TSPSC Says Groups Notification Coming Soon In Telangana - Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో భారీ నోటిఫికేషన్‌

Published Fri, Sep 2 2022 9:13 PM | Last Updated on Sat, Sep 3 2022 9:01 AM

TSPSC Says Groups Notification Coming Soon In Telangana - Sakshi

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన సర్కార్‌ మరో నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వ‌ర‌లోనే గ్రూప్ 2, 3 నోటిఫికేష‌న్లు రానున్నాయి. ఇప్ప‌టికే గ్రూప్‌-2 కింద 663 పోస్టులు, గ్రూప్‌-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్టుల భ‌ర్తీపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. 

కాగా, శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ద‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రూప్‌-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement