Meesho unveils new brand logo; details - Sakshi
Sakshi News home page

మీషో బ్రాండ్‌ కొత్త లోగో ఇదే - ఓ లుక్కేసుకోండి!

Jun 9 2023 7:02 AM | Updated on Jun 9 2023 8:25 AM

Meesho brand new logo details - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్‌ వాటాలు కలిగిన ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మీషో నూతన బ్రాండ్‌ ఐడెంటిటీని పరిచయం చేసింది. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, మీషో ప్లాట్‌ఫామ్‌ను సమాజంలోని భిన్న వర్గాలు పెద్ద ఎత్తున ఆమోదించేందుకు వీలుగా నూతన లోగోని రూపొందించినట్టు ప్రకటించింది. 

నూతన లోగోతో బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్‌ ఆత్రే పేర్కొన్నారు. ప్రజలు మీషోను నేడు, రేపు ఏ విధంగా గుర్తిస్తారనే దానికి బ్రాండ్‌ ఐడెంటిటీ కీలకమన్నారు. ‘‘దేశంలో ఈ కామర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించేందుకు అపార అవకాశాలున్నా యి. షాపర్లు అందరికీ చేరువ చేయడం ద్వారా తదుపరి దశ వృద్ధిని చూడొచ్చు. పునరుద్ధరించిన బ్రాండ్‌తో మీషో తదుపరి బిలియన్‌ కస్ట మర్లకు చేరువ అవుతుంది’’అని ఆత్రే తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement