సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది. మొత్తం 1,032 ఉద్యోగ ఖాళీలకు 2,064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా, 2,028 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూకు హాజరైన వారందరి మార్కుల వివ రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే.
టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు వెల్లడి
909 ఖాళీలకు 843 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఇంగ్లిషుమీడియం) ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 909 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారి వివరాలను కోర్టు ఆదేశాలకనుగుణంగా వెల్లడించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 909 ఖాళీలకు 843 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. 5 ఖాళీలకు సంబంధించిన ఫలితాలు కోర్టులో కేసు ఉన్నందున వెల్లడించలేదని, 39 వికలాంగ ఖాళీల ఫలితాలను విద్యాశాఖ నుంచి అందే తదుపరి సమాచారం ఆధారంగా ప్రకటిస్తామని, మరో 21 ఖాళీలను కూడా కోర్టుల్లో కేసులు, ఏజెన్సీ క్లెయిమింగ్ నిర్ధారణ కారణంగా ప్రకటించలేదని, మరో ఖాళీకి అర్హులైన అభ్యర్థి దొరకనందున 843 మంది జాబితాను ప్రకటించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment