కొత్త లుక్‌లో ఎయిర్‌ఇండియా విమానాలు - ఫోటోలు వైరల్ | Air India Planes New Look After Major Change In Logo And Design, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Air India Planes New Look Pics: కొత్త లుక్‌లో ఎయిర్‌ఇండియా విమానాలు - ఫోటోలు వైరల్

Published Sat, Oct 7 2023 3:58 PM | Last Updated on Sat, Oct 7 2023 4:22 PM

Air Indian Planes New Look Viral Photos - Sakshi

టాటా గ్రూప్ ఎయిర్‌ఇండియాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు లోగో, ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీలో మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త డిజైన్ పొందిన ఎయిర్‌ఇండియా విమానాల ఫోటోలను సంస్థ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డిజైన్ పొందిన కార్లు త్వరలోనే వినియోగంలోకి రానున్నట్లు సమచారం.

ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఈ లేటెస్ట్ విమానాలు ఈ శీతాకాలం నాటికి భారత్‌కు రానున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇప్పటికే ఉన్న విమానాలు కూడా ఈ డిజైన్ పొందుతాయని, దీని కోసం దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం. సంస్థ విమానాలన్నీ కూడా 2025 నాటికి ఈ డిజైన్ పొందుతాయని తెలుస్తోంది.

ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!

ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, ది విస్టా, గోల్డ్ విండో ఫ్రేమ్ నుంచి ప్రేరణ పొందిందని ఇంతకుముందు పేర్కొంది. అయితే దీనిని పూర్తిగా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే కొత్త లివరీ అండ్ డిజైన్‌లో ముదురు ఎరుపు, వంకాయ, గోల్డ్ కలర్స్ అందిస్తోంది. ఇవి చూడటానికి కొత్తగా ఆకర్షణీయంగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement