విమాన ప్రయాణంలో భారత సంతతికి చెందిన ఓ జంటకు తీరని అవమానం జరిగింది. అదీ ప్రత్యేక జాగ్రత్త, రక్షణ అవసరమైన బిడ్డ విషయంలో సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోను, బాధితతల్లి ఫేస్‌బుక్‌ను పోస్ట్ చేయడంతో ఇదివైరల్ అయింది. ఎయిర్‌లైన్స్ దురాగతంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెడితే దివ్య జార్జ్ దంపతులు, వారి అయిదేళ్ల పాప(స్పెషల్లీ నీడ్ చైల్డ్) ను విమానంలోకి విమాన కెప్టెన్ నిరాకరించాడు. పాప సీటు బెల్ట్‌తో ప్రయాణించడానికి వీల్లేదంటూ మొండిగా వాదించాడు. అయితే ఒళ్లో కూర్చోబెట్టుకోండి..లేదంటే విమానం దిగి పొమ్మన్నాడు. అంతేకాదు రక్షణ రీత్యానే ఇలా చేస్తున్నామని పేర్కొన్నాడు. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ దివ్య ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇలా వివరించారు. 7:35 గంటలకు బయలుదేరాల్సిన తమ విమానాన్ని ఒక గంట ఆలస్యం చేశారు, ఎందుకంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లతో ప్రయాణించటానికి వారు నిరాకరించారు. పాపకు ఏదైనా అయితే బాధ పడాల్సింది మేము కదా అని వాపోయారు. ఇది అన్యాయమనీ, దీంతో మాటలకందనంద బాధ కలిగించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ బడ్జెట్ ఏవియేషన్ హోల్డింగ్స్, స్కూట్ ఎయిర్‌లైన్స్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.
కాగా దివ్య అయిదేళ్ల పాప కేవలం 8.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంది అంటే..ఇది ఏడాది వయస్సున్న పిల్లల వయసుతో సమానమన్నమాట. వెకేషన్‌కోసం ఈ కుటుంబం సింగపూర్‌నుంచి ఫూకట్‌కు బయలుదేరినట్టు సమాచారం. తమకు, తమ బిడ్డకు జరిగిన అవమానం గురించి దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దంపతులుకు సంపూర్ణ మద్దతు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment