CM Jagan Gives Clearance for APPSC Group Posts - Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌–1, 2 పోస్టులు భారీగా పెంపు

Published Fri, Mar 18 2022 6:28 PM | Last Updated on Sat, Mar 19 2022 8:18 AM

Andhra Pradesh: CM Jagan Give Clearence For Appsc Group Posts - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్‌–1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్‌ఓ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీచేయనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement