ముంబై విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో టాటా యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త బోయింగ్ బి737-8 విమానాన్ని 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్'గా ఆవిష్కరించారు.
బోయింగ్ 737 మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ పొందుతుంది. ఈ రిఫ్రెష్ బ్రాండింగ్‌ను చైర్ పర్సన్ 'అలోకే సింగ్' (Aloke Singh), సీఈఓ 'కాంప్‌బెల్ విల్సన్' (Campbell Wilson) ఆవిష్కరించారు. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదని తామెవరో, విజన్ ఏంటో.. ఈ మార్పులలో చెప్పదలచుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుందన్నారు. రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, లోగోలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు.
Dear Guests, Fasten your seatbelts for the moment we've all been waiting for. We're thrilled to unveil the new X factor in Indian aviation - the new livery of Air India Express. #FlyAsYouAre #TailsOfIndia pic.twitter.com/Vif5GDQJlH
— Air India Express (@AirIndiaX) October 18, 2023
Comments
Please login to add a commentAdd a comment