సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు గిరిజన రిజర్వేషన్లు, ఇతరత్రా అవాంతరాలతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి.
ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది.
వారంలోగా పూర్తి...
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరి శీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది.
డిసెంబర్‌లో నోటిఫికేషన్
గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment