మొరాయిస్తున్న గ్రూప్–2 సర్వర్
Published Tue, Dec 6 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
–దరఖాస్తుకు ఆఖరి తేదీ ఈనెల 10
- నెట్‌సెంటర్ల వద్ద నిరుద్యోగులు క్యూ
ఎమ్మిగనూరు: గ్రూప్–2 నోటిఫికేషన్ గత నెల 8వ తేదీన విడుదల అయింది. అభ్యరు్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి్స ఉంది. ఆ తరువాత ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసే సరికి ఒక గంట పాటు సమయం పడుతుంది. అయితే, సర్వర్ సమస్యతో దరఖాస్తుకు చాలా సమయం పడుతోంది. దీంతో రోజుకు 5 లేక 6 లోపే దరఖాస్తులు ఆన్‌లైన్ చేస్తున్నట్లు ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. అంతేకాక గత నాలుగు రోజుల నుంచి చలానా సబ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చి అమౌంట్ సబ్‌మిట్ కావడం లేదు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు ఆయా ఇంటర్‌నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి వెబ్‌సైట్ మొరాయిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ రూ. 255 ఏటీఏం ద్వారా చెల్లించాలి. ఆ విధంగా చెల్లించినా ఏపీపీఎస్సీ సైట్‌లో అప్‌డెట్ కావడం లేదు. దీంతో నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వర్ కష్టాలను తొలగించాలని కోరుతున్నారు.
ఒక్కో దరఖాస్తుకు గంట పడుతుంది:– రాజు, ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వాహకుడు
ఒక్కొక్క దరఖాస్తు పూర్తి చేయాలంటే గంట సమయం పడుతుంది. అంతేకాక రోజుకో ఆప్షన్ రావడంతో మరింత చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు దగ్గర పడుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement