Scoot Airlines
-
విమానంలో ప్రయాణించాలా.. ఇదిగో స్పెషల్ ఆఫర్స్!
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన స్కూట్ తాజాగా మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. వీటి కింద పలు దేశాలకు విమాన ప్రయాణ చార్జీలు అత్యంత తక్కువగా రూ. 7,600 నుండి (వన్ వే) ప్రారంభమవుతాయి. ఈ సేల్ సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ప్రయాణాలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. క్రిస్‌ఫ్లయర్ సభ్యులు టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా మైల్స్‌ను పొందవచ్చని, వాటిని క్రిస్‌ప్లస్ యాప్‌లో రిడీమ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆఫర్ ప్రకారం హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి కౌలాలంపూర్‌కు టికెట్ చార్జీ రూ. 8,900 నుండి ప్రారంభమవుతుంది. బాలీ, సింగపూర్, సిడ్నీ తదితర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. -
వైజాగ్–సింగపూర్ రూ. 6,300కే విమాన టికెట్
ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ తాజాగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. వైజాగ్ తదితర నగరాల నుంచి సింగపూర్‌కు అత్యంత తక్కువ రేటు రూ. 6,300 నుంచి (వన్–వే) ఫ్లయిట్ టికెట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ సేల్ సెపె్టంబర్ 1 వరకు అయిదు రోజుల పాటు ఉంటుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి డిసెంబర్ 14 వరకు ఈ టికెట్లను వినియోగించుకోవచ్చు. -
స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)లో భాగమైన స్కూట్ నెట్వర్క్ తాజాగా చౌక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ నగరాల నుంచి విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. రూ. 6,200 నుంచి చార్జీలు మొదలవుతాయని వివరించింది. హైదరాబాద్ నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు రూ. 12,900 నుంచి, వైజాగ్ నుంచి సెబూ (ఫిలిప్పీన్స్)కు రూ. 11,900 నుంచి వన్–వే చార్జీలు (పన్నులు సహా) ప్రారంభమవుతాయని స్కూట్ తెలిపింది. ఈ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. -
బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తమ టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మే 16 నుంచి 20 వరకు ఈ నెట్వర్క్ సేల్ కొనసాగుతుంది. దీని ప్రకారం ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 దేశాలకు తక్కువ చార్జీలకే విమాన ప్రయాణం చేయొచ్చని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే! విశాఖ నుంచి సింగపూర్‌నకు అత్యంత తక్కువగా రూ. 6,200కే (వన్ వే, పన్నులు సహా) టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు వివరించింది. ఆగస్టు 31 వరకు చేసే ప్రయాణాల కోసం ఇవి వర్తిస్తాయని తెలిపింది. -
విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, చెన్నై: సింగపూర్‌కు చెందిన ప్రయివేటు విమానం ఒకటి అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరుచ్చిరాపల్లి నుంచి సింగపూర్ బయలుదేరిన టిఆర్ 567 స్కూట్ విమానం ఇంజీన్‌లో మంటలు, పొగ వ్యాపించడాన్ని పైలట్ గమనించారు. దీంతో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్ అధికారులు అనుమతితో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది సహా 170 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఈ విమానం తిరిగి సింగపూర్ బయలు దేరనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తగిన వసతి సదుపాయాలను కల్పించినట్టు అధికారులు తెలిపారు. -
ఎయిర్‌లైన్స్ దురాగతంపై నెటిజన్ల మండిపాటు
-
సింగపూర్ ఎయిర్‌లైన్స్ అమానవీయం
విమాన ప్రయాణంలో భారత సంతతికి చెందిన ఓ జంటకు తీరని అవమానం జరిగింది. అదీ ప్రత్యేక జాగ్రత్త, రక్షణ అవసరమైన బిడ్డ విషయంలో సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోను, బాధితతల్లి ఫేస్‌బుక్‌ను పోస్ట్ చేయడంతో ఇదివైరల్ అయింది. ఎయిర్‌లైన్స్ దురాగతంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెడితే దివ్య జార్జ్ దంపతులు, వారి అయిదేళ్ల పాప(స్పెషల్లీ నీడ్ చైల్డ్) ను విమానంలోకి విమాన కెప్టెన్ నిరాకరించాడు. పాప సీటు బెల్ట్‌తో ప్రయాణించడానికి వీల్లేదంటూ మొండిగా వాదించాడు. అయితే ఒళ్లో కూర్చోబెట్టుకోండి..లేదంటే విమానం దిగి పొమ్మన్నాడు. అంతేకాదు రక్షణ రీత్యానే ఇలా చేస్తున్నామని పేర్కొన్నాడు. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ దివ్య ఫేస్బుక్ పోస్ట్‌లో ఇలా వివరించారు. 7:35 గంటలకు బయలుదేరాల్సిన తమ విమానాన్ని ఒక గంట ఆలస్యం చేశారు, ఎందుకంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లతో ప్రయాణించటానికి వారు నిరాకరించారు. పాపకు ఏదైనా అయితే బాధ పడాల్సింది మేము కదా అని వాపోయారు. ఇది అన్యాయమనీ, దీంతో మాటలకందనంద బాధ కలిగించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ బడ్జెట్ ఏవియేషన్ హోల్డింగ్స్, స్కూట్ ఎయిర్‌లైన్స్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. కాగా దివ్య అయిదేళ్ల పాప కేవలం 8.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంది అంటే..ఇది ఏడాది వయస్సున్న పిల్లల వయసుతో సమానమన్నమాట. వెకేషన్కోసం ఈ కుటుంబం సింగపూర్‌నుంచి ఫూకట్‌కు బయలుదేరినట్టు సమాచారం. తమకు, తమ బిడ్డకు జరిగిన అవమానం గురించి దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దంపతులుకు సంపూర్ణ మద్దతు లభించింది. -
భారత్‌కు మరో చౌక ఎయిర్‌లైన్స్..
♦ మే 24న స్కూట్ ఎయిర్‌లైన్స్ ఎంట్రీ ♦ ముందుగా మూడు నగరాలకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ మే నెలలో భారత్‌లో అడుగు పెడుతోంది. మే 24న సింగపూర్ కేంద్రంగా చెన్నైతోపాటు అమృత్సర్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తోంది. సింగపూర్-చెన్నై-సింగపూర్‌కు ప్రతిరోజు, సింగపూర్-అమృత్సర్-సింగపూర్‌కు వారంలో మూడు రోజులు విమానాలు నడుస్తాయి. అక్టోబరు 2 నుంచి జైపూర్‌కు విస్తరించనున్నట్టు స్కూట్ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. సింగపూర్-జైపూర్-సింగపూర్‌కు వారంలో నాలుగు సర్వీసులు నడుపుతారు. డ్రీమ్లైనర్ల ద్వారా.. స్కూట్ భారత్‌లో 375 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపనుంది. మరో లో కాస్ట్ విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా మాత్రమే ప్రస్తుతం ఈ విమానాలను భారత్‌కు నడుపుతోంది. 2012లో ప్రారంభమైన స్కూట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన 4వ బ్రాండ్‌గా నిలవనుంది. సింగపూర్‌కు 64 డాలర్లు.. భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28 వరకు పరిమిత కాల ఆఫర్‌ను స్కూట్ ప్రకటించింది. భారత్ నుంచి స్కూట్ నెట్‌వర్క్‌లోని అన్ని నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, అమృత్సర్, జైపూర్ నుంచి సింగపూర్‌కు ఎకానమీ టికెట్ ఒకవైపుకు 64 డాలర్ల నుంచి ప్రారంభం. సిడ్నీకి 189 డాలర్ల నుంచి లభిస్తాయి. టికెట్ల ప్రారంభ ధర బిజినెస్ క్లాస్‌లో సింగపూర్‌కు 179 డాలర్లు, సిడ్నీకి 459 డాలర్లుగా ఉంది. -
భారత్‌కు మరో సింగపూర్ ఎయిర్‌లైన్స్
హైదరాబాద్ : చవక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ మే నెలలో భారత్‌లో అడుగు పెట్టనుంది. మే 24న సింగపూర్ కేంద్రంగా చెన్నైతోపాటు అమృత్సర్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తోంది. సింగపూర్-చెన్నై-సింగపూర్‌కు ప్రతిరోజు, సింగపూర్-అమృత్సర్-సింగపూర్‌కు వారంలో మూడు రోజులు విమానాలు నడుస్తాయి. అక్టోబరు 2 నుంచి జైపూర్‌కు విస్తరించనున్నట్టు స్కూట్ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. సింగపూర్-జైపూర్-సింగపూర్‌కు వారంలో నాలుగు సర్వీసులు నడుపుతారు. కంపెనీ ద్వితీయ శ్రేణి నగరాలకూ సేవలను పరిచయం చేయనుంది. ముఖ్యంగా పర్యాటకంగా వ్యాపార అవకాశాలు ఉన్న కొత్త నగరాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. స్కూట్ భారత్‌లో 375 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపనుంది. మరో లో కాస్ట్ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఆసియా మాత్రమే ప్రస్తుతం ఈ విమానాలను భారత్‌కు నడుపుతోంది. 2012లో ప్రారంభమైన స్కూట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన నాల్గవ బ్రాండ్‌గా నిలవనుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు సంస్థకు చెందిన సిల్క్ ఎయిర్, టైగర్ ఎయిర్ ఇప్పటికే మన దేశంలో సేవలను అందిస్తున్నాయి. ఇక విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం, టాటా సన్స్‌కు 51 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు 64 డాలర్లు.. భారత్‌లో సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28 వరకు పరిమిత కాల ఆఫర్‌ను స్కూట్ ప్రకటించింది. భారత్ నుంచి స్కూట్ నెట్‌వర్క్‌లోని అన్ని నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, అమృత్సర్, జైపూర్ నుంచి సింగపూర్‌కు ఎకానమీ టికెట్ ఒకవైపు ప్రయాణానికి 64 డాలర్ల నుంచి ప్రారంభం. సిడ్నీకి 189 డాలర్ల నుంచి లభిస్తాయి. టికెట్ల ప్రారంభ ధర బిజినెస్ క్లాస్‌లో సింగపూర్‌కు 179 డాలర్లు, సిడ్నీకి 459 డాలర్లుగా నిర్ణయించింది. కాగా స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానంలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది.