logo design
-
భవిషత్తుకు తగ్గట్లు.. ఒలింపిక్స్ లోగో తయారుచేశాన్సార్!
-
కొత్త లుక్‌లో ఎయిర్ఇండియా విమానాలు - ఫోటోలు వైరల్
టాటా గ్రూప్ ఎయిర్ఇండియాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీలో మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త డిజైన్ పొందిన ఎయిర్ఇండియా విమానాల ఫోటోలను సంస్థ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డిజైన్ పొందిన కార్లు త్వరలోనే వినియోగంలోకి రానున్నట్లు సమచారం. ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఈ లేటెస్ట్ విమానాలు ఈ శీతాకాలం నాటికి భారత్‌కు రానున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇప్పటికే ఉన్న విమానాలు కూడా ఈ డిజైన్ పొందుతాయని, దీని కోసం దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం. సంస్థ విమానాలన్నీ కూడా 2025 నాటికి ఈ డిజైన్ పొందుతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, ది విస్టా, గోల్డ్ విండో ఫ్రేమ్ నుంచి ప్రేరణ పొందిందని ఇంతకుముందు పేర్కొంది. అయితే దీనిని పూర్తిగా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే కొత్త లివరీ అండ్ డిజైన్‌లో ముదురు ఎరుపు, వంకాయ, గోల్డ్ కలర్స్ అందిస్తోంది. ఇవి చూడటానికి కొత్తగా ఆకర్షణీయంగా ఉన్నాయి. Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx — Air India (@airindia) October 6, 2023 -
నేటి నుంచే... ‘ఇండియా’ మూడో భేటీ
ముంబై: జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్టు చెబుతున్నారు. కూటమి లోగోను, సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త, లేదా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీయేకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు. ’బీజేపీ వెళ్లిపో’ నినాదం ఇండియా కూటమిలో ప్రస్తుతం 26 పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ముంబై భేటీ సందర్భంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఇండియా తొలి రెండు సమావేశాలు పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గురువారం నుంచి జరుగనున్న మూడో భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు నగరానికి చేరుకున్నారు. ఈ భేటీ వేదిక నుంచి ’బీజేపీ చలే జావ్’ (బీజేపీ వెళ్లిపో) అనే నినాదం ఇవ్వబోతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. ప్రధానమంత్రికి పదవికి అర్హులైన నాయకులు తమ కూటమిలో చాలామంది ఉన్నారని తెలిపారు. వారిలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. ఇండియా పక్షాల నడుమ ‘కెమిస్ట్రీ’ మెరుగుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. తమ కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతుందని వివరించారు. కన్వీనర్‌గా నితీశ్! ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కూటమి ఏర్పాటు వెనుక తనకు వ్యక్తిగత అ జెండా గానీ, ఆకాంక్షలు గానీ లేవని, కన్వీనర్ పోస్టుపై తనకు ఆసక్తి లేదని ఆయన ప్రకటించినప్పటికీ ఊహాగానాలు ఆగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నేత నితీశ్‌కుమార్ మాత్రమేనని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పేరును మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆ పదవి పట్ల ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కన్వీనర్‌గా ఎవరుండాలో గురువారమే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. -
మీషో బ్రాండ్ కొత్త లోగో ఇదే - ఓ లుక్కేసుకోండి!
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ వాటాలు కలిగిన ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో నూతన బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేసింది. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, మీషో ప్లాట్‌ఫామ్‌ను సమాజంలోని భిన్న వర్గాలు పెద్ద ఎత్తున ఆమోదించేందుకు వీలుగా నూతన లోగోని రూపొందించినట్టు ప్రకటించింది. నూతన లోగోతో బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ప్రజలు మీషోను నేడు, రేపు ఏ విధంగా గుర్తిస్తారనే దానికి బ్రాండ్ ఐడెంటిటీ కీలకమన్నారు. ‘‘దేశంలో ఈ కామర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించేందుకు అపార అవకాశాలున్నా యి. షాపర్లు అందరికీ చేరువ చేయడం ద్వారా తదుపరి దశ వృద్ధిని చూడొచ్చు. పునరుద్ధరించిన బ్రాండ్‌తో మీషో తదుపరి బిలియన్ కస్ట మర్లకు చేరువ అవుతుంది’’అని ఆత్రే తెలిపారు. -
ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్డౌన్లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. Put on your creative cap! Design a logo for the One Nation One Ration Card plan and stand a chance to win a cash prize of Rs.50,000. Visit: https://t.co/puosLH2Bqx today! @fooddeptgoi @UNWFP_India pic.twitter.com/RFbk0pW1ge — MyGovIndia (@mygovindia) April 29, 2021 ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
‘ఏపీ బ్రాండ్ థాన్’ ఎంట్రీలకు ఆహ్వానం..
సాక్షి, అమరావతి : పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ ఇమేజ్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘ఏపీ బ్రాండ్ థాన్’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌కు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఆసక్తికలిగిన వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 28 రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అత్యున్నతమైన మూడు ఎంట్రీలకు నగదు పురస్కారాలు అందజేస్తామని తెలిపింది. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇటీవలే ‘ఏపీ బ్రాండ్ థాన్’ పోస్టర్‌ను మంత్రి ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి ఆవిష్కరించారు. -
డూడుల్ గీయండి... లక్షలు పట్టండి
న్యూఢిల్లీ: విద్యార్థులూ.. మీరు చక్కగా బొమ్మలు వేయగలరా? అయితే గూగుల్ ఓ కొత్త ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. మీరంతా గూగుల్ వెబ్సైట్ తెరవగానే గూగుల్ లోగోపైన డూడుల్ చూసే ఉంటారు. ఏ రోజు ప్రాముఖ్యతను ఆ రోజు చిన్న కార్టూన్ రూపంలో అది సూచిస్తుంది. ఇప్పుడు మీరు గీయబోయే చిత్రం ఆ డూడుల్ స్థానంలో కనిపించనుంది. నవంబర్ 14న ‘బాలల దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్న డూడుల్‌కు కార్టూన్లు వేయాల్సిందిగా గూగుల్ కోరుతోంది. ఇది కేవలం మీ డూడుల్ కనిపించేలా చేయడమే కాదండోయ్.. అయిదు లక్షల క్యాష్‌ను కూడా మోసుకొస్తుంది. ‘నేను పెద్దయ్యే సరికి.. నేనేం ఆశిస్తున్నానంటే’ అన్న అంశం మీద డూడుల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కింద, మీకు ఉన్న ఏ ఆలోచనకైనా రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రుడి మీద జీవితం ఎలా ఉంటుంది? భూమ్మీద కాలుష్యం లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా సాధు జంతువులతో నిండిపోతే ఎలా ఉంటుంది ? వంటి ఏ అంశం మీదైనా డూడుల్ తయారు చేయవచ్చు.డూడుల్‌లో కచ్చితంగా ‘జీఓఓజీఎల్ఈ’ అన్న గూగుల్ స్పెల్లింగ్ ఉండాలి. ఎంపిక ఇలా...: మొదట మీరు గీసిన చిత్రాలన్నింటినీ గూగుల్ బృందం ఎంపిక చేస్తుంది. ఈ బృందంలో బాగా డూడుల్స్ తయారుచేసే నేహా డూడుల్స్ మేడం, యూట్యూబ్‌లో టాలెంట్ చూపించే ప్రజక్త కోళి, మనందరికీ ఇష్టమైన ఛోటా భీమ్ బొమ్మ గీసిన రాజివ్ చికాల కూడా ఉన్నారు. వీరంతా మేటిగా ఉన్న 20 చిత్రాలను ఎంపిక చేస్తారు. వీటిని అక్టోబర్ 21 నుంచి నవంబర్ 6 వరకు పబ్లిక్ ఓటింగ్‌లో ఉంచుతారు. గెలిచిన వారికి 5 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రూ. 2 లక్షల విలువైన సాంకేతికతను మీ పాఠశాలకు ఇస్తారు. -
బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్లో గెలిచాడు. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. -
స్ఫూర్తి శాశ్వతం
నాలుగేళ్లకు ఒక సారి ఒలింపిక్స్ వేదిక మారుతుంది... ఆటగాళ్లు మారతారు... పతక విజేతలు, రికార్డుల జాబితా కూడా మారుతుంది... అయితే ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ అనగానే కొన్ని అంశాలు మాత్రం మనల్ని ప్రతీ సారి అలా పలకరిస్తూ ఉంటాయి. ఐదు వలయాల జెండా, ఒలింపిక్ జ్యోతి, మెరుపులా మెరిసే పతకాలు... అలా అభిమానుల మనసులో ముద్రించుకుపోతాయి. వీటిలో ప్రతీదానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ క్రీడలకు ఉన్నంత చరిత్ర వాటికీ ఉంది. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తిని, ఘనతను గుర్తు చేసే లోగో, జ్యోతి, పతకాలు ఈ క్రీడల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒలింపిక్ జెండా (లోగో) ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియర్రీ డి కూబర్టీన్ స్వయంగా 1912లో ఈ ఐదు రింగుల లోగోను డిజైన్ చేశారు. ఇందులో ఒకదానితో ఒకటి కలిసిపోయి కనిపించే ఐదు రంగులు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు ప్రపంచంలోని ఐదు ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. 1912 స్టాక్‌హోం ఒలింపిక్స్‌లో తొలిసారి ఐదు ఖండాలకు చెందిన దేశాలు పాల్గొన్న తర్వాత వచ్చిన ఆలోచన ఇది. నేపథ్యంలో ఉండే తెలుపు కూడా కలిపి చూస్తే... అన్ని దేశాల జాతీయ జెండాలలో కనిపించే రంగులతో లోగోను తాను రూపొందించినట్లు కూబర్టీన్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్ అనగానే ప్రతీ ఒక్కరి మనసులో ఈ ఐదు వలయాలు మెదలడం ఖాయం. వివిధ దేశాల జాతీయ పతకాలకు ఉన్న స్థాయి, విలువ, గౌరవం ఈ లోగోతో కూడిన ఒలింపిక్ జెండాకు కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రారంభోత్సవ వేడుకల నుంచి ముగింపు ఉత్సవం వరకు దీనిని ప్రదర్శించి తర్వాతి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే నగర మేయర్‌కు దీనిని అందించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఒలింపిక్ జ్యోతి (టార్చ్) ఏథెన్స్లో ఒలింపిక్స్ జ్యోతి వెలిగించడం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా టార్చ్ రిలే జరగడం... ఇలా ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయం 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదలైంది. అయితే 1928లోనే ఒలింపిక్ స్టేడియం వద్ద తొలిసారి క్రీడలు జరిగినన్నీ రోజులు జ్యోతిని మండించారు. అగ్నిని దేవుడిగా భావించే గ్రీకులు ఆటలు నిర్వహించిన సమయంలో దీనిని జ్వలింపజేయడంతో తర్వాత అదే సాంప్రదాయంగా మారింది. ప్రస్తుత పద్ధతి ప్రకారం... క్రీడలకు వంద రోజుల ముందు తొలి ఒలింపిక్స్ జరిగిన ఒలింపియా గ్రామంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో సూర్య కిరణాల సహాయంతో (పారాబోలిక్ మిర్రర్ మెథడ్)తో ఒలింపిక్ జ్యోతిని మండిస్తారు. దానిని ముందుగా సమీపంలోని గ్రీస్ నగరానికి తీసుకెళతారు. అక్కడినుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఒలింపిక్ జ్యోతి పయనమవుతుంది. మంట ఏ దశలోనూ ఆరిపోకుండా ప్రత్యేకంగా తయారు చేసిన టార్చ్ ద్వారా ఈ పరుగు కొనసాగుతుంది. తుదకు నిర్వహణ వేదిక వద్దకు చేరిన అనంతరం ఈ టార్చ్ సహాయంతో జ్యోతిని మండిస్తారు. అది ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు వెలుగుతుంది. విశేషాలు... రియో ఒలింపిక్స్ కోసం గ్రీస్‌లో 450 మంది, బ్రెజిల్లో 12 వేల మంది టార్చ్ బేరర్లుగా వ్యవహరించారు. ఎలాంటి వాతావరణంలోనూ, నీళ్లలో, మంచులో కూడా పాడు కాకుండా ఈ టార్చీలు ఉంటాయి. నిర్వాహక దేశం ఆలోచనల మేరకు ప్రతీ సారి టార్చ్ రూపంలో మార్పులు జరుగుతాయి. 1996, 2000 ఒలింపిక్స్ సందర్భంగా మంట లేకుండా కేవలం ఒలింపిక్ టార్చ్‌ను రోదసిలోకి కూడా పంపించారు. విశేషాలు... ఐదు వలయాల లోగోతో కూడిన జెండాలను 1920 ఆంట్వెర్ప్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఉపయోగించారు. అయితే ఈ క్రీడలు ముగిసిన తర్వాత పతాకం కనిపించకపోవడంతో కొత్తది తయారు చేసి తర్వాతి ఒలింపిక్స్‌లో వాడారు. 77 ఏళ్ల తర్వాత 1997లో హల్ హెగ్ ప్రీస్ట్ అనే స్విమ్మర్ తన దగ్గర ఆ జెండా ఉందంటూ తీసిచ్చాడు. నాటి ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అతను సరదాగా స్థంభం ఎక్కి తాను దానిని దొంగిలించినట్లు చెప్పుకొచ్చాడు. 1998 సియోల్ ఒలింపిక్స్‌నుంచి ప్రస్తుతం ఉన్న జెండాను క్రీడల సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా... అనే ఒలింపిక్ స్ఫూర్తితో కలిపి జెండాలను ప్రదర్శించడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఒలింపిక్ పతకాలు ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన తర్వాత మొదటి రెండు సార్లు స్వర్ణ పతకం లేదు. మొదటి స్థానంలో నిలిచినవారికి రజత పతకం దక్కేది. 1904నుంచి ప్రస్తుతం ఉన్న మూడు రకాల పతకాలను ప్రవేశ పెట్టారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌నుంచి అథ్లెట్ల మెడలో వీటిని వేసే పద్ధతి వచ్చింది. 1912 వరకు స్వర్ణ పతక విజేతలకు అసలైన బంగారంతో కూడిన పతకం ఇచ్చేవారు. నిర్వాహక దేశం ఆలోచనలను బట్టి కొన్ని సార్లు పతకాలలో స్వల్ప మార్పులు చేస్తున్నా... చాలా అంశాలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐఓసీ) కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. మెడల్లో ఒక వైపు క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న వేదిక వివరాలు, లోగో ఉంటాయి. మరో వైపు గ్రీకు దేవత నైకీ బొమ్మ ఉంటుంది. తొలి క్రీడలు జరిగిన పానాథోనికో స్టేడియం కూడా వెనుక కనిపిస్తుంది. నైకీ బొమ్మలో కొన్ని మార్పులు చేసి ప్రస్తుతం ఉన్నదానిని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌నుంచి వాడుతున్నారు. విశేషాలు... ఒక్కో పతకం బరువు 500 గ్రా. లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇది 100 గ్రాములు ఎక్కువ కావడం విశేషం. బంగారు పతకంలో 494 గ్రా. వెండి, 6 గ్రా. మాత్రమే అసలు బంగారం ఉంటుంది. రజత పతకంలో 92.5 శాతం అసలు వెండిని ఉపయోగిస్తారు. కాంస్య పతకంలో రాగి చాలా ఎక్కువగా (93.7 శాతం) ఉండి... టిన్, జింక్ కలిసి ఉంటాయి.ఏ క్రీడలో పతకం గెలిచారో దానిపై రాసి ఉంటుంది. రియో ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ మింట్‌లో తయారు చేసిన మొత్తం పతకాల సంఖ్య 5,130 -
నేడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్, లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్, లోగోను ఈనెల 11న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించింది. వెబ్సైట్ అడ్రస్‌ను ్టటఞటఛి.జౌఠి.జీగా రూపొందించినట్లు సమాచారం. నేటి నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూల్యాంకనాన్ని వచ్చే నెల మొదటి వారం నాటికి పూర్తి చేసి రెండోవారంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. మరోవైపు మూల్యాంకనం రేట్లను పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్‌కి ఇస్తున్న రూ. 6 నుంచి రూ.15కు, స్పెషల్ అసిస్టెంట్‌కు రూ.125 నుంచి రూ.250కు, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.240 నుంచి రూ. 350కు పెంచాలని డిమాండ్ చేసింది. -
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం లోగోను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. ఇదే సందర్భంగా ఆయన విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, విద్యార్థి విభాగం ఏపీ అధ్యక్షుడు షేక్ సలాం బాబు, సందీప్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు పరశురాం, శ్రావణ్, నాగార్జున యాదవ్, ఖాజా, దినేష్, హరిప్రసాద్‌రెడ్డి, రెడ్డిగారి రాకేశ్‌రెడ్డి, లింగారెడ్డి, అంజిరెడ్డి, నాగార్జున యాదవ్ పాల్గొన్నారు.