హైదరాబాద్: సొల్యూషన్స్3ఎక్స్ మెడికల్ కోడింగ్ తమ లేటెస్ట్ ట్రైనింగ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ప్రారంభించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ (AAPC), అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AHIMA) నుంచి రెండు ప్రమాణాలు పొందిన భారతదేశంలో ఏకైక మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ ఈ 'సొల్యూషన్స్3ఎక్స్'. ఈ సంస్థ హైటెక్ సిటీలో తన మొదటి కేంద్రాన్ని కొనసాగిస్తూ.. నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది.
సొల్యూషన్స్3ఎక్స్ మెడికల్ కోడింగ్ నూతన శిక్షణ కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేష్ పొట్లూరి, ముత్తుకుమారన్ గాంధీ, సమియుల్లా మహమ్మద్, రాజశేఖర్ గుమ్మడి, ప్రథిమా హాజరయ్యారు.
సొల్యూషన్స్3ఎక్స్ ఇప్పటికే 2,000 మందికి పైగా మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్‌ను సృష్టించింది. గ్లోబల్‌గా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు, వైద్య రంగంలో అత్యవసరంగా కావలసిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించి వారికి ఒక ఆర్థికపరమైన, స్థిరమైన కెరీర్‌ను అందించడంలో సఫలమైంది.
మెడికల్ కోడింగ్ ప్రస్తుతం విద్యార్థులకు అధిక వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలను అందించగలిగిన రంగంగా మారింది. ముఖ్యంగా పెరుగుతున్న ఆరోగ్యరంగంలో జీవశాస్త్రం లేదా ఆరోగ్య రంగానికి చెందిన విద్యార్థులకే పరిమితమైనదన్న అపోహను చెరిపివేస్తూ.. సరైన శిక్షణ ద్వారా ఏ విద్యా నేపథ్యం కలిగినవారైనా ఈ రంగంలో మంచి ఉద్యోగాలను పొందవచ్చని నిరూపిస్తోంది.
సొల్యూషన్స్3ఎక్స్‌లో.. మేము విద్యార్థులకు కేవలం సర్టిఫికేషన్‌లను అందించడమే కాకుండా, ఆరోగ్య రంగంలో మంచి కెరీర్‌ను పొందడానికి వారిని సన్నద్ధం చేయడం మా ప్రధాన లక్ష్యం. అమీర్‌పేటలో మా నూతన కేంద్రం విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, గ్లోబల్ సర్టిఫికేషన్లతో పాటు.. విజయానికి అవసరమయ్యే ఆత్మవిశ్వాసాన్ని అందించేందుకు రూపొందించబడింది.
మెడికల్ కోడింగ్ ఒక సులభతరమైన, అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం. ఇది ఏ విద్యా నేపథ్యం కలిగిన వారికైనా అందుబాటులో ఉంటుందని సొల్యూషన్స్3ఎక్స్ సీఈఓ ముత్తుకుమారన్ గాంధీ అన్నారు.
ఈ నూతన శిక్షణ కేంద్రంలో ప్రాక్టిస్ ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) వంటి టెక్నాలజీ ఆధారిత వాతావరణం అందుబాటులో ఉన్నాయి. బహుభాషా శిక్షణదారుల మద్దతు ద్వారా, నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. అలాగే, ఆఫ్‌లైన్ క్లాసులు, ఇతర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ శిక్షణ ఆప్షన్లను అందించడం ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా చూస్తోంది.
సొల్యూషన్స్3ఎక్స్ డ్యూయల్ ఏఏపీసీ, ఏహెచ్ఐఎమ్‌ఎ ప్రమాణాలు కలిగి, గ్లోబల్‌గా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లను అందించే సంస్థగా హామీ ఇస్తోంది. ఇది ఇప్పటికే 10కి పైగా మల్టీనేషనల్ కంపెనీలకు నమ్మదగిన శిక్షణ భాగస్వామిగా ఉంది. విద్యార్థుల సర్టిఫికేషన్ పరీక్షలలో 90% పాస్ రేట్ సాధించడం సొల్యూషన్స్3ఎక్స్ గొప్ప విజయంగా నిలిచింది. విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించేందుకు, సొల్యూషన్స్3ఎక్స్ సర్టిఫికేషన్ ఫీజులపై ప్రత్యేక డిస్కౌంట్‌లు అందిస్తూ, అన్ని వర్గాల విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. సొల్యూషన్స్3X తో మెడికల్ కోడింగ్‌లో శిక్షణ, ఉద్యోగ సహాయం కోసం 7893234949కు సంప్రదించవచ్చు
Comments
Please login to add a commentAdd a comment