Groups notifications
-
గ్రూప్-1,2 నోటిఫికేషన్లకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
-
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన సర్కార్ మరో నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రూప్-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం జగన్
-
గుడ్‌న్యూస్.. ఏపీలో గ్రూప్–1, 2 పోస్టులు భారీగా పెంపు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీచేయనుంది. -
ఎట్టకేలకు ‘గ్రూప్స్’ నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీ పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఏడు వేరువేరు నోటిఫికేషన్లు జారీచేసింది. ఇందులో గ్రూప్–1లో 169, గ్రూప్–2లో 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 308, పాలిటెక్నిక్ లెక్చరర్లు 405, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు 43, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్లు 10, డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు 5 పోస్టులకు ఈ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఫీజు, ఆన్లైన్ దరఖాస్తుకు వేర్వేరు తేదీలను కమిషన్ ఆయా నోటిఫికేషన్లలో పొందుపరిచింది. స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని, నిబంధనలను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ప్రభుత్వం అనుమతిం చిన కొత్త ఖాళీలతోపాటు గతంలో భర్తీకాకుండా మిగిలున్న పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లలో వేర్వేరుగా చూపించారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని కేటగిరీల పోస్టులు నోటిఫికేషన్లలో పెరగ్గా మరికొన్ని పోస్టులు తగ్గాయి. కీలకమైన గ్రూప్–1 పోస్టులు జీవోలో 182 ఉండగా నోటిఫికేషన్లో 169 మాత్రమే చూపించారు. గ్రూప్–2లో జీవోలో 337 పోస్టులను చూపించగా గతంలో మిగిలిన వాటిని కలుపుకుని 446 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 154, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 292 ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీల్లో దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు తేదీల్ని కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. అలాగే ఈ ఆన్లైన్ దరఖాస్తులకు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి ఆయా దరఖాస్తుల చివరి గడువుకు ముందు తేదీల్లో అర్థరాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ల విడుదలపై సర్కారు జాప్యం రాష్ట్రంలోని దాదాపుగా 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తూతూమంత్రంగానే నోటిఫికేషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఖాళీలన్నీ భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2016లో కానీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అది కూడా కేవలం 4,275 పోస్టులకు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ల జాడలేదు. గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్‌లకోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. వేలాదిమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోవడంతో నష్టపోయారు. వారంతా ఆందోళనలు చేసినా ఉపయోగం లేకపోయింది. తీరా సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సర్కారు పోస్టుల భర్తీ అంటూ హడావుడి చేస్తోంది. వివిధ పోస్టుల భర్తీకోసం గత సెప్టెంబర్ 19న జీవో 153ని విడుదల చేసింది. ఒకవైపు ఖాళీలు లక్షల సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం మాత్రం టీచర్, పోలీసు సిబ్బంది సహా 18,450 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించి నిరుద్యోగులను ఉస్సూరనిపించింది. ఆయా శాఖలు తమకు ఎన్ని పోస్టులు అవసరమో నివేదికలు పంపినా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా మరో కమిటీని వేసి వాటిని సగానికి సగం కుదించేసింది. ఈ పోస్టుల నోటిఫికేషన్లూ వెంటనే వెలువరించలేదు. రిజర్వేషన్లు, రోస్టర్ తదితర సమాచారాన్ని ఏపీపీఎస్సీకి అందించడంలో విపరీత జాప్యం ఫలితంగా నాలుగు నెలల తరువాత కానీ తాజా నోటిఫికేషన్లు రాలేదు. రూల్ 7 ఎత్తివేసి నిరుద్యోగులకు కుచ్చుటోపీ ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకన్నా కొన్ని కేటగిరీల్లో పోస్టులు పెరిగినట్లు చూపుతున్నా అది సర్కారు కనికట్టు మాత్రమే. గతంలో ఏ నోటిఫికేషన్లో అయినా పోస్టుల్లో చేరినవారు రాజీనామా చేసినా, ఇతర కారణాల వల్ల మిగిలిపోయినా ఏపీపీఎస్సీ నిబంధనల్లోని రూల్ 7 ప్రకారం ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు కేటాయించడం జరిగేది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ రూల్ 7ను ఎత్తివేయించారు. ఫలితంగా మిగిలిపోయిన పోస్టులు మెరిట్ అభ్యర్థులకు కాకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేలా నిరుద్యోగులకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. 2016 నోటిఫికేషన్లలో 4,275 పోస్టులు ప్రకటించినా అందులో సగం పోస్టులే భర్తీకాగా తక్కినవన్నీ మెరిట్ అభ్యర్థులకు దక్కకుండా తాజా నోటిఫికేషన్లలో చేరాయి. ఈసారి గ్రూప్–1 పోస్టులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న పోస్టుల్లో ఎండీవో పోస్టులు తాజాగా చూపించలేదని, అందువల్లనే ఆ పోస్టులు తగ్గిపోయాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నోటిఫికేషన్లు ఇద్దామా.. వద్దా?
గ్రూప్స్‌పై టీఎస్పీఎస్సీ తర్జనభర్జన ♦ వయో పరిమితి తంటాను దాటేదెలా? ♦ మరిన్ని పోస్టులు వచ్చేదాకా ఎదురు చూద్దామా? ♦ నోటిఫికేషన్ ఇవ్వకపోతే అభ్యర్థులకు వయో పరిమితి సమస్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్లకు వయో పరిమితి సమస్య ఏర్పడింది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నా.. పోస్టులు తక్కువగా ఉండటంతో టీఎస్పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం మరిన్ని పోస్టులకు అనుమతి ఇస్తుందేమోన ని రెండు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ అదనపు పోస్టులకు ఇప్పటివరకు సీఎం ఆమోద ముద్ర పడలేదు. ఈ నెల 31లోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కొంతమంది అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి సమస్యగా మారనుంది. కొంతమందికి పదేళ్ల వయోపరిమితి పెంపు వర్తించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల జారీపై ఏం చేయాలన్న అంశంపై కమిషన్ వర్గాలు త ర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూప్-1 పోస్టులు 52 మాత్రమే ఉండగా, గ్రూప్-2 పోస్టులు 434 ఉన్నాయి. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులే లేవు. గ్రూప్-2 కోసమే దాదాపు 5 ల క్షల మంది ఎదురుచూస్తున్నారు. ఏడాది వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చినా..: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పైగా ఆ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఉద్యోగ నియామకాల నిబంధనల ప్రకారం.. ఏ యేడాదిలోప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుందో ఆ ఏడాదిలో వచ్చే నోటిఫికేషన్లకు డిసెంబరు 31కి కటాఫ్ అవుతుంది. అంటే 2015 డిసెంబర్ 31లోగా జారీ అయిన ప్రతి నోటిఫికేషన్ 2015లో జారీ అయినట్లే. ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కనుక 2015 జూలై 27 నాటికి 44 ఏళ్ల లోపు ఉన్న జనరల్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. అదే డిసెంబర్ 31 తర్వాత నోటిఫికేషన్లు జారీ అయితే కటాఫ్ సంవత్సరం 2016 అవుతుంది. దీంతో వారు (45 ఏళ్లకు వస్తారు) అనర్హులవుతారు. ఈ నెల 31లోగా గ్రూప్-1, గ్రూప్-2, ఇతర కేటగిరీల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేదా? ఆనే ఆలోచన ల్లో కమిషన్ వర్గాలు ఉన్నాయి. ఉన్న పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చేద్దామా?: ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం లభించి, నియామకాల కోసం టీఎస్పీఎస్సీకి పంపించిన పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేద్దామా అన్న ఆలోచన కూడా కమిషన్ చేస్తోంది. ఇదే సమయంలో ఎక్కువ పోస్టులు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తేనే మంచిదన్న ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా వయో పరిమితి పెంపు ఉత్తర్వులు నిరుద్యోగులకు వర్తిస్తాయి. ఇప్పటివరకు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రభుత్వం నుంచి అదనపు పోస్టులు వచ్చాక.. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని, ఇపుడు ఇచ్చే నోటిఫికేషన్ పరిధిలోకే (2015 నోటిఫికేషన్ కిందకు) తెస్తే సమస్య ఉండదన్న భావన ఉంది. -
గ్రూప్స్ పై సాక్షి అవగాహన సదస్సు
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా విడుదల కానున్న సర్కారీ కొలువుల పై సాక్షి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో.. వరంగల్ జిల్లాలోని కేయూ ఆడిటోరియంలో అక్టోబర్ 1న సాక్షి భవిత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 పరీక్షల ప్యాట్రన్ వెల్లడించడంతో లక్షల మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించినట్లయింది. ఇక ఈ నోటిఫికేషన్లలో విజేతలుగా నిలువాలంటే ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి?..ఏ పుస్తకాలను చదవాలి?..వంటి సందేహాలని నివృత్తి చేసి ... అభ్యర్థులను గెలుపు తీరం చేర్చేందుకు సాక్షి ముందుకు వచ్చింది. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 కొత్త సిలబస్ పై నిపుణులతో విశ్లేషణ అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అక్టోబర్1న కేయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవగాహన సదస్సు జరగనుంది. ముఖ్య అతిథులు ప్రొ. ఘంటా చక్రపాణి- చైర్మన్ టీఎస్పీఎస్సీ ప్రొ. హరగోపాల్- సిలబస్ కమిటీ చైర్మన్ టీఎస్సీస్సీ సుధీర్ బాబు- పోలీస్ కమిషనర్(వరంగల్) రామానుజరావు- ప్రిన్సిపాల్ ఆర్ట్&సైన్స్ కాలేజ్ ఎం. అబ్దుల్ కరీం- భారత దేశం హిస్టీరీ ప్యాకల్టీ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈ కింది నెంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకొగలరు. డి. రమేశ్- 9705346414 కె. నర్సింహరాములు-9010501041 జి.ఎస్.రాజు-9505507612 -
ఉద్యోగ వేట
ఖమ్మం : కొత్త ప్రభుత్వం కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో జిల్లా యు వత ఉద్యోగమే పరమావధిగా సిద్ధమవుతోంది. ప్రభుత్వశాఖలు, బ్యా కింగ్, సింగరేణి, ట్రాన్స్‌కో, జన్కో వంటి సంస్థలు ఉద్యోగాల భర్తీకి గ్రీ న్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగ యువత క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతోంది. జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు కోచింగ్‌కు వెళ్తున్నారు. ఎప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు ఉన్నారు. పుస్తకాల సేకరణ, కోచింగ్ సెంటర్ల ఎంపిక వంటి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పలువురు అభ్యర్థులు గ్రూప్ స్టడీస్‌కు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల ఆశలో మూడు లక్షల మంది ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది ఎదురుచూస్తున్నటున్ల జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు 34,254 మంది, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 21,520 మంది, డిగ్రీ ఆపై చదువులు పూర్తి చేసిన వారు 25వేల మంది, వృత్తి విద్యాకోర్సులు, నర్సింగ్ పూర్తి చేసిన వారు 8 వేల మంది, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసిన వారు 11వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ అభ్యర్థులు 10 వేల మంది వరకు హైదరాబాద్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. వీరే కాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోకుండా ఉన్న వారి సంఖ్య రెండు లక్షల మేరకు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయనే ప్రచారం, వయో పరిమితి సడలింపుతో ఉద్యోగం కోసం చివరి యత్నం చేద్దామనేవారు చాలా మంది వరకు ఉన్నారు. ఎంప్లారుుమెంట్ ఆఫీసులో భారీగా రిజిస్ట్రేషన్లు నూతన ప్రభుత్వం పలు ఉద్యోగాలను ఎంప్లాయిమెంట్శాఖ ద్వారా భర్తీ చేస్తామని, వారు ఇచ్చే జాబితాను ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడంతో తమ పేర్లను ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ శాఖపై పెద్దగా నమ్మకం లేకపోవడం, నిరుద్యోగులను వారు పట్టించుకోక పోవడం వంటి కారణాలతో నమోదుకు వెనకడుగు వేశారు. ఇటీవల సింగరేణి, ఆర్మీ, సోషల్ వెల్ఫేర్ , నవోదయ వంటి శాఖల్లో సబ్‌స్టాఫ్, వెల్డర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషన్ల నియామకం కోసం జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి జాబితాను సేకరించారు. సీనియార్టీ ప్రకారం 2500 మంది ఐటీఐ అభ్యర్థుల జాబితాను సింగరేణి సంస్థకు, 100 మంది ఎయిర్ ఫోర్స్, 80 మంది సోషల్ వెల్ఫేర్, ఇతర సంక్షేమ హాస్టళ్లు, నవోదయ పాఠశాలలకు పంపిచారు. గతంలో నమోదు చేయించుకునే వారు లేక వెలవెలబోరుున ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఇప్పుడు కళకళలాడుతోంది. గత జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం వరకు సుమారు 8వేల మంది పేర్లు నమోదు చేరుుంచుకున్నారు. కోచింగ్ సెంటర్లలో సందడి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురు కావడంతో జిల్లాలోని కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నారుు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ఇప్పటికే పోటాపోటీగా కోచింగ్ సెంటర్లు ప్రచారం నిర్వహిస్తున్నారుు. గ్రూప్స్, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల కోసం జీకే, ఆర్థమేటిక్, ఇతర సబ్జెక్టులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి- సాహిత్యం తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి సబ్జెక్టు నిపుణులను తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. మోడల్ పరీక్షలు, సెమినార్ల వంటివి విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో సంబంధిత అభ్యర్థులు జోరుగా సిద్ధమవుతున్నారు. ట్రాన్స్‌కో, జన్కో పరీక్షల కోసం అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ బాట పట్టారు. -
అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు
-
అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు
‘సాక్షి’ భవిత సదస్సులో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు.. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకూ అందరికీ ఉద్యోగాలని వెల్లడి ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సుకు భారీగా అభ్యర్థుల రాక కిక్కిరిసిపోయిన త్యాగరాయ గానసభ ప్రాంగణం.. రహదారుల పక్కన స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శన అప్పటికప్పుడు నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు ఏర్పాటు రెండు చోట్లా అభ్యర్థులకు అవగాహన కల్పించిన నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలతో ముందుకువెళుతున్నామని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. గ్రూప్ పరీక్షలకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు తన మాటలనే ప్రకటనగా భావించవచ్చని పేర్కొన్నారు. ‘సాక్షి భవిత’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ, నగర కేంద్ర గ్రంథాలయంలో ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది. ఊహించినదానికంటే ఈ సదస్సుకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వేల సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో త్యాగరాయ గానసభ కిక్కిరిసిపోయి, బయట కూడా నిలబడిపోయారు. ఆ వీధులన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. దీంతో బయట ఉన్న వారి సౌకర్యార్థం భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇంకా వస్తుండడంతో అప్పటిక ప్పుడు ఇక్కడి నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ రెండు చోట్లా ఏకకాలంలో సదస్సు కొనసాగింది. వక్తలు ఒకచోట ప్రసంగించిన తర్వాత.. మరో వేదిక వద్దకు నడిచి వెళ్లి ప్రసంగించారు. అభ్యర్థులు నిపుణులు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నారు. సిలబస్, పరీక్షా విధానంపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సుకు ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. పారదర్శకంగా నియామకాలు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఘంటా చక్రపాణి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘‘కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొలితరం ఉద్యోగులు మీరే. ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా కష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని సాధించండి. ఉద్యోగ అభ్యర్థుల కోసం ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వంటి వాటిని సద్వినియోగం చేసుకోండి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు జరుగుతాయి. నాకుగానీ, మా సభ్యులకు కానీ ఎలాంటి సొంత ప్రయోజనాలు లేవు. అందరూ విద్యావంతులు, ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నవాళ్లే..’’ అని చక్రపాణి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇప్పుడున్నట్లుగా గ్రూప్-1, గ్రూప్-2 విభజన ఉండ బోదని, సివిల్స్ తరహాలో ఒకేవిధంగా తెలంగాణ సివిల్ సర్వీస్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆ పరీక్షల్లో పొందిన మార్కులకు అనుగుణంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మరో వారంలో గ్రూప్-1, 2 సిలబస్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే అభ్యర్థులు సిలబస్‌పై స్పష్టత కోరుతున్నారని, ఏ పుస్తకాలు చదవాలో అడుగుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ సిలబస్‌ను మాత్రమే రూపొందిస్తుందని, ఎలాంటి పుస్తకాలో చదవాలో చెప్పదని స్పష్టం చేశారు. అభ్యర్థులు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని సూచించారు. వాయిదా వేసే ప్రసక్తే లేదు పరీక్షల నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని చక్రపాణి పేర్కొన్నారు. అటువంటి ఆలోచనను దరిచేరనీయవద్దని, పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘‘తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఉంటే... 6 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు సగటున వంద మంది పోటీపడుతున్నారు. అయినా అధైర్యం వద్దు. కష్టపడి చదివిన వారికి ఫలితం తప్పకుండా దక్కుతుంది. విద్యార్థులు ఏ రంగంలో చదువుకున్నారో.. ఆ రంగంలోని ఉద్యోగాలకు పోటీపడితే మంచిది. తమ సబ్జెక్టులో ఉన్న ప్రతిభకు నైపుణ్యాలు సంపాదిస్తే ఉద్యోగం సులువుగా సంపాదించవచ్చు. ఉద్యోగంలో త్వరగా స్థిరపడవచ్చు. అలా కాకపోతే మిగిలిన ఉద్యోగాలకు అనవసర పోటీ పెరుగుతోంది. ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ పెట్టాలన్న అంశంపై 30 మంది మేధావులతో చర్చించాం. పాలకులకు మాత్రమే విజన్ ఉంటే సరిపోదు.. అధికారులకూ ఉండాలి. ఉద్యోగం అనేది మిమ్మల్ని పోషించుకోవడానికి కాదు, రాష్ట్రానికి సేవ చేయడానికి ఇచ్చిన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. అంకితభావం, చొరవ, స్పష్టత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీపై ఉంది. కమిషన్‌పై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పుట్టిన ప్రాంతాన్ని అడగడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం కోసమే నోటిఫికేషన్ వేశారని, ఆంధ్రవాళ్లకు అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారు. అవును.. తెలంగాణ ప్రాంత సమాజం కోసమే టీఎస్పీఎస్సీ ఉంది. రాజ్యాంగం మాకు ఆ హక్కు కల్పించింది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిభ ఉంటే నిబంధనల ప్రకారం ఉద్యోగాలు దక్కుతాయి..’’ అని వ్యాఖ్యానించారు. 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు.. గతంలో లేనివిధంగా అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించబోతున్నట్లు చక్రపాణి చెప్పారు. ‘‘రాబోయే 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు బిల్ కలెక్టర్, డిగ్రీ విద్యార్థులకు హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్... ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ తది తర బ్రాంచ్‌లు చేసిన విద్యార్థులకూ నోటిఫికేషన్లో స్థానం కల్పిస్తాం. హైదరాబాద్‌లో 250 బిల్ కలెక్టర్ పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్, గెజిటెడ్ పోస్టులలో అభ్యర్థుల విషయ పరి జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపై పట్టు తదితర అంశాలపై వారి సామర్థ్యాన్ని బేరీజు వేయడానికి ఇంట ర్వ్యూ తప్పనిసరి.,’’ అని పేర్కొన్నారు. సీరియస్‌గా సిద్ధమైతే విజయం మీదే ‘‘పోటీ పరీక్షల్లో తెలంగాణ ఆర్థిక, సామాజిక అంశాలు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ‘ది ఇన్వెంటింగ్ తెలంగాణ-సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ -2014’ పుస్తకం విద్యార్థులకు ఎంతో దోహదం చేస్తుంది. సీరియస్‌గా సన్నద్ధమైతే విజయం వరిస్తుంది..’’ఆటుపోట్లు ఎదురైతే నిరాశ చెందొద్దు. ఒక్కదారి మూసుకుంటే మరో దారి ఉందన్న ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. - ప్రొఫెసర్ కోదండరామ్ త్వరలోనే సిలబస్ ‘‘తెలంగాణ ఉద్యమ క్రమం, సాయుధ పోరాటం, ముల్కీ, నాన్ ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం.. తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. ఇందుకు సంబంధించి ప్రొఫెసర్లతో కలసి సమగ్ర సిలబస్ రూపొందించాం. త్వరలోనే పుస్తక రూపంలో అభ్యర్థుల ముంగిటకు రానుంది. తెలంగాణ ప్రాంతం వాళ్లే పేపర్ వాల్యూయేషన్ చేస్తారు’’ - వి.ప్రకాశ్, ప్రొఫెసర్ జయశంకర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు నైపుణ్యమే వరం ‘‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యమే వరం.. అది లేకుంటే భారమే. గైడ్ విధానాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ విధానం ద్వారా అభ్యర్థులు సహజసిద్ధ ఆలోచనలు చేయడం లేదు. సృజనాత్మకత పెంపొందడం లేదు. కోర్ సబ్జెక్టులపై విద్యార్థులు దృష్టి సారించాలి. ఇంటర్వ్యూ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ - విద్యావేత్త చుక్కా రామయ్య రెండు లక్షల ఉద్యోగాల భర్తీ: నాయిని తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఖాళీల వివరాలు రాగానే ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో దశల వారీగా రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని నాయిని చెప్పా రు. ఉద్యోగా ర్ధులం తా ఏకాగ్రతతో చది వి ఉద్యోగాలు సాధిం చాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట వేస్తోందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి తెలిపారు. త్వరలో వారికోసం ప్రత్యేక పేజీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల కోసం జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని రామచంద్రమూర్తి అన్నారు. నిరుద్యోగులకు విజయాల బాటలో ‘సాక్షి’ నిరంతరం చేయూతనిస్తుందని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి భరోసా ఇచ్చారు. -
గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..
‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానం రూపొందించిన తరువాతే గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పరీక్షా విధానం రూపకల్పన, సిలబస్‌ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీలతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు. కమిషన్‌లో త్వరలో చేపట్టనున్న మార్పులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణపై రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేస్తుంది. మరో కమిటీ పరీక్షల విధానం, షెడ్యూల్‌పై అధ్యయనం చేసి కమిషన్‌కు నివేదిక ఇస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సిలబస్‌ను ప్రకటిస్తాం. మార్చి తరువాతే గ్రూప్-1, 2 నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. జనవరిలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని సర్వీస్ కమిషన్ చేపట్టే అంశంపై విద్యాశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నాం. యూపీఎస్సీ తరహా పరీక్షా విధానం దేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును పరిశీలించిన తరువాతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. అందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫలితాల ప్రకటన తేదీలను పరీక్షకు ముందుగానే తెలియజేస్తాం. అభ్యర్థుల వ్యక్తిత్వం తెలుసుకునేందుకు సివిల్స్ తరహాలో అదనంగా మరో పేపర్‌ను గ్రూప్-1 పరీక్షలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. గ్రూప్1, గ్రూప్-2 (ఎగ్జిక్యూటివ్) పరీక్షలకు ఇంటర్వ్యూలుంటాయి. నిష్పాక్షికంగా, పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఇంటర్వ్యూకు మార్కులుంటాయి. కేరళ తరహాలో... కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా... డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల వివరాలు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగుల డేటా బేస్ మా వద్ద సిద్ధంగా ఉంటుంది. ప్రతి పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానం ప్రవేశపెడతాం. ఇక ఆయా శాఖలో ఏటా ఎన్ని పదవీ విరమణలు (రిటైర్మ్ంట్స్) ఉంటాయో ముందే జాబితా సిద్ధం చేసుకొని వారు రిటైరయ్యే సమయానికి కొత్త అభ్యర్థులు ఆ పోస్టుల్లో చేరే విధంగా పరీక్షలు ముందుగానే నిర్వహించి అభ్యర్థుల మెరిట్ లిస్టు సిద్ధంగా ఉంచుతాం. ఆ శాఖ కోరగానే ఈ జాబితాను వారికి అందజేస్తాం. దీంతో తక్షణం ఖాళీల భర్తీ చేయడానికి వీలవుతుంది. మెరుగైన పాలన, సుపరిపాలన అందించే అవకాశం ఉంటుంది. జనవరిలో ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు అన్ని విభాగాల అధిపతులతో చీఫ్‌సెక్రటరీ సమక్షంలో జనవరిలో కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అప్పుడే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి. ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఇక ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఖాళీలను గుర్తించి, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత కమిషన్‌కు అందజేస్తేనే మేం పరీక్షలు నిర్వహిస్తాం. లక్ష ఉద్యోగాలా అంతకంటే ఎక్కువా తక్కువా అన్న అంశం ప్రభుత్వం పరిశీలిస్తుంది. పకడ్బందీగా పరీక్షలు అనువాదం, అన్వయ దోషాలు లేకుండా చూసేందుకు కమిషన్‌లో అకడమిక్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఇందులో ఆయా సబ్జెక్టుల ప్రొఫెసర్లుంటారు. పరీక్షలకు సంబంధించి ప్రశ్నల నిధిని కూడా రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా గుర్తించే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ప్రతి పరీక్షకు 4 సెట్ల ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్ష జరిగే రోజున ఒక సెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తాం. కొత్త రాష్ట్రం.. కొత్త సిలబస్.. గ్రూప్స్ పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉండటం తప్పనిసరి. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వనరులు, నైసర్గిక స్వరూపం, పరిశ్రమలు, సాహిత్యం, ఆర్థిక వ్యవస్థ స్వరూపం, కవులు, తెలంగాణ ఉద్యమం తదితర అన్ని అంశాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలుంటాయి. నిపుణుల కమిటీ నివేదిక వస్తేనే సిలబస్‌పై స్పష్టత వస్తుంది. తగినంత సిబ్బంది లేకనే ఆలస్యం సర్వీస్ కమిషన్ నూతనంగా ఏర్పాటైనా పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వనరులు లేకపోవడం వల్లే పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు పూర్తిస్థాయి సిబ్బంది, కార్యాలయం, బడ్జెట్ కేటాయిస్తుందని భావిస్తున్నాం. ఆ తరవాతే కమిషన్ పనులు వేగవంతమవుతాయి. స్థానికత నిర్థారించేది ప్రభుత్వమే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వం 1956నే ప్రామాణికంగా తీసుకుంటే దాన్నే కమిషన్ అమలుచేస్తుంది.