
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన స్కూట్ తాజాగా మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. వీటి కింద పలు దేశాలకు విమాన ప్రయాణ చార్జీలు అత్యంత తక్కువగా రూ. 7,600 నుండి (వన్ వే) ప్రారంభమవుతాయి. ఈ సేల్ సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ప్రయాణాలకు వీటిని బుక్ చేసుకోవచ్చు.
క్రిస్‌ఫ్లయర్ సభ్యులు టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా మైల్స్‌ను పొందవచ్చని, వాటిని క్రిస్‌ప్లస్ యాప్‌లో రిడీమ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆఫర్ ప్రకారం హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి కౌలాలంపూర్‌కు టికెట్ చార్జీ రూ. 8,900 నుండి ప్రారంభమవుతుంది. బాలీ, సింగపూర్, సిడ్నీ తదితర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.