టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్షలు భిన్నంగా ఉంటాయి. ఇందులో రిక్రూటర్లు సాంకేతిక అంశాలపై ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంటారు. కళాశాలలో నేర్చుకున్న మౌలికాంశాలపై కూడా అడుగుతుంటారు. టెక్నాలజీ రంగంలో చాలాకాలంగా పనిచేస్తున్న అభ్యర్థులు ఇలాంటి ఇంటర్వ్యూలను తేలిగ్గా తీసుకుంటారు.
ప్రిపరేషన్ అవసరం లేదని భావిస్తుంటారు. రిక్రూటర్లు బేసిక్స్‌పై ప్రశ్నలు వేస్తే మాత్రం నీళ్లు నములుతుంటారు. టెక్ ఇంటర్వ్యూలు అనుకున్నంత సులభంగా ఉండవు. ఇందులో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కార మార్గాలు చూపగలగాలి. ఆ మార్గాలు ప్రభావవంతంగా ఉన్నప్పుడే మీ తెలివితేటలు, చురుకుదనం రిక్రూటర్‌కు తెలుస్తాయి.
బేసిక్స్ నెమరువేసుకోవాలి: టెక్ ఇంటర్వ్యూలో బేసిక్ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్స్‌ను తప్పనిసరిగా నెమరు వేసుకోవాలి. గ్రాఫ్స్, సెట్స్, హష్ టేబుల్స్, బైనరీ సెర్చ్ ట్రీస్‌పై కూడా రిక్రూటర్లు ప్రశ్నిస్తారు. డేటా స్ట్రక్చర్స్‌ను ఉపయోగిస్తూ కోడ్‌ను తయారు చేయమని సూచిస్తారు. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలు ఇవ్వాలంటే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పూర్తిస్థాయిలో సన్నద్ధమైతేనే ఇది సాధ్యం. ప్రోగ్రామింగ్‌పై కనీసం రెండు పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో విజయం దక్కడమే కాదు, మీరు మంచి ప్రోగ్రామర్‌గా కూడా పేరు తెచ్చుకుంటారు.
మ్యాప్స్, సెట్స్: మౌఖిక పరీక్షలో మ్యాప్‌లు, సెట్స్‌పై వచ్చే సమాధానాలను బట్టే బలహీన, బలమైన అభ్యర్థులు ఎవరో రిక్రూటర్లు తేల్చేస్తారు. కాబట్టి వీటిపై సాధనకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సెట్స్, హష్ టేబుల్స్‌ను సందర్భానుసారంగా ఎక్కడెక్కడ ఉపయోగించాలో చక్కగా వివరిస్తే రిక్రూటర్ల దృష్టిలో మీ స్థాయి పెరిగిపోవడం ఖాయం.
కోడింగ్ సాధన: అభ్యర్థుల కోడింగ్ ైనె పుణ్యాలను తప్పనిసరిగా పరీక్షిస్తారు. కోడింగ్‌పై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే తెలుసుకోవాలి. దీనిపై అంతర్జాలంలో సమాచారం లభిస్తుంది. కాగితం, కలం ఉపయోగిస్తూ రియల్ కోడింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చే యండి. నాన్-కోడింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోడింగ్‌పై ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే. అలాగే సింటాక్స్‌ను మర్చిపోయి ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు ‘సారీ’ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. టెక్నికల్ స్కిల్స్‌కు సాన పెట్టుకుంటే టెక్ ఇంటర్వ్యూలో నెగ్గడం తేలికేనన్న విషయం గుర్తుంచుకోండి.
టెక్ ఇంటర్వ్యూలో మెరిసేదెలా!
Published Tue, Oct 14 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM
Advertisement
Advertisement