jobs Replacement
-
ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది కావస్తుండగా... తాజాగా కేటగిరీల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 సెపె్టంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ప్రభుత్వ విభాగాల్లో 1,540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకుగాను గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను కమిషన్ నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ... ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు అర్హత పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ వెల్లడించింది. 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఏఈఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లోని పరిపాలన విభాగంలో ఈ పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను తెరిచి చెక్‌లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలని, అప్లికేషన్ పత్రాలను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలని, అదేవిధంగా అటెస్టెషన్ పత్రాలను కూడా రెండు సెట్లు ప్రింట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. చెక్‌లిస్టులో నిర్దేశించినట్లుగా అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించకుంటే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చేది లేదని కమిషన్ తేల్చిచెప్పింది. వెబ్సైట్లో డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల తేదీలు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్‌డబ్ల్యూఓ) ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డీఏఓ ఉద్యోగ ఖాళీలు 53, హెచ్‌డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నాయి. -
వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటనే హోంగార్డుల నియామకాలు పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు. మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాల భర్తీ
సాక్షి, ఆదిలాబాద్/కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త సంవత్సరంలో 90 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం కార్నర్ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యులైన చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 30లక్షలమంది నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1లక్ష 60వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. బిశ్వాస్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1లక్ష 97వేల 700 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనీ, ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేసిందెక్కడ అని ప్రశ్నించారు. త్వరలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారని తెలిపారు. ఎంఐఎం ఎటు పక్షమో తేల్చుకోవాలి.. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ తొలగించడం నీ జాగిరా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఆ పార్టీతో దోస్తీ చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం ఎటు పక్షమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఓట్లతో ప్రయోజనం పొందుతున్న బీఆర్ఎస్ వైపా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, సి.రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావెద్, సిరిసిల్ల రాజయ్య, గడ్డం వినోద్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి వడగండ్లతో దెబ్బతిన్న వరిపంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని పొందుర్తి గ్రామ శివారులో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరిపంటను, కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ తాగుబోతు సమ్మేళనాలు నిర్వహిస్తోందని విమర్శించారు. రేవంత్ వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
Gurukul Jobs: పూర్తిస్థాయి పీజీటీ, ఆర్ట్ టీచర్ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ నెల 5న టీఆర్‌ఈఐఆర్‌బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా... తాజాగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ), ఆర్ట్ టీచర్ కొలువులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటి ఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక టనలన్నీ గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 ప్రకటనలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఈ నెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు గురుకుల బోర్డు అధికారులు చెబుతున్నారు. 1,276 పీజీటీ పోస్టులు... గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 1,276 ఉన్నాయి. ఇందులో అత్యధికం మహిళలకే రిజర్వ్ కావడం గమనార్హం. బాలికల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వంద శాతం మహిళలకే కేటాయించడంతోపాటు బాలుర విద్యాసంస్థల్లో 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ మేరకు పోస్టుల కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో 966 పీజీటీ పోస్టులు మహిళలకు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 310 పోస్టులు వచ్చాయి. పీజీటీలోని మొత్తం పోస్టుల్లో మహిళలకు 75.70 శాతం ఉద్యోగాలు, జనరల్ కేటగిరీలో 24.30 శాతం రిజర్వ్ అయ్యాయి. ఆర్ట్ టీచర్ పోస్టులు 132 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఆర్ట్ టీచర్ కేటగిరీలో 132 పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇందులో మహిళలకు 112 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. మోత్తం పోస్టుల్లో మహిళలకు 84.85 శాతం కేటాయింపు కాగా జనరల్ కేటగిరీలో 15.15 శాతం పోస్టులు లభించాయి. -
కమిషన్ ప్రతిష్టకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రతిష్టకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తూ దేశంలోనే ఉత్తమ పబ్లిక్ సర్విస్ కమిషన్‌గా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పేపర్ లీకవడం, కమిషన్ ఉద్యోగులే దీనికి పాల్పడటంతో ఒక్కసారిగా అలజడికి గురైంది. మూడో వంతు టీఎస్పీఎస్సీ ద్వారానే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో మూడో వంతుకుపైగా టీఎస్పీఎస్సీ ద్వారానే చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన క మిషన్.. వాటిలో కొన్నింటికి దరఖాస్తులు స్వీకరిస్తోంది కూడా. ఇందులో కీలకమై న గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తవగా.. మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని కేటగిరీలకు త్వరలో అర్హత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో కమిషన్‌కు చెందిన సీక్రెట్ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లడంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయంటూ.. ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. కానీ టౌన్ ప్లానింగ్ పేపర్‌ను ఓ ఉద్యోగి స్వయంగా లీక్ చేసినట్టు వెల్లడికావడం కలకలం రేపింది. ఇంకా ఏమైనా లీకయ్యాయా? టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు/ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం వాయిదా వేసిన రెండు పరీక్షల సమాచారం మాత్రమే బయటకు పొక్కిందా? లేక ఇంతకుముందే జరిగిన పరీక్షలు, త్వరలో జరగాల్సిన పరీక్షల సమాచారం ఏమైనా బయటికి వెళ్లిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాసిన, రాయాల్సిన ఉద్యోగ పరీక్షలతోపాటు నియామక ప్రక్రియలు నిలిచిపోతాయేమోననే ఆవేదనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి లీకేజీపై స్పష్టత రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మిగతా పరీక్షల పేపర్లు ఏమైనా లీకయ్యాయా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఉద్యోగుల బాధ్యతలపై ‘సమీక్ష’! ఈ పరిణామాలతో అసలు కమిషన్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ‘లీకేజీ’వీరులు ఇంకెందరు ఉన్నారనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. ప్రతి ఉద్యోగి నుంచి వివరాలు సేకరించడంతోపాటు ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుత కేసు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఉద్యోగుల విధులు/బాధ్యతల్లో ప్రక్షాళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Telangana: మరో గుడ్‌న్యూస్! డిసెంబర్లో గురుకుల నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది. వారంలోగా పూర్తి... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరి శీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది. డిసెంబర్లో నోటిఫికేషన్ గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది. -
ఏపీలో నిరుద్యోగం తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగం తగ్గుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే యువతకు ఉపాధిపై దృష్టి సారించారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వైద్య రంగంలోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నారు. వివిధ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక కూడా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు బాగా తగ్గినట్లు స్పష్టం చేసింది. 2016వ సంవత్సరంలో ఈ రేటు 17.9 శాతం ఉండగా గత నెల (అక్టోబర్)కు 12 శాతానికి పైగా తగ్గి, 5.4 శాతంగా నమోదైంది. అందులోనూ ఈ ఏడాది ప్రతి నెలా నిరుద్యోగ రేటు తగ్గుదల గణనీయంగా ఉంది. గత నెలలో జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు 7.75 శాతంగా ఉంది. అంటే జాతీయ స్థాయికంటే రాష్ట్రంలో 2.35 శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో అక్టోబర్ నాటికి నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. తెలంగాణలో 2016 జనవరిలో నిరుద్యోగ రేటు 7.4 శాతంగా ఉందని తెలిపింది. అగ్రస్థానంలో హరియాణా నిరుద్యోగంలో హరియాణా అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగ రేటు ఎక్కువ శాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా(30.7%), రాజస్థాన్(29.6%), జమ్మూకశ్మీర్ (22.2 %), ఝార్ఖండ్ (18.1%), హిమాచల్‌ప్రదేశ్ (14.1%), బిహార్ (13.9%), గోవా (11.7%), పంజాబ్ (11.4%), ఢిల్లీ (11 %), సిక్కిం (10%), త్రిపుర (9.9 %)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. -
ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు 6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్వో) పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. -
‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అధికారుల ప్రత్యేక చర్యలు మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్‌టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు, వాయిస్ కాల్స్ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు. ప్రాథమిక ‘కీ’ విడుదల తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 23–25 తేదీల మధ్య మెరిట్ జాబితాలు రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుండెపోటుతో అభ్యర్థి మృతి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్‌కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్ మరణించాడు. పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది. పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్కుమార్ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్‌రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్కుమార్ ఆర్కే జూనియర్ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్ ఖైదీ హాజరయ్యాడు. తొలిరోజు విజయవంతం పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు. వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 470 స్పెషల్ సర్వీసులు వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. -
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విడుదల ఎప్పుడన్నది తేలడం లేదు. ఈ నాలుగున్నరేళ్లలో 2016లో ఒకే ఒక్కసారి 4,275 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులోనూ 2 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. తక్కినవన్నీ ఖాళీగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పటివరకు నోటిఫికేషన్ల ఊసెత్తలేదు. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 19న 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించింది. ఇందులో కొన్ని పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, మరొకొన్ని పోలీస్ రిక్రూట్మెంట్, విద్యాశాఖ, సంక్షేమ గురుకులాల విభాగాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కానీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర దాటుతున్నా రోస్టర్ వారీగా సమాచారం ఖరారు చేయించి నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయిస్తోంది. కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా అనే శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ ఆయా శాఖల నుంచి తగిన సమాచారం లేకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసి, సమావేశాలు నిర్వహించినా కొన్ని శాఖలు మాత్రమే స్పందించాయి. మరోవైపు విద్యాశాఖకు సంబంధించి గతనెల 26న డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడగా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తేలని గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల జాబితా ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో గ్రూప్1 పోస్టులు 182, గ్రూప్–2 337, గ్రూప్ 3 పోస్టులు 1670 ఉన్నాయి. అన్ని శాఖల నుంచి సమాచారం వస్తేనే ఈ పోస్టుల నోటిఫికేషన్ల విడుదలకు అవకాశం ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్–3లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు పోస్టులు ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ల సమాచారం ఇంకా ఏపీపీఎస్సీకి అందలేదు. ఇక గ్రూప్ 2లోని 337 పోస్టులకు సంబంధించి అసెంబ్లీ సచివాలయం, జీఏడీ, ఆర్థిక, న్యాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. గ్రూప్ 1లో గతంలో కేవలం 78 పోస్టులు మాత్రమే ప్రకటించగా ఈసారి వాటి సంఖ్య 182కు పెంచారు. ఇందులో రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్, రహదారులు, భవనాల శాఖల నుంచి పోస్టుల సమాచారం ఇంకా పూర్తిగా అందాల్సి ఉందని కమిషన్ వర్గాలు వివరించాయి. సమాచారం రాకపోవడంతో ఈ మూడు గ్రూప్ నోటిఫికేషన్ల విడుదల జాప్యమవుతోందని పేర్కొంటున్నాయి. లెక్చరర్లు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితర పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి సమాచారం అందింనందున వారం పదిరోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలుంటందని చెబుతున్నాయి. నోటిపికేషన్ల విడుదలలో జాప్యంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
జాడలేని కొత్త నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయని, వీటి ద్వారా 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారి సీఎం చంద్రబాబు.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేస్తున్నారు. లక్షల ఉద్యోగాల మాట ఎలా ఉన్నా వేలల్లో కూడా ఉద్యోగాల కల్పన జరగలేదని, నాలుగేళ్లుగా ఇవే మాయ మాటలు చెబుతూ తమను మోసం చేస్తున్నారని నిరుద్యోగులు మండిప డుతున్నారు. ఒకపక్క ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ఊసే మర్చిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. అయితే చంద్రబాబు సర్కార్ ఈ నాలుగున్నర ఏళ్లలో తూతూ మంత్రంగా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం నాలుగువేల పైచిలుకు పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల ముందు మళ్లీ చంద్రబాబు వచ్చే నాలుగేళ్లలో 34 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటన చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ మోసపూరిత ప్రకటనలు అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ షెడ్యూళ్ల ప్రకటనతో ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూలై 6న ప్రకటించారు. ఇప్పటివరకూ అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ఏడాదిన్నరగా చెబుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా.. నియామకాలు సున్నా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేస్తామని, ప్రతి ఏటా డీఎస్సీని ప్రకటించి టీచర్ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో ఒకే ఒక్కసారి డీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,000 ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టుల భర్తీకి తూతూమంత్రంగా 32 నోటిఫికేషన్లు ఇచ్చినా ఆ నియామకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో మంజూరు పోస్టులు 6.97 లక్షలు కాగా, 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో పదవీ విరమణ చేసిన వారి సంఖ్యను కలిపితే ఖాళీల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది. వాస్తవాలు ఇలా ఉండగా ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులను మభ్యపెడుతూ లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. మించిపోతున్న వయోపరిమితి ఏళ్ల తరబడి ప్రభుత్వ పోస్టుల నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వయోపరిమితి మించిపోతోందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చాలాకాలం ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడలేదు. విభజన అనంతరం ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 23న ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఏడాది గడువుతో జీఓ 295ను విడుదల చేసింది. ఆ తరువాత మరో రెండుసార్లు గడువు పెంచారు. ఈ గడువు కూడా వచ్చేనెల 30వ తేదీతో ముగియనుంది. పోస్టుల భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలవుతున్నాయి. నోటిఫికేషన్లు వెలువడతాయని ఎదురుచూస్తూ నగరాల్లో హాస్టళ్లలో, అద్దె ఇళ్లల్లో ఉంటూ రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం దారుణమని మండిపడుతున్నారు. -
నేడు ఎస్సై రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని నియామక బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 339 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 1,217 పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు 1,83,482 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలపై బోర్డు ఇదివరకే అవగాహన కార్యక్రమం నిర్వహించింది. హాల్‌టికెట్ జారీ నిబంధనలకు లోబడి పరీక్ష నిర్వహణ జరుగుతుందని తెలిపింది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా ఇంగ్లిష్‌లో పేర్కొన్న ప్రశ్నను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని వివరించింది. ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రాథమిక పరీక్ష నుంచి అభ్యర్థుల తుది ఎంపిక వరకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు బోర్డు శనివారం తెలిపింది. -
గ్రూప్-2 పోస్టింగులు ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. నోటిఫికేషన్ వచ్చి రెండున్నరేళ్లు.. పరీక్షలు జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా.. భర్తీ ప్రక్రియ ముందుకు పడలేదు. న్యాయ వివాదాల కారణంగా అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రూప్-2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండటంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి, భర్తీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులతో చిక్కులు.. గ్రూప్-2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు 5.17 లక్షల మంది హాజరయ్యారు. అయితే పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు పొరపాటుగా కొందరు అభ్యర్థులకు ఇతరుల ఓఎంఆర్ పత్రాలు ఇవ్వడం, తర్వాత మార్చడం, దాంతో అభ్యర్థులు అప్పటికే వ్యక్తిగత వివరాలు నింపిన చోట వైట్నర్ పెట్టి.. ఇతర ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం జరిగాయి. అయితే పరీక్ష నిబంధనల ప్రకారం అలా వైట్నర్ వినియోగించిన ఓఎంఆర్ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీఎస్పీఎస్సీ తొలుత స్పష్టం చేసింది. అయితే ఇలా వేలాది మంది అభ్యర్థులు పొరపాటు చేశారని గుర్తించింది. దీనిపై ఉస్మానియా, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో టెక్నికల్ కమిటీని వేసి.. వైట్నర్ వినియోగం విషయంలో అభ్యర్థుల హడావుడే కారణమని, కావాలని చేయలేదని నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో వారందరి ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ... మూల్యాంకనం పూర్తిచేసింది. 1,032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో 3,147 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కూడా పిలిచింది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన న్యాయవాదుల కమిటీ కూడా వైట్నర్ వినియోగంలో అభ్యర్థులది కేవలం హడావుడి పొరపాటు మాత్రమేనని తేల్చింది. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు గ్రూప్-2లో 17 ప్రశ్నలను తొలగించి ఫైనల్ ‘కీ’ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా తేలాల్సి ఉంది. -
తెలంగాణేతరుల దరఖాస్తుల్ని అనుమతించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణేతర అభ్యర్థుల దరఖాస్తులనూ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సహాయ ఇంజ నీర్స్ (ఏఈ) పోస్టులకు స్వీకరించాలని రాష్ట్ర ట్రాన్స్‌కోలు, టీఎస్ఎస్పీడీసీఎల్లను హైకోర్టు ఆదేశించింది. పోస్టుల భరీకి నిర్వహించే పరీక్షలకూ అనుమతించాలని విద్యుత్ సంస్థలకు తెలి పింది. స్థానికతను ఆధారంగా చేసుకు ని ట్రాన్స్‌కో, పీడీసీఎల్లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. స్థానికతను నిర్ణయించే అధికారం విద్యుత్ సంస్థలకు ఉండదని, పార్లమెంటు చట్టం ద్వారానే స్థానికత నిర్ణయానికి ఆమోదం ఉంటుందని పేర్కొంటూ నిఖిల్‌కుమార్, పావని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశా రు. విద్యుత్ సంస్థల నిర్ణయం రాజ్యాం గ వ్యతిరేకమని వారి తరఫు న్యాయ వాది వాదించిన అనంతరం ధర్మాసనం.. వ్యాజ్యాలను విచారణకు స్వీకరించి పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ సంస్థలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
పంచాయతీ కార్యదర్శులు ‘అవుట్’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు భర్తీ అవుట్ సోర్సింగ్ పద్ధతితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. గ్రామానికి ఒక కార్యదర్శి నియమించే ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోక.. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడుతుందా? ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సాధిద్దామా? అనే నిరుద్యోగుల ఆశలకు ప్రభు త్వ నిర్ణయం ప్రతిబంధకంగా పరిణమించనుంది. జిల్లాలో 970 పంచాయతీలున్నాయి. వీటిని పాలనా సౌలభ్యం నిమిత్తం వీటిని 487 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున కార్యదర్శిని నియమించాల్సి ఉండగా.. గతంలో ప్రభుత్వం 360 ఉద్యోగాలు భర్తీ చేసింది. కార్యదర్శుల కొరత నేపథ్యంలో ఒక్కో కార్యదర్శి తనకు కేటాయించిన క్లస్టర్‌కు రెగ్యులర్‌గానూ.. మరో క్లస్టర్‌కు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 342 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున నియామకం చేపట్టినా జిల్లాకు ఇంకా 145 మంది అవసరం. కానీ ఇంత వరకూ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో గ్రామకార్యదర్శుల కొరత వేధిస్తుండటంతో పాలనలో ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు నాలుగైదు మైనర్ పంచాయతీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శిని నియమించారు. తద్వారా పనిభారం పెరగడంతోపాటు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ప్రస్తుతం పాలనా సౌలభ్యం నిమిత్తం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లావ్యాప్తంగా 628 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ అవుట్ సోర్సింగ్ ద్వారా చేపట్టనున్నారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. నెలాఖరుకు స్పష్టత ఉద్యోగాల భర్తీ విషయంలో నెలాఖరుకు స్పష్టత రానుంది. పంచాయతీ కార్యదర్శికి కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్ణయించారు. రాత పరీక్షలో మెరిట్సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిలో ఐదుగురితో ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, రెవెన్యూ, మరో శాఖ అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో కమిటీతే తుది నిర్ణయం. నిరుద్యోగుల్లో ఆందోళన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అటుంచితే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగం ఒప్పంద ప్రాతిపదిక నిర్వహించడంతో తాము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న నిరీక్షణకు తెర పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఉద్యోగం అవుట్ సోర్సింగ్‌లో చేపడితే ఇక.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడోస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈవోపీఆర్డీ, కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం! జిల్లాలోని 49 మండలాల పరిధిలో 42 మంది ఈఓపీఆర్డీలు విధులు నిర్వర్తిస్తుండగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీని పదోన్నతుల ద్వారా చేపట్టనున్నారు. ప్రస్తుతం 125 మంది కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించే తరుణంలో పెద్ద పంచాయతీకి కంప్యూటర్ ఆపరేటర్ నియామకం తప్పనిసరి. వీటిని సైతం భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు: చాడ
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఈ మూడున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని గమనించి ప్రభుత్వం ఉత్తుత్తి నోటిఫికేషన్లతో మాయ చేస్తోందని విమర్శించారు. మఖ్దూంభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్లతో ఎర చూపుతున్నారు తప్పితే ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని విమర్శించారు. అలాగే ఐటీ సెక్టారులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో వెల్లడించాలన్నారు. సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ చేపట్టిన పోరుబాట యాత్ర విజయవంతమైందని, ప్రజల నుంచి అనేక ఆకాంక్షలు వ్యక్తమయ్యాయని తెలిపారు. -
వచ్చే ఏడాది 87 వేల ఉద్యోగాలు
సాక్షి, సిద్దిపేట: నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చే ఏడాది 87 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం సిద్దిపేటలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ఇప్పటి వరకు 24 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. మిగిలిన 87 వేల ఉద్యోగాలను వచ్చే ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతిభ ఉండి విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు పడేవారని, వారి కోసం రూ.25 లక్షల గ్రాంటును అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు తలెత్తుకుని బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం మెరుగైన వసతులు కల్పిçస్తూ రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 120 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేళ్లలోనే రెట్టింపుగా మరో 124 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. 25 ఎస్సీ, 25 ఎస్టీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి తెలంగాణ బిడ్డలు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘1.12 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై కృత నిశ్చయంతో ఉన్నాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇదే విషయం చెప్పాను. ఆ ప్రకారం 1.12 లక్షలే కాదు అంతకు ఒక వెయ్యి ఎక్కువే ఇస్తాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ టీఎస్పీఎస్సీపై, గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షలుందని.. కాంగ్రెస్ సహా అంతకుముందు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా తమలా చేయలేదని పేర్కొన్నారు. నిర్మాణాత్మక పంథాలో సభ్యులు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయవద్దని సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దళితుడని, సంస్కరణలతో ఆయన రాష్ట్రానికి గౌరవం తెచ్చి పెట్టారని సీఎం ప్రశంసించారు. యూపీఎస్సీ కూడా ఆయనను అభినందించి మొదటిసారిగా యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసిందని చెప్పారు. ఇక నిరుద్యోగుల అంశంలో ఏదో మూటగట్టుకోవాలని ప్రయత్నించడం, అందుకు సోనియాగాంధీ పేరు ముందుకు తీసుకురావడం, అమరులంటూ ఏదేదో మాట్లాడటం మంచిదికాదని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. అదంతా పాత రాజకీయమని, ఇప్పుడది పనిచేయదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉందని, నిజాలన్నీ బయటకు వస్తాయని.. అందువల్ల పద్ధతిగా వ్యవహరించాలని సూచించారు. పొరపాట్లు సహజం తెలంగాణ కొత్త రాష్ట్రమని, అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరగకుండా ఉంటాయా? వాటిని సరిదిద్దుకుంటూ పోతుంటాం. ఈ ప్రభుత్వం తప్పులు చేయడం సర్వసాధారణమన్నట్లు మాట్లాడితే.. అదో భాషేనా? అలా మాట్లాడితే గౌరవం వస్తుందా? మంచిగా మాట్లాడే వారి విలువ వేరేగా ఉంటుంది. లేకుంటే మరో రకంగా ఉంటుంది. సభ్యులు వారి స్థాయిని, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. షార్ట్‌కట్ పద్ధతులతో ఒక్క రోజుకో, ఒక్క పూటకో ప్రశ్న అడిగితే ఐదు నిమిషాలు ఆనందం ఉంటుంది తప్ప అది గొప్పతనం కాదు.’’అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి అమలుపై లక్ష పేజీల పెన్‌డ్రైవ్ ఇస్తాం విద్య, స్కాలర్షిప్ విషయంలో ఆవాస విద్యకు కేంద్రం, నీతి ఆయోగ్ ప్రాధాన్యమిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దాన్ని మన రాష్ట్రం ఇప్పటికే మొదలుపెట్టిందని.. మన మోడల్‌నే కేంద్రం తీసుకుందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని.. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ దీనిపై చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే పద్ధతిని మైనారిటీ, బీసీ, ఎస్టీలకు అమలుచేసే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లు తెచ్చాక ఎంత ఖర్చు చేశామో పైసా లెక్కతో సహా ప్రతి సభ్యుడికి ఒకటి రెండు రోజుల్లో దాదాపు లక్ష పేజీలుండే పెన్‌డ్రైవ్ ఇవ్వనున్నామన్నారు. దళితులు, బలహీనవర్గాల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీగా ‘విదేశీ విద్య’స్కాలర్షిప్ను ఇస్తున్నామని చెప్పారు. అత్యవసర అంశమైనా పట్టించుకోరా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి నిరాకరించడంతో అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టకూడదని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు మాట తప్పుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టవద్దన్న నిర్ణ యం వాస్తవమేనని, కానీ అత్యవసర అంశం కాబట్టి వాయిదా తీర్మానం తీసుకోవాలని కోరామని వివరించారు. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వాయిదా తీర్మానాన్ని చేపట్టకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక కాంగ్రెస్ తీరును ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. జానారెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీఏసీలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించకపోతే ఎలాగని విమర్శించారు. ఇక నిరుద్యోగ యువతకు ప్రభుత్వోద్యోగాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. గ్రూప్స్-2 లో భారీగా అవకతవకలు శాసనసభలో తొలుత కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అందువల్ల కొత్త పోస్టులతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోడింగ్, డీకోడింగ్‌లో అవకతవకలు జరిగాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక నోట్ కూడా ఇచ్చారని.. ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ అయిందని పేర్కొన్నారు. అసలు ఓఎంఆర్ షీట్ నాణ్యత లేదని, దీనిపై కోర్టు కూడా ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని.. దాంతో టీచర్ల భర్తీ పరీక్షలో సరిదిద్దుకున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లుగా తప్పులు చేయడం, సరిదిద్దుకోవడమే అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఆ ఆరోపణలు అవాస్తవం గ్రూప్స్-2 పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శాసనసభలో బదులిచ్చారు. ఒకవేళ అవకతవకలు జరిగినట్లు తేలితే క్షమాపణ చెబుతామన్నారు. ప్రతి అభ్యర్థి జవాబుపత్రం జిరాక్స్ వారివద్దే ఉందని, దీనిపై కోర్టుకు వివరాలు కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. కోర్టు సూచన మేరకు ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాలను తనిఖీ చేసి జాబితాలను కూడా సమర్పించామని చెప్పారు. ఓఎంఆర్ షీట్‌ను పాత పద్ధతి ప్రకారం కాకుండా అధునాతన టెక్నాలజీ ప్రకారం స్కానింగ్ చేశామని, ఆ పద్ధతిని యూపీఎస్సీ కూడా ఉపయోగిస్తుందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు రాగానే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. -
ప్రశ్నపత్రం అమ్మేసిన ప్రొఫెసర్!?
ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆరు నెలల కిందట నిర్వహించిన అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు పోస్టుల భరీకి రూపొందించిన ప్రశ్నపత్రం విషయంలో అక్రమాలు జరిగినట్లు దాన్ని రూపొందించిన ఓ ప్రొఫెసర్ దాన్ని తన విద్యార్థులకు అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 21 అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు (గ్రౌండ్‌వాటర్ విభాగం) పోస్టుల నియామకానికి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పరీక్షలకు గాను ప్రశ్నపత్రం రూపొందించే బాధ్యతను విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగానికి అప్పగించింది. ఈ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించింది. ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేసింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలను మే నెలలో నిర్వహించి జూన్‌లో నియామకాలు జరిపింది. ఈ నియామకాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పరిశోధక విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. వీరిలో ఒకరు ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపొందించినట్టు చెబుతున్న జియాలజీ ప్రొఫెసర్ సుబ్బారావు వద్ద స్కాలర్ కాగా, మరో విద్యార్థి కూడా అదే విభాగంలో స్కాలరే. వీరికి ఇతర అభ్యర్థులకంటే అత్యధిక మార్కులు రావడంతో ప్రతిభ ఆధారంగా వీరి నియామకాలు చేపట్టినట్టు పేర్కొనడంతో తోటి అభ్యర్థుల్లో అనుమానాలు వెల్లువెత్తాయి. బాధితులు ఏపీపీఎస్సీకి ఫిర్యాదుచేశారు. దీనిపై ఏపీపీఎస్సీ అధికారులు ఇంటెలిజెన్స్‌తో విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. -
ఎడ్యు న్యూస్
ఎస్ఎస్సీ ఫలితాల ప్రకటన తేదీలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల తేదీలు.. ⇒ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) 2015 తుది ఫలితాలు మే 30 ⇒ జూనియర్ ఇంజనీర్స్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2015 పేపర్-1 ఫలితాలు మే 16 ⇒ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూలై 22 ⇒ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ సి, డి) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూన్ 8. -
సింగరేణిలో మరో 400 ఉద్యోగాలు
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఇప్పటికే రెండు నోటిఫికేషన్ల ద్వారా రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన యాజమాన్యం, మరో 400 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2015లో మొదటి నోటిఫికేషన్ ద్వారా 8 కేటగిరీలకు చెందిన 1,178 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. వీటిలో మేనేజ్మెంట్ పర్సనల్, ఈ అండ్ ఎం విభాగాలకు చెందిన 107 పోస్టులకు సంబంధించి కోర్టులో ఉన్నందున వాటి ఫలితాలు వెల్లడికాలేదు. రెండో నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరీలకు చెందిన 1,033 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 48 సర్వే ట్రైనీ, 40 మోటర్ మెకానిక్ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన వారందరికీ ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చారు. ఇక ఫిబ్రవరిలో మూడోసారి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదలచేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోం ది. ఇందులో 101 జూని యర్ నర్స్ ఉద్యోగాలు, 50 వెల్లర్ ట్రైనీతోపాటు ఈపీ ిఫిట్టర్, ఈపీ ఎలక్ట్రీషియన్‌కు సంబంధించి 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 క్లర్క్ పోస్టుల భర్తీకీ సన్నాహాలు సింగరేణిలో ఇప్పటికే ఎక్స్టర్నల్గా నోటిఫికేషన్ విడుదల చేసి 471 గ్రేడ్-2 క్లర్క్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించిన యాజమాన్యం ఫిబ్రవరి మొదటివారంలో ఎంపికైన వారికి ఆఫీస్ ఆర్డర్లను అందజేయనుంది. 144 అంతర్గత క్లర్క్ పోస్టులకు సంస్థలో పనిచేస్తున్న అర్హులను ఎంపిక చేసింది. అయితే మరో 150 వరకు క్లర్క్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉండడంతో మార్చి తర్వాత వీటి భర్తీకి అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు యా జమాన్యం చర్యలు తీసుకుంటోంది. జూనియర్ మైనింగ్ ఇంజనీర్(ట్రైనీ)కి సంబంధించి 811 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా... 676 మందే అర్హత సాధించారు. మిగిలిన 125 జేఎంఈటీ పోస్టులను మార్చి తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 665 గిరిజన ఉద్యోగాలు భర్తీ తెలంగాణలోని గిరిజనులకు సంబంధించి కేటాయించిన 665 బదిలీ వర్కర్ పోస్టుల భర్తీని కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులకు సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల్లో సింగరేణి నాలుగు జిల్లాల గిరిజనులకు 80 శాతం, మిగిలిన ఇతర జిల్లాల వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పించారు. -
1 నుంచి ఇంటర్వ్యూలు వద్దు
జూనియర్ స్థాయి కొలువులకు వర్తింపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో(పీఎస్‌యూ) జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది. నైపుణ్య, శరీరదారుఢ్య పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియను ఈ నెల 31క ల్లా కచ్చితంగా పూర్తి చేయాలని సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు సర్క్యులర్ పంపింది. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనల్లో ఇంటర్వ్యూల ప్రస్తావన ఉండదు. ఇంటర్వ్యూల రద్దు .. గ్రూప్ సీలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్, వాటికి సమానమైన అన్ని పోస్టులకు వర్తిస్తుందని వివరించింది. నిర్దిష్ట పోస్టులకు ఇంటర్వ్యూ జరపాలనుకుంటే పూర్తి వివరాలను సంబంధిత మంత్రి ఆమోదంతో జనవరి 7 లోపల తమకు పంపాలని డీఓపీటీ తెలిపింది. వేతనాల కోడ్‌కు తుది మెరుగులు: కేంద్రం దేశవ్యాప్తంగా ఏకీకృత కనీసం వేతనం నిర్ణయించేందుకు వీలుకల్పించే వేతనాల లేబర్ కోడ్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ బుధవారం సమావేశమై చిన్నపరిశ్రమల బిల్లుకు తుది మెరుగులు దిద్దనున్నారు. 40 మందికంటే తక్కువ మంది కార్మికులు ఉన్న పరిశ్రమలకు ఈ బిల్లు కింద 14 కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఇస్తారు. బిల్లుకు రూపకల్పన చేశాక ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతారు. వేతానాల చట్టం, చె ల్లింపులు-వేతనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం తదితర చట్టాల్లోని నిబంధనలను క్రోడీకరించి వేతనాల కోడ్ తేవాలని కార్మిక శాఖ ప్రతిపాదించడం తెలిసిందే. కాగా, ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు ముసాయిదాకు కార్మిక శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. సంప్రదింపుల కోసం దీన్ని త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలకు పంపనున్నారు. -
ఉద్యోగ వేట
ఖమ్మం : కొత్త ప్రభుత్వం కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో జిల్లా యు వత ఉద్యోగమే పరమావధిగా సిద్ధమవుతోంది. ప్రభుత్వశాఖలు, బ్యా కింగ్, సింగరేణి, ట్రాన్స్‌కో, జన్కో వంటి సంస్థలు ఉద్యోగాల భర్తీకి గ్రీ న్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగ యువత క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతోంది. జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు కోచింగ్‌కు వెళ్తున్నారు. ఎప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు ఉన్నారు. పుస్తకాల సేకరణ, కోచింగ్ సెంటర్ల ఎంపిక వంటి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పలువురు అభ్యర్థులు గ్రూప్ స్టడీస్‌కు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల ఆశలో మూడు లక్షల మంది ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది ఎదురుచూస్తున్నటున్ల జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు 34,254 మంది, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 21,520 మంది, డిగ్రీ ఆపై చదువులు పూర్తి చేసిన వారు 25వేల మంది, వృత్తి విద్యాకోర్సులు, నర్సింగ్ పూర్తి చేసిన వారు 8 వేల మంది, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసిన వారు 11వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ అభ్యర్థులు 10 వేల మంది వరకు హైదరాబాద్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. వీరే కాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోకుండా ఉన్న వారి సంఖ్య రెండు లక్షల మేరకు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయనే ప్రచారం, వయో పరిమితి సడలింపుతో ఉద్యోగం కోసం చివరి యత్నం చేద్దామనేవారు చాలా మంది వరకు ఉన్నారు. ఎంప్లారుుమెంట్ ఆఫీసులో భారీగా రిజిస్ట్రేషన్లు నూతన ప్రభుత్వం పలు ఉద్యోగాలను ఎంప్లాయిమెంట్శాఖ ద్వారా భర్తీ చేస్తామని, వారు ఇచ్చే జాబితాను ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడంతో తమ పేర్లను ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకునేందుకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్ శాఖపై పెద్దగా నమ్మకం లేకపోవడం, నిరుద్యోగులను వారు పట్టించుకోక పోవడం వంటి కారణాలతో నమోదుకు వెనకడుగు వేశారు. ఇటీవల సింగరేణి, ఆర్మీ, సోషల్ వెల్ఫేర్ , నవోదయ వంటి శాఖల్లో సబ్‌స్టాఫ్, వెల్డర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషన్ల నియామకం కోసం జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి జాబితాను సేకరించారు. సీనియార్టీ ప్రకారం 2500 మంది ఐటీఐ అభ్యర్థుల జాబితాను సింగరేణి సంస్థకు, 100 మంది ఎయిర్ ఫోర్స్, 80 మంది సోషల్ వెల్ఫేర్, ఇతర సంక్షేమ హాస్టళ్లు, నవోదయ పాఠశాలలకు పంపిచారు. గతంలో నమోదు చేయించుకునే వారు లేక వెలవెలబోరుున ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఇప్పుడు కళకళలాడుతోంది. గత జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం వరకు సుమారు 8వేల మంది పేర్లు నమోదు చేరుుంచుకున్నారు. కోచింగ్ సెంటర్లలో సందడి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురు కావడంతో జిల్లాలోని కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నారుు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ఇప్పటికే పోటాపోటీగా కోచింగ్ సెంటర్లు ప్రచారం నిర్వహిస్తున్నారుు. గ్రూప్స్, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల కోసం జీకే, ఆర్థమేటిక్, ఇతర సబ్జెక్టులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి- సాహిత్యం తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి సబ్జెక్టు నిపుణులను తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. మోడల్ పరీక్షలు, సెమినార్ల వంటివి విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో సంబంధిత అభ్యర్థులు జోరుగా సిద్ధమవుతున్నారు. ట్రాన్స్‌కో, జన్కో పరీక్షల కోసం అర్హులైన అభ్యర్థులు హైదరాబాద్ బాట పట్టారు. -
టెక్ ఇంటర్వ్యూలో మెరిసేదెలా!
టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్షలు భిన్నంగా ఉంటాయి. ఇందులో రిక్రూటర్లు సాంకేతిక అంశాలపై ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంటారు. కళాశాలలో నేర్చుకున్న మౌలికాంశాలపై కూడా అడుగుతుంటారు. టెక్నాలజీ రంగంలో చాలాకాలంగా పనిచేస్తున్న అభ్యర్థులు ఇలాంటి ఇంటర్వ్యూలను తేలిగ్గా తీసుకుంటారు. ప్రిపరేషన్ అవసరం లేదని భావిస్తుంటారు. రిక్రూటర్లు బేసిక్స్‌పై ప్రశ్నలు వేస్తే మాత్రం నీళ్లు నములుతుంటారు. టెక్ ఇంటర్వ్యూలు అనుకున్నంత సులభంగా ఉండవు. ఇందులో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కార మార్గాలు చూపగలగాలి. ఆ మార్గాలు ప్రభావవంతంగా ఉన్నప్పుడే మీ తెలివితేటలు, చురుకుదనం రిక్రూటర్‌కు తెలుస్తాయి. బేసిక్స్ నెమరువేసుకోవాలి: టెక్ ఇంటర్వ్యూలో బేసిక్ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్స్‌ను తప్పనిసరిగా నెమరు వేసుకోవాలి. గ్రాఫ్స్, సెట్స్, హష్ టేబుల్స్, బైనరీ సెర్చ్ ట్రీస్పై కూడా రిక్రూటర్లు ప్రశ్నిస్తారు. డేటా స్ట్రక్చర్స్‌ను ఉపయోగిస్తూ కోడ్‌ను తయారు చేయమని సూచిస్తారు. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలు ఇవ్వాలంటే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పూర్తిస్థాయిలో సన్నద్ధమైతేనే ఇది సాధ్యం. ప్రోగ్రామింగ్‌పై కనీసం రెండు పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో విజయం దక్కడమే కాదు, మీరు మంచి ప్రోగ్రామర్‌గా కూడా పేరు తెచ్చుకుంటారు. మ్యాప్స్, సెట్స్: మౌఖిక పరీక్షలో మ్యాప్‌లు, సెట్స్‌పై వచ్చే సమాధానాలను బట్టే బలహీన, బలమైన అభ్యర్థులు ఎవరో రిక్రూటర్లు తేల్చేస్తారు. కాబట్టి వీటిపై సాధనకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సెట్స్, హష్ టేబుల్స్‌ను సందర్భానుసారంగా ఎక్కడెక్కడ ఉపయోగించాలో చక్కగా వివరిస్తే రిక్రూటర్ల దృష్టిలో మీ స్థాయి పెరిగిపోవడం ఖాయం. కోడింగ్ సాధన: అభ్యర్థుల కోడింగ్ ైనె పుణ్యాలను తప్పనిసరిగా పరీక్షిస్తారు. కోడింగ్‌పై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే తెలుసుకోవాలి. దీనిపై అంతర్జాలంలో సమాచారం లభిస్తుంది. కాగితం, కలం ఉపయోగిస్తూ రియల్ కోడింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చే యండి. నాన్-కోడింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోడింగ్‌పై ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే. అలాగే సింటాక్స్‌ను మర్చిపోయి ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు ‘సారీ’ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. టెక్నికల్ స్కిల్స్‌కు సాన పెట్టుకుంటే టెక్ ఇంటర్వ్యూలో నెగ్గడం తేలికేనన్న విషయం గుర్తుంచుకోండి.