group2
-
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన సర్కార్ మరో నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రూప్-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: గ్రూప్ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 110 గ్రూప్-1.. 182 గ్రూప్-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–2 అభ్యర్థుల మార్కుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించింది. మొత్తం 1,032 ఉద్యోగ ఖాళీలకు 2,064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా, 2,028 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూకు హాజరైన వారందరి మార్కుల వివ రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు వెల్లడి 909 ఖాళీలకు 843 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఇంగ్లిషుమీడియం) ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 909 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారి వివరాలను కోర్టు ఆదేశాలకనుగుణంగా వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 909 ఖాళీలకు 843 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. 5 ఖాళీలకు సంబంధించిన ఫలితాలు కోర్టులో కేసు ఉన్నందున వెల్లడించలేదని, 39 వికలాంగ ఖాళీల ఫలితాలను విద్యాశాఖ నుంచి అందే తదుపరి సమాచారం ఆధారంగా ప్రకటిస్తామని, మరో 21 ఖాళీలను కూడా కోర్టుల్లో కేసులు, ఏజెన్సీ క్లెయిమింగ్ నిర్ధారణ కారణంగా ప్రకటించలేదని, మరో ఖాళీకి అర్హులైన అభ్యర్థి దొరకనందున 843 మంది జాబితాను ప్రకటించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదాకు డిమాండ్
కర్నూలు(న్యూసిటీ) : ఏపీపీఎస్సీ గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ప్రజాపరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బలరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రిపరేషన్‌కు తగిన సమయంలో లేకపోవడంతో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెయిన్స్ పరీక్షను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో గ్రూప్-2 అభ్యర్థులు కె.విశ్వనాథ్, నరేష్, హుసేన్ నాయక్, రెడ్డినాయక్, నాగేష్, గురుప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ.. గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష
-
ప్రశాంతంగా గ్రూపు–2 పరీక్ష
–హాల్ టికెట్లు తీసుకున్న అభ్యర్థులు 56,200 –హాజరైన వారు 41,568 – 14,632 మంది గైర్హాజరు – దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు నిల్ -దూరంగా పరీక్షా కేంద్రాలు.. అభ్యర్థులకు తప్పని తిప్పలు –పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ఆదోని మండలానికి చెందిన వారికి ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డకు చెందిన వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఆయా పట్టణాల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థుల తలప్రాణం తోకకు వచ్చింది. కర్నూలు(అగ్రికల్చర్): గ్రూపు–2 ప్రిలిమ్స్(స్కీనింగ్ టెస్ట్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కర్నూలు(కల్లూరుతో సహా), నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరుల్లో పరీక్ష కేంద్రాలు(152) ఏర్పాటు చేశారు. పరీక్షకు 56,200 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 41,568 మంది హాజరయ్యారు. 14,632 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు 73.96 శాతం మంది హాజరయ్యారని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. సరిగ్గా 10 గంటలకు సెంటర్ల మెయిన్ గేట్లను మూసివేశారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో జిల్లా వ్యాప్తంగా 10 మందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. రవీంద్ర విద్యానికేతన్, పాతబస్తీలోని కస్తూరి పాఠశాల కేంద్రాన్ని ఏపీపీఎస్సీ అసిస్టెంటు సెక్రటరీ అలివేలుమంగమ్మ, సెక్షన్ ఆఫీసర్ కృష్ణవేణి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను 11 మంది కో ఆర్డినేషన్ అధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు, లైజన్ అఫీసర్లు, అసిస్టెంటు లైజన్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రశ్నపత్రం సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది జాగరణ... పరీక్షను ఎక్కువ మంది రాస్తుండటం వల్ల ఈ సారి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే భద్రపరిచారు. వీటిని పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేర్చాల్సి ఉండటంతో రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రంతా విధులు నిర్వర్తించారు. ముందుగా అళ్లగడ్డ, తర్వాత కోవెలకుంట్ల, ఆదోని తదితర దూర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను పంపారు. డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఏపీపీఎస్సీ అధికారులు కలెక్టరేట్లోని ఉండి పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఎన్ని ఇబ్బందులో.. పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు శివరాత్రి వేడుకులకు వినియోగించడంతో సకాలంలో బస్సులు అందుబాటులోకి రాలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరంగా సెంటర్లు ఉండడంతో అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. చాలామంది ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లుంటే ఒట్టు... దివ్యాంగులు, గర్భిణులకు కిందనే ప్రత్యేక రూముల్లో సీట్లు వేసి పరీక్ష రాయించాల్సి ఉంది. మొదటి, రెండవ అంతస్తుల్లో వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీపీఎస్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడా ఈ సదుపాయం కలిపించలేదు. దీంతో దివ్యాంగులు, గర్భిణులు అవస్థలు పడ్డారు. పరీక్ష సజావుగా జరిగింది... గ్రూపు–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నాలుగు రోజులుగా చేసిన కృషి ఫలించింది. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఆర్ఓ, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ సహకరించారు. అధికారుల సమష్టి కృషితో పరీక్ష సజావుగా ముగిసింది. -అలివేలుమంగమ్మ అసిస్టెంటు సెక్రటరీ, ఏపీపీఎస్సీ -
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
– గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు వెల్లడి కర్నూలు సీక్యాంప్: గ్రూప్–2 పరీక్షకు నిమిషం ఆలస్యం అయినా అనుమతిచ్చేది లేదని గ్రూప్–2 లైజన్ ఆఫీసర్ టీవీ రమేష్‌బాబు తెలిపారు. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రూప్–2 పరీక్షా 10గంటలకు ప్రారంభం అవుతుందని, 9.45నిమిషాలకు హాల్లోకి చేరుకోవాలని సూచించారు. బ్లాక్,బ్లూ పెన్నులు తప్ప.. వేరే వస్తువులను హాల్లోకి అనుమతివ్వబోమని చెప్పారు. -
గ్రూప్-2 పరీక్ష రాస్తున్నారా..
- ప్రిలిమినరీ పరీక్షకు విధిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి – జిల్లా వ్యాప్తంగా 26న 152 సెంటర్లలో నిర్వహణ – గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి –9.45గంటల తర్వాత అనుమతించారు – పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–2 పరీక్షకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 995 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నెల 26న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఒక పోస్టుకు 670 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాకు సంబంధించి గ్రూపు–2 పరీక్షకు 56,188 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా కర్నూలు, కల్లూరు, నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరులలో 152 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు కో ఆర్డినేటర్‌గా, 11 మంది జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా, 46 మంది తహసీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా, 152 మందితో కూడిన డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ, సీనియర్ అసిసె్టంట్లను అసిస్టెంటు లైజన్ అధికారులుగా జిల్లా కలెక్టర్ నియమించారు. ఇక పరీక్ష కేంద్రాల ప్రిన్స్పాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ అలివేలుమంగమ్మ, సెక్షన్ ఆఫీసర్లు కృష్ణవేణి, వెంకటరావు, సాయిప్రకాశ్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు. అ«భ్యర్థులు పరీక్షకు ముందురోజు తమ సెంటరును చూసుకోవాలని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ అలివేలుమంగమ్మ సూచించారు. నివాస ప్రాంతానికి పరీక్ష కేంద్రం దూరంగా ఉంటే ఒక రోజు ముందుగా సెంటరుకు చేరుకోవడం మంచిదని తెలిపారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు వెంటనే డిబార్ చేస్తామని తెలిపారు. అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్)ను విధిగా చూపాలి. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి 9.45కు పంపుతారు. తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమంతిచరు. హాల్ టికెట్‌పై ఫొటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి మూడు పాస్ పోర్టు ఫొటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. అభ్యర్థి సొంత డిక్లరేషన్ ఇచ్చి పరీక్ష రాయవచ్చు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, చివరికి పెన్సిల్‌ను కూడా అనుమతించరు. పరీక్ష సమయం పూర్తి అయ్యే వరకు బయటకు రాకూడదు. బ్లూ, బ్లాక్ పెన్‌లను మాత్రమే తీసుకెళ్లాలి. ఓఎంఆర్ షీట్‌పై జెల్ పెన్నులు, పెన్సిల్ ద్వారా బబుల్ చేయరాదు. అలాంటి పత్రాలను మూల్యాంకణం చేయరు. దీనిని అభ్యర్థులు పరిగణనలో ఉంచుకోవాలి. అభ్యర్థులకు ప్రశ్నాపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్‌తో ఇస్తారు. ఓఎంఆర్ షీటుకు కింద కార్బన్ కాపీ ఉంటుంది. మొదట ఉన్న ఓఎంఆర్ షీట్‌ను విధిగా ఇన్విజిలేటరుకు ఇవ్వాలి. కార్బన్ షీట్‌ను అభ్యర్థులు ప్రశ్నాపత్రంతో పాటు తీసుకెళ్లవచ్చు. -
రేపు గ్రూప్–2 మోడల్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : విశ్వాస్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 19న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్–2 మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు విశ్వాస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎస్.గైబువల్లి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో విశ్వాస్ కోచింగ్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
వచ్చేనెల 8న గ్రూపు–2 మోడల్ టెస్ట్
కోనసీమలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ మామిడికుదురు : గ్రూపు–2 పరీక్షలకు హాజరయ్యే వారికి జనవరి ఎనిమిదవ తేదీన మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బుధవారం జరిగిన సమావేశంలో టెస్ట్ నిర్వహణ వివరాలను ఆయన తెలియజేశారు. కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, మామిడికుదురు కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు టెస్ట్ జరుగుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం శ్రీఎంపవర్మెంట్ ఫౌండేషన్, ఫూలే, అంబేడ్కర్ యూత్, పీఈటీల అసోసియేషన్, పీవీరావు మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ, బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ టెస్టు నిర్వహిస్తున్నామని చెప్పారు. టెస్టులో మొదటి 50 ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. తదుపరి స్థానాల్లో నిలిచిన 200 మందికి విజేత కాంపిటీటివ్‌కు చెందిన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు నేటి నుంచి జనవరి 7 లోగా పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. మోడల్ టెస్ట్ ఏ సెంటర్లో జరిగేది తరువాత తెలియజేస్తామన్నారు. పేర్ల నమోదుతో పాటు ఇతర వివరాలకు పోతుల సుభాష్‌చంద్రబోస్ (9494236776), దాసరి పటేల్బాబు (9705217999), ఉండ్రు సత్యనారాయణ (9010266102), కె.రామాంజనేయులు (9948608272)లను సంప్రతించాలన్నారు. సమావేశంలో గెడ్డం ప్రదీప్, బొంతు మణిరాజు, మట్టా సత్తిబాబు, జాలెం సుబ్బారావు, కలిగితి పల్లంరాజు, కొనుకు నాగరాజు, బత్తుల జనార్దనరావు, భూపతి సూర్యనారాయణ, ఉప్పే వేణుగోపాల్, ఈతకోట రమణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్ -2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్–2లో ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ–డీఆర్డీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీయువకులు 21, 22వ తేదీల్లో ఉదయం 10 గంటలకు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయం, 08518–277499, 8522083879, 8341581022, 91770016174ను సంప్రదించాలన్నారు. -
మొరాయిస్తున్న గ్రూప్–2 సర్వర్
–దరఖాస్తుకు ఆఖరి తేదీ ఈనెల 10 - నెట్‌సెంటర్ల వద్ద నిరుద్యోగులు క్యూ ఎమ్మిగనూరు: గ్రూప్–2 నోటిఫికేషన్ గత నెల 8వ తేదీన విడుదల అయింది. అభ్యరు్థలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి్స ఉంది. ఆ తరువాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసే సరికి ఒక గంట పాటు సమయం పడుతుంది. అయితే, సర్వర్ సమస్యతో దరఖాస్తుకు చాలా సమయం పడుతోంది. దీంతో రోజుకు 5 లేక 6 లోపే దరఖాస్తులు ఆన్లైన్ చేస్తున్నట్లు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. అంతేకాక గత నాలుగు రోజుల నుంచి చలానా సబ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చి అమౌంట్ సబ్మిట్ కావడం లేదు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు ఆయా ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి వెబ్సైట్ మొరాయిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ రూ. 255 ఏటీఏం ద్వారా చెల్లించాలి. ఆ విధంగా చెల్లించినా ఏపీపీఎస్సీ సైట్లో అప్డెట్ కావడం లేదు. దీంతో నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వర్ కష్టాలను తొలగించాలని కోరుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు గంట పడుతుంది:– రాజు, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఒక్కొక్క దరఖాస్తు పూర్తి చేయాలంటే గంట సమయం పడుతుంది. అంతేకాక రోజుకో ఆప్షన్ రావడంతో మరింత చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు దగ్గర పడుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
గ్రూప్–2లో మరింత తగ్గిన హాజరు
♦ 63.02 శాతానికి పరిమితం ♦ పేపర్–3, పేపర్–4 పరీక్షలూ ప్రశాంతం ♦ పరీక్షల నిర్వహణలో సహకరించిన ♦అందరికీ కృతజ్ఞతలు: ఘంటా చక్రపాణి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 పోస్టుల భర్తీకి చేపట్టిన గ్రూప్–2 పరీక్షల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పేపర్–3, పేపర్–4 రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గింది. శుక్రవారం జరిగిన పేపర్–1, పేపర్–2 పరీక్షలకు 65.60 శాతం మంది హాజరవగా ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 63.02 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని కేంద్రాల్లో ఒకే బార్‌కోడ్‌గల ప్రశ్నపత్రం, ఓఎంఆర్ జవాబుపత్రాల జారీలో పొరబాట్లు దొర్లగా పలు చోట్ల బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించాయి. అయితే పేపర్–1, పేపర్–2 పరీక్షలతో పోలిస్తే పెద్దగా గందరగోళం లేకుండానే మొత్తంమీద పేపర్–3, పేపర్–4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల తొలిరోజు (శుక్రవారం) ఎదురైన అనుభవాలతో అభ్యర్థులు జాగ్రత్తపడ్డారు. పరీక్షలకు చాలా చోట్ల వారు సకాలంలో హాజరయ్యారు. ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలో దాదాపు పది మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం నిబంధన, సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం వంటి కారణాల వల్ల పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో కేంద్రంలో 14 మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం ఒకే నంబర్‌కు బదులు వేర్వేరు నంబర్లతో ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో మూడు పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు మొరాయించాయి. మొదటి రోజు పరీక్షల సందర్భంగా నెట్వర్క్ సమస్య కారణంగా అభ్యర్థులందరి బయోమెట్రిక్ సమాచారం సేకరణ సాధ్యం కాలేదని, కానీ ఆదివారం పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరి బయోమెట్రిక్ డేటాను సేకరించామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించారని, వారి అనుమానాలను కమిషన్ ఎప్పటికప్పుడు నివృత్తి చేసిందన్నారు. కమిషన్ సభ్యులతో కూడిన మూడు బృందాలు హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరిశీలన జరిపినట్లు వివరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సూపరింటెండెంట్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందన్నారు. టీఎస్పీఎస్సీ సిబ్బందితోపాటు 350 స్పెషల్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన జరిపాయన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణికి పరీక్ష... సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన వేములవాడకు చెందిన నంభీ నాగరాణి అనే ఏడు నెలల గర్భిణి రెండో అంతస్తులోని పరీక్ష హాల్లోకి వెళ్లలేక ఇబ్బంది పడింది. ఆమె విన్నపం మేరకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ జేసీ యాస్మిన్ బాషాకు సమాచారం అందించగా ఆమె ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని సహాయకుల ద్వారా నాగరాణిని మెట్లపై ఉన్న గదికి పంపించడానికి ప్రయత్నించారు. ఆమె ఎక్కలేకపోవడంతో ప్రిన్సిపాల్ ప్రాంగణంలో ప్రత్యేక పర్యవేక్షణ మధ్య పరీక్ష రాయించారు. అభ్యర్థి బిడ్డకు మహిళా కానిస్టేబుల్ స్తన్యం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఉన్న జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన మాతృత్వపు మమకారానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు నెలల బిడ్డతో కలసి గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ తల్లి... పరీక్ష కేంద్రం బయట తన బంధువుకు బిడ్డను అప్పగించి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి పాల కోసం గుక్కపెట్టింది. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఆ పాపకు పాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చింది. -
గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: గ్రూపు-2 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నెట్వర్క్ దెబ్బతినడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని, దీంతో దరఖాస్తులను సబ్మిట్ చేయలేకపోయామని అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేయడంతో దరఖాస్తుల గడువును పొడగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. శుక్రవారం దరఖాస్తుల చివరి తేదీ కావడంతో వేల మంది అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తు చేయడంతో సర్వర్ డౌన్ అయింది. దీంతో అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసినా, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయలేకపోయారు. అలాంటి వారంతా కూడా ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు 5 గంటల వరకు 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. మరోవైపు గతంలోనే గ్రూపు-2 కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5.65 లక్షల మంది ఉన్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య 7.48 లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య ఈనెల 26వ తేదీ నాటికి మరింతగా పెరుగనుంది. -
పోరాట ఫలితమే..!
ముషీరాబాద్: నిరుద్యోగుల పోరాట ఫలితంగానే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ముఖ్యమంత్రి నిరుద్యోగుల మన్ననలు పొందాలన్నారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాలను 1027 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం అభినందనీయమన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు. 22 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 11 శాఖల పరిధిలో 1027 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించటం దారుణమన్నారు. ప్రమోషన్లకు అలవాటు పడిన అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాకు రావాల్సిన పోస్టులను వివిధ స్థాయిల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్, గ్రూప్–3 కింద 8500 పోçస్టులను, గ్రూప్–4 ద్వారా 36వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, అంజి, రాంబాబు, బిక్షపతి, అరుణ్‌యాదవ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్-2 నూతన సిలబస్‌లో రాష్ట్ర విభజన అంశాలు
-మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్-2 నూతన సిలబస్‌లో రాష్ట్ర విభజన అంశాలు, విభజన వలన ఏర్పడిన సవాళ్లు పేరుతో చేర్చారని పోటీ పరీక్షల బోధన నిపుణులు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అరం డల్పేటలోని గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్‌లో గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నూతన సిలబస్‌పై అవగాహన కల్పించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ దానిని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, విభజన చట్టంలోని అంశాలు, ఉద్యోగుల విభజన, స్థానికత సమస్యలు, నదీ జలాల పంపిణీ-సమస్యలు, విభజన నేప థ్యంలో మౌలిక వసతులు, పెట్టుబడుల అవసరాలు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-1లో ఒక చాప్టర్‌గా చేర్చారని వివరిం చారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి సిలబస్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.