2011 గ్రూపు-1 మెయిన్స్‌లో తెలంగాణ అంశాలు
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను అప్పటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారమే నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పేపరు-1లోని (జనరల్ ఎస్సే) సెక్షన్-3లో, పేపరు-3లోని (ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ) సెక్షన్ 2, 3లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితా, పరీక్షల షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తంగా 8,760 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 196 మందికి వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,003 మందికి విజయవాడలో, విశాఖపట్నంలో 1,342, వరంగల్‌లో 620, హైదరాబాద్‌లో 4,701, తిరుపతిలో 898 మందికి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల వారీగా కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది.