్యాలయ అధికారి ఆర్వీఎస్ మణి చిదంబరంపై ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడినట్లు అయింది. మరోవైపు హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కుల నోటీసు ఇచ్చిన విషయం విదితమే.