తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా విడుదల కానున్న సర్కారీ కొలువుల పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు సాక్షి ముందుకు వచ్చింది.
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా విడుదల కానున్న సర్కారీ కొలువుల పై సాక్షి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో.. వరంగల్ జిల్లాలోని కేయూ ఆడిటోరియంలో అక్టోబర్ 1న సాక్షి భవిత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 పరీక్షల ప్యాట్రన్ వెల్లడించడంతో లక్షల మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించినట్లయింది. ఇక ఈ నోటిఫికేషన్లలో విజేతలుగా నిలువాలంటే ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి?..ఏ పుస్తకాలను చదవాలి?..వంటి సందేహాలని నివృత్తి చేసి ... అభ్యర్థులను గెలుపు తీరం చేర్చేందుకు సాక్షి ముందుకు వచ్చింది. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 కొత్త సిలబస్ పై నిపుణులతో విశ్లేషణ అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అక్టోబర్1న కేయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవగాహన సదస్సు జరగనుంది.
ముఖ్య అతిథులు
ప్రొ. ఘంటా చక్రపాణి- చైర్మన్ టీఎస్పీఎస్సీ
ప్రొ. హరగోపాల్- సిలబస్ కమిటీ చైర్మన్ టీఎస్సీస్సీ
సుధీర్ బాబు- పోలీస్ కమిషనర్(వరంగల్)
రామానుజరావు- ప్రిన్సిపాల్ ఆర్ట్&సైన్స్ కాలేజ్
ఎం. అబ్దుల్ కరీం- భారత దేశం హిస్టీరీ ప్యాకల్టీ
ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈ కింది నెంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకొగలరు.
డి. రమేశ్- 9705346414
కె. నర్సింహరాములు-9010501041
జి.ఎస్.రాజు-9505507612