ఉద్యోగ వేట | Job Hunting | Sakshi
Sakshi News home page

ఉద్యోగ వేట

Published Mon, Aug 24 2015 4:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

ఉద్యోగ వేట

ఉద్యోగ వేట

ఖమ్మం : కొత్త ప్రభుత్వం కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో జిల్లా యు వత ఉద్యోగమే పరమావధిగా సిద్ధమవుతోంది. ప్రభుత్వశాఖలు, బ్యా కింగ్, సింగరేణి, ట్రాన్స్‌కో, జన్కో వంటి సంస్థలు ఉద్యోగాల భర్తీకి గ్రీ న్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగ యువత క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతోంది. జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు కోచింగ్‌కు వెళ్తున్నారు. ఎప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు ఉన్నారు. పుస్తకాల సేకరణ, కోచింగ్ సెంటర్ల ఎంపిక వంటి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పలువురు అభ్యర్థులు గ్రూప్ స్టడీస్‌కు సిద్ధమవుతున్నారు.

 ఉద్యోగాల ఆశలో మూడు  లక్షల మంది
 ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు  లక్షల మంది ఎదురుచూస్తున్నటున్ల జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు 34,254 మంది, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 21,520 మంది, డిగ్రీ ఆపై చదువులు పూర్తి చేసిన వారు 25వేల మంది, వృత్తి విద్యాకోర్సులు, నర్సింగ్ పూర్తి చేసిన వారు 8 వేల మంది, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసిన వారు 11వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ అభ్యర్థులు 10 వేల మంది వరకు హైదరాబాద్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

వీరే కాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోకుండా ఉన్న వారి సంఖ్య రెండు లక్షల మేరకు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయనే ప్రచారం, వయో పరిమితి సడలింపుతో ఉద్యోగం కోసం చివరి యత్నం చేద్దామనేవారు చాలా మంది వరకు ఉన్నారు.

 ఎంప్లారుుమెంట్ ఆఫీసులో భారీగా రిజిస్ట్రేషన్లు
 నూతన ప్రభుత్వం పలు ఉద్యోగాలను ఎంప్లాయిమెంట్‌శాఖ ద్వారా భర్తీ చేస్తామని, వారు ఇచ్చే జాబితాను ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడంతో తమ పేర్లను ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ శాఖపై పెద్దగా నమ్మకం లేకపోవడం, నిరుద్యోగులను వారు పట్టించుకోక పోవడం వంటి కారణాలతో నమోదుకు వెనకడుగు వేశారు. ఇటీవల సింగరేణి, ఆర్మీ, సోషల్ వెల్ఫేర్ , నవోదయ వంటి శాఖల్లో సబ్‌స్టాఫ్, వెల్డర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషన్ల నియామకం కోసం జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి జాబితాను సేకరించారు.

సీనియార్టీ ప్రకారం 2500 మంది ఐటీఐ అభ్యర్థుల జాబితాను సింగరేణి సంస్థకు, 100 మంది ఎయిర్ ఫోర్స్, 80 మంది సోషల్ వెల్ఫేర్, ఇతర సంక్షేమ హాస్టళ్లు, నవోదయ పాఠశాలలకు పంపిచారు. గతంలో నమోదు చేయించుకునే వారు లేక వెలవెలబోరుున ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఇప్పుడు కళకళలాడుతోంది. గత జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం వరకు సుమారు 8వేల మంది పేర్లు నమోదు చేరుుంచుకున్నారు.

 కోచింగ్ సెంటర్లలో సందడి
 ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురు కావడంతో జిల్లాలోని కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నారుు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ఇప్పటికే పోటాపోటీగా కోచింగ్ సెంటర్లు ప్రచారం నిర్వహిస్తున్నారుు. గ్రూప్స్, కానిస్టేబుల్స్, ఎస్‌ఐ ఉద్యోగాల పరీక్షల కోసం జీకే, ఆర్థమేటిక్, ఇతర సబ్జెక్టులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న తెలంగాణ చరిత్ర, సంస్క­ృతి- సాహిత్యం తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి సబ్జెక్టు నిపుణులను తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. మోడల్ పరీక్షలు, సెమినార్ల వంటివి విస్త­ృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో సంబంధిత అభ్యర్థులు జోరుగా సిద్ధమవుతున్నారు. ట్రాన్స్‌కో, జన్కో పరీక్షల కోసం అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ బాట పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement