
సాక్షి, హైదరాబాద్: తెలంగాణేతర అభ్యర్థుల దరఖాస్తులనూ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సహాయ ఇంజ నీర్స్ (ఏఈ) పోస్టులకు స్వీకరించాలని రాష్ట్ర ట్రాన్స్‌కోలు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లను హైకోర్టు ఆదేశించింది. పోస్టుల భరీకి నిర్వహించే పరీక్షలకూ అనుమతించాలని విద్యుత్ సంస్థలకు తెలి పింది. స్థానికతను ఆధారంగా చేసుకు ని ట్రాన్స్‌కో, పీడీసీఎల్‌లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
స్థానికతను నిర్ణయించే అధికారం విద్యుత్ సంస్థలకు ఉండదని, పార్లమెంటు చట్టం ద్వారానే స్థానికత నిర్ణయానికి ఆమోదం ఉంటుందని పేర్కొంటూ నిఖిల్‌కుమార్, పావని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశా రు. విద్యుత్ సంస్థల నిర్ణయం రాజ్యాం గ వ్యతిరేకమని వారి తరఫు న్యాయ వాది వాదించిన అనంతరం ధర్మాసనం.. వ్యాజ్యాలను విచారణకు స్వీకరించి పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ సంస్థలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment