వచ్చేనెల 8న గ్రూపు–2 మోడల్ టెస్ట్
మామిడికుదురు : గ్రూపు–2 పరీక్షలకు హాజరయ్యే వారికి జనవరి ఎనిమిదవ తేదీన మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బుధవారం జరిగిన సమావేశంలో టెస్ట్ నిర్వహణ వివరాలను ఆయన తెలియ
కోనసీమలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ
మామిడికుదురు : గ్రూపు–2 పరీక్షలకు హాజరయ్యే వారికి జనవరి ఎనిమిదవ తేదీన మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బుధవారం జరిగిన సమావేశంలో టెస్ట్ నిర్వహణ వివరాలను ఆయన తెలియజేశారు. కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, మామిడికుదురు కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు టెస్ట్ జరుగుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం శ్రీఎంపవర్‌మెంట్ ఫౌండేషన్, ఫూలే, అంబేడ్కర్ యూత్, పీఈటీల అసోసియేషన్, పీవీరావు మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ, బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ టెస్టు నిర్వహిస్తున్నామని చెప్పారు. టెస్టులో మొదటి 50 ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. తదుపరి స్థానాల్లో నిలిచిన 200 మందికి విజేత కాంపిటీటివ్‌కు చెందిన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామన్నారు. టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు నేటి నుంచి జనవరి 7 లోగా పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. మోడల్ టెస్ట్ ఏ సెంటర్‌లో జరిగేది తరువాత తెలియజేస్తామన్నారు. పేర్ల నమోదుతో పాటు ఇతర వివరాలకు పోతుల సుభాష్‌చంద్రబోస్ (9494236776), దాసరి పటేల్‌బాబు (9705217999), ఉండ్రు సత్యనారాయణ (9010266102), కె.రామాంజనేయులు (9948608272)లను సంప్రతించాలన్నారు. సమావేశంలో గెడ్డం ప్రదీప్, బొంతు మణిరాజు, మట్టా సత్తిబాబు, జాలెం సుబ్బారావు, కలిగితి పల్లంరాజు, కొనుకు నాగరాజు, బత్తుల జనార్దనరావు, భూపతి సూర్యనారాయణ, ఉప్పే వేణుగోపాల్, ఈతకోట రమణ తదితరులు పాల్గొన్నారు.