సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) వెబ్‌సైట్, లోగోను ఈనెల 11న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించింది. వెబ్‌సైట్ అడ్రస్‌ను ్టటఞటఛి.జౌఠి.జీగా రూపొందించినట్లు సమాచారం.
నేటి నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్
పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూల్యాంకనాన్ని వచ్చే నెల మొదటి వారం నాటికి పూర్తి చేసి రెండోవారంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. మరోవైపు మూల్యాంకనం రేట్లను పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్‌కి ఇస్తున్న రూ. 6 నుంచి రూ.15కు, స్పెషల్ అసిస్టెంట్‌కు రూ.125 నుంచి రూ.250కు, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.240 నుంచి రూ. 350కు పెంచాలని డిమాండ్ చేసింది.
నేడు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్, లోగో ఆవిష్కరణ
Published Sat, Apr 11 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement