TSPSC website
-
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించగా..తొలిరోజే 1,32,406మంది అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు.. ఈనెల 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రిలిమ్స్‌కు 380202 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షను సాఫీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. టెస్ట్ బుక్‌లెట్‌లో మార్పులు...: గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ బుక్‌లెట్‌ను కొత్తగా డిజైన్ చేసింది. ఇదివరకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ కోడ్ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ స్థానంలో ఆరు అంకెల నంబర్‌ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్‌బుక్‌లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–2 అభ్యర్థుల మార్కుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించింది. మొత్తం 1,032 ఉద్యోగ ఖాళీలకు 2,064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా, 2,028 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూకు హాజరైన వారందరి మార్కుల వివ రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు వెల్లడి 909 ఖాళీలకు 843 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఇంగ్లిషుమీడియం) ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 909 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారి వివరాలను కోర్టు ఆదేశాలకనుగుణంగా వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 909 ఖాళీలకు 843 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. 5 ఖాళీలకు సంబంధించిన ఫలితాలు కోర్టులో కేసు ఉన్నందున వెల్లడించలేదని, 39 వికలాంగ ఖాళీల ఫలితాలను విద్యాశాఖ నుంచి అందే తదుపరి సమాచారం ఆధారంగా ప్రకటిస్తామని, మరో 21 ఖాళీలను కూడా కోర్టుల్లో కేసులు, ఏజెన్సీ క్లెయిమింగ్ నిర్ధారణ కారణంగా ప్రకటించలేదని, మరో ఖాళీకి అర్హులైన అభ్యర్థి దొరకనందున 843 మంది జాబితాను ప్రకటించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
2011 గ్రూపు-1 మెయిన్స్‌లో తెలంగాణ అంశాలు
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా, పరీక్షల షెడ్యూలు సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను అప్పటి నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పేపరు-1లోని (జనరల్ ఎస్సే) సెక్షన్-3లో, పేపరు-3లోని (ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ) సెక్షన్ 2, 3లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితా, పరీక్షల షెడ్యూలును టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తంగా 8,760 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 196 మందికి వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,003 మందికి విజయవాడలో, విశాఖపట్నంలో 1,342, వరంగల్‌లో 620, హైదరాబాద్‌లో 4,701, తిరుపతిలో 898 మందికి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల వారీగా కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. -
‘వన్‌టైమ్’కు భారీ స్పందన
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 5.83 లక్షల మంది రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టిన ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)’కు భారీ స్పందన వస్తోంది. కమిషన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ఇప్పటివరకు 5,83,839 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర సర్వీసు కమిషన్‌లో లేని విధంగా ‘ఓటీఆర్’ విధానాన్ని టీఎస్పీఎస్సీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వివిధ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సిలబస్ ప్రకటన, పలు పోస్టుల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నేపథ్యంలో ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ గా ఉన్నారు. పురుషులు 3,93,947 మంది, మహిళలు 1,89,892 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక కీలకమైన గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు జారీ ప్రారంభమైతే ఇది మరింత పెరుగుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అత ్యధికం..: ఓటీఆర్ చేసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత స్థానంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల వారు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 68,979 మంది, వరంగల్ నుంచి 67,514 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 48,295 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఏ రాష్ట్రం పేరూ పేర్కొనకుండా మరో 1,892 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ‘వన్‌టైమ్’కు దరఖాస్తుల తీరు.. జిల్లా పురుషులు మహిళలు మొత్తం మహబూబ్‌నగర్ 31,937 12,692 44,629 రంగారెడ్డి 37,428 21,179 58,607 హైదరాబాద్ 44,298 30,608 74,906 మెదక్ 28,456 12,673 41,129 నిజమాబాద్ 23,630 12,129 35,759 ఆదిలాబాద్ 24,979 10,735 35,714 కరీంనగర్ 45,350 23,629 68,979 వరంగల్ 45,294 22,220 67,514 ఖమ్మం 32,528 15,527 48,055 నల్లగొండ 40,796 17,564 58,360 ఇతర రాష్ట్రాలవారు 37,927 10,368 48,295 రాష్ట్రాన్ని పేర్కొననివారు 1,324 568 1,892 మొత్తం 3,93,947 1,89,892 5,83,839 -
నిరుద్యోగులకు వరం ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’
గాజులరామారం(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగ ప్రకటన చేయగా, త్వరలో అన్ని కేటగిరీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. అయితే యువత ఆలోచనలకు అనుగుణంగా దరఖాస్తు సులభతరం చేయడానికి, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన సమాచారం నేరుగా అభ్యర్థులకు చేరవేయడానికి ప్రభుత్వం ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా అభ్యర్థి పేరును సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసుకుంటే ప్రకటన వివరాలు నేరుగా తెలియజేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఇచ్చిన సమాచారం మేరకు మన అర్హతలకు తగిన ఉద్యోగ సమాచారం మన ఫోన్‌కు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) రూపంలో వస్తుంది. మరి పేరు నమోదుకు ఎం చేయాలి, ఏయే పత్రాలు కావాలి తదితర అంశాలు మీకోసం.. తొలుత http://tspsc.gov.in/TSPSCOTR2015/oneTimeRegistration.tspsc లింక్‌లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ వన్ టైమ్ రిజిష్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో ఆధార్ నంబరు, ఆధార్‌లో ఉన్న పేరును ఎంటర్ చేయాలి. వ్యక్తిగత వివరాలు.. * ఇక్కడ మీ పేరు, చిరునామా, పుట్టిన ఊరు, మండలం, గుర్తింపు వివరాలు, ప్రస్తుత చిరునామా, ఫోన్ నంబరు పొందుపరచాలి. * ఇతరత్రా సందేశాలకు ఈ-మెయిల్ చిరునామా, మినహాయింపు పొందగోరితే ఆ వివరాలు నమోదు చేయాలి. విద్యార్హతలు.. * విద్యాభ్యాసం ప్రారంభం నాటి నుంచి చివరి వరకు అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. * ఇక్కడ మాత్రం ప్రతి తరగతి చదివిన స్కూల్, కాలేజీ పేరు, ప్రదేశంతో పాటు ఉత్తీర్ణత సంవత్సరం, హాల్‌టికెట్ నంబరు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, పొందిన గ్రేడ్ నమోదు చేయాలి. * ఒకటో తరగతి నుంచి ఎంఫిల్ వరకు విద్యార్హతలు నమోదు చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. * ఇతర ప్రత్యేక విద్యార్హతలు ఉంటే ‘యాడ్ క్వాలిఫికేషన్’ ఆప్షన్‌ను ఎంచుకొని వివరాలు నమోదు చేయవచ్చు. ఫొటో అప్లోడ్.. * 50 కేబీ పరిమాణంలో 3.5x4.5 సెం.మీ. పరిమాణంతో కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అప్లోడ్ చేయాలి. * అదేవిధంగా 30 కేబీ పరిమాణంలో 3.5x1.5 సెంమీ వైశాల్యంతో వ్యక్తిగత సంతకాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. * అప్లోడ్ చేసే ముందు ఫొటో దిగిన తేదీని తెలపాలి. అలర్ట్ ఆఫ్షన్.. * ఆఖరుగా ‘నోటిఫికేషన్ అలర్ట్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * ఒక అభ్యర్థి కేవలం ‘గ్రూప్స్’కు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కావాలనుకుంటే ‘గ్రూప్’ ఆప్షన్‌ను, అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కావాలనుకుంటే ‘ఎనీ జాబ్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. * అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ణయించుకున్నాక ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. * ఇప్పుడు మీ మొబైల్‌కు పది అంకెల పాస్వర్డ్, టీఎస్పీఎస్సీ ఐడీ నంబరు సంక్షిప్త సమాచారం వస్తుంది. డెరైక్ట్ రిక్రూట్మెంట్.. * ఇప్పుడు మీకు వచ్చిన పాస్వర్డ్, ఐడీలతో నేరుగా సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. * మళ్లీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. వెబ్ హోమ్ పేజీలో ‘డెరైక్ట్ రిక్రూట్మెంట్’ ఆప్షన్‌లోకి వెళ్లి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. * ఇక్కడ మీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి.. సూచనలను అనుసరించి నిర్ధేశిత రుసుమును చెల్లిస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినట్లే. సూచన: రిజిస్ట్రేషన్ సమయంలో ఏయే వివరాలు నమోదు చేశారో అవి మీ అసలు ధ్రువపత్రాలతో సరిపోవాలి. -
సుపరిపాలనకు సంకేతం కావాలి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై గవర్నర్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ముందుకె ళ్లాలన్నా, వెనక్కి పోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతుల్లోనే ఉందని.. అది సుపరిపాలనకు సంకేతంగా నిలవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. వచ్చే మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వంలో సేవలందించాల్సిన ఉద్యోగుల నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కమిషన్‌పైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారిక లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. అలాగే వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియను ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ముందుకె ళ్లాలన్నా, వెనక్కి పోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతుల్లోనే ఉందన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో విశ్వసనీయత, పారదర్శకత ముఖ్యమని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించుకోవడం గర్వకారణమని, సుపరిపాలన కు ఇది సంకేతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. వెబ్సైట్లో ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ వంటి కొత్త అంశాలను మరిన్ని జోడించాలని సూచించారు. రాష్ట్ర కేడర్ తప్ప మిగతా ఉద్యోగాల భర్తీకి కమల్‌నాథన్ కమిటీతో పనిలేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం తెలంగాణ యువత ఎదురు చూస్తున్నందున, త్వరగా నియామకాల ప్రక్రియలను చేపట్టాలని సూచించారు. ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వివక్షకు లోనైన లక్షలాది మంది తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీలో జరిగిన జాప్యంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. సుమారు 628 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను త్వరలోనే టీఎస్పీఎస్సీకి అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఇంజనీర్ పోస్టుల భర్తీ.. ఉద్యోగ నియామకాల తొలి నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోగా ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పంచాయతీరాజ్‌తో పాటు ఆర్అండ్బీ, నీటిపారుదల విభాగాల్లో సుమారు రెండువేల సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని చెప్పారు. 14న ఐఏఎస్ ప్రొహిబిషనరీ అధికారుల పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సమాచార శాఖ కార్యద ర్శి ఆర్వీ చంద్రవదన్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, సభ్యుడు విఠల్, లోగో రూపకర్తలు అలయ్ లక్ష్మణ్ , రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలు.. ⇒ అభ్యర్థి ప్రతి నోటిఫికేషన్‌కు దరఖా స్తు చేసుకునే అవసరం లేకుండా ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ’ సౌకర్యాన్ని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఏర్పాటు చేశారు. అభ్యర్థుల అర్హతలను బట్టి నోటిఫికేషన్ వివరాలను ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా టీఎస్పీఎస్సీ చేరవేస్తుంది. ⇒ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా అభ్యర్థి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఆన్లైన్లోనే విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. ⇒ దీని ద్వారా తప్పుడు సమాచారానికి ఆస్కారం ఉండదు. డూప్లికేషన్ బెడద తప్పుతుంది. -
నేడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్, లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్, లోగోను ఈనెల 11న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించింది. వెబ్సైట్ అడ్రస్‌ను ్టటఞటఛి.జౌఠి.జీగా రూపొందించినట్లు సమాచారం. నేటి నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూల్యాంకనాన్ని వచ్చే నెల మొదటి వారం నాటికి పూర్తి చేసి రెండోవారంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. మరోవైపు మూల్యాంకనం రేట్లను పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్‌కి ఇస్తున్న రూ. 6 నుంచి రూ.15కు, స్పెషల్ అసిస్టెంట్‌కు రూ.125 నుంచి రూ.250కు, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.240 నుంచి రూ. 350కు పెంచాలని డిమాండ్ చేసింది.