ఏఐతోనే 90 శాతం కోడింగ్‌.. కానీ.. | Zoho founder Sridhar Vembu shared his perspective on coding with AI | Sakshi
Sakshi News home page

ఏఐతోనే 90 శాతం కోడింగ్‌.. కానీ..

Published Sat, Mar 22 2025 12:11 PM | Last Updated on Sat, Mar 22 2025 12:18 PM

Zoho founder Sridhar Vembu shared his perspective on coding with AI

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐ వాడకం ఎక్కువవుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో దీని ఉపయోగం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ కోడింగ్‌, టెస్టింగ్‌, ఎగ్జిక్యూటింగ్‌ వంటి కీలక పనులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ కోడింగ​్‌కు సంబంధించి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్‌లో ఏఐ సామర్థ్యం ఏమేరకు ఉంటుందో అంచనా వేస్తూ భవిష్యత్తులో దాని పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘ఏఐ 90 శాతం కోడ్‌ను రాస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామర్లు రాసే వాటిలో 90 శాతం బాయిలర్ ప్లేట్లు(కాపీ చేసేందుకు వీలుగా ఉండే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు). ప్రోగ్రామింగ్ రెండు రకాల సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒకటి-ముఖ్యమైన సంక్లిష్టత.. ఇందులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కోడింగ్‌ను కొత్తగా క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. రెండు ప్రమాదవశాత్తు సంక్లిష్టత-ఏదైనా అత్యసవర సమయాల్లో కోడింగ్‌లో సాయం అవసరం అవుతుంది. దాన్ని తొలగించడానికి కృత్రిమ మేధ ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మానవులు కనుగొన్న నమూనాల ప్రకారం కోడింగ్‌లో సహకారం అందిస్తుంది. ఇది పూర్తిగా కొత్త నమూనాలు సృష్టిస్తుందా..? మానవుల మాదిరిగానే ఏఐ చాలా అరుదుగా కొత్త నమూనాలను తయారు చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఇది ఏమేరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు’ అని పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement