guidence program
-
మావాడు ఎవరితోనూ కలవడండీ
‘‘మావాడు చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ కలవడు సర్. ఎప్పుడూ ఒంటరిగా తన పని తాను చేసుకుంటాడు. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ వాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ట్ చూపించడం లేదు. ఎవరినైనా ప్రేమించావా? అని అడిగితే అలాంటిదేం లేదంటాడు. సమస్య ఏమిటో అర్థం కావడం లేదు’’ ఆనందమూర్తి ఆవేదన. ఆయన చెప్పింది మొత్తం విన్నాక.. చేతన్‌తో మాట్లాడాలని చెప్పాను. అయితే మాట్లాడటానికి చేతన్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా మొక్కుబడిగా మాట్లాడాడు. చిన్నప్పటి నుంచీ స్నేహితులెవరూ లేరని చెప్పాడు. ‘ఎందుకలా?’ అని అడిగితే ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’ అని సమాధానమిచ్చాడు. ‘గాళ్ ఫ్రెండ్స్?’ అని అడిగినా అదే సమాధానం. ‘మీరు ఎవరితో క్లోజ్‌గా ఉంటారు?’ అనే ప్రశ్నకు ‘ఎవ్వరితోనూ లేదు. నాతో నేనే’ అని చెప్పాడు. అతని మాటల్లో ఎలాంటి భావోద్వేగాలూ లేవు, ఫ్లాట్‌గా సాగాయి. తన తల్లి కూడా అలాగే ఉంటుందని అతని మాటల్లో తెలిసింది. అతనిది కేవలం సిగ్గు, బిడియం, మొహమాటం కాదని, ఇంట్రావర్ట్ కూడా కాదని అర్థమైంది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకో డయాగ్నసిస్ అనంతరం అతను ‘స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్’ (ఎస్సీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. మూడు నుంచి ఐదు శాతం వ్యక్తుల్లో ఈ రుగ్మత కనిపిస్తుంది. సైకోథెరపీతోనే పరిష్కారం.. పర్సనాలిటీ డిజార్డర్ అంటే వ్యక్తిత్వంలో లోపాలు రుగ్మతలా మారడం. వీటిని నయం చేయడానికి ఎలాంటి మందులూ లేవు. సైకోథెరపీ ద్వారానే సహాయం చేయగలం. కానీ ఎస్సీపీడీ ఉన్నవారికి ఇతరులతో సంబంధాలే ఇష్టం ఉండదు కనుక థెరపీకి కూడా ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యులే తీసుకురావాల్సి వస్తుంది. ఎస్సీపీడీ పరిష్కారానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలను నిశితంగా పరిశీలించి, వారి ఆలోచనలు వారి చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఇతరులతో సంబంధాల ప్రాధాన్యం, ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తారు. సమస్య మూలాన్ని, కుటుంబ కారణాలను అర్థం చేసుకునేందుకు ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది. గ్రూప్ థెరపీ ద్వారా సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చు. ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఒంటరితనమే ఇష్టం.. ఎస్సీపీడీ లక్షణాలు బాల్యంలో ఉన్నప్పటికీ టీనేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు స్కూల్లో, పనిలో, సామాజిక పరిస్థితుల్లో, ఇతర రంగాల్లో పనితీరును కష్టతరం చేస్తాయి. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాలైతే ఫర్లేదు, లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రుగ్మత లక్షణాలు.. ♦ సన్నిహిత సంబంధాలను కోరుకోరు, ఆనందించరు. ♦ ఒంటరిగా ఉంటారు, పనులన్నీ ఒంటరిగా చేయాలనుకుంటారు. ♦ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో, ప్రతిస్పందించడంలో కష్టపడతారు. ♦ లక్ష్యాలను చేరుకోవాలనే ఉత్సాహం ఉండదు. ♦ ఇతరుల ప్రశంసలు లేదా విమర్శలకు ప్రతిస్పందించరు. ♦ సరదా, సంతోషం, స్పందనలేని రాయిలా కనిపిస్తారు. ♦ లైంగిక సంబంధాలపై ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. బాల్యంలో నిర్లక్ష్యానికి గురయితే.. పర్సనాలిటీ డిజార్డర్లను గుర్తించడం కష్టం. వాటికి సరైన కారణాలను గుర్తించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీపీడీకి కూడా కారణమేమిటో తెలియదు. జన్యుపర సంబంధం ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. భావోద్వేగాలను పట్టించుకోని వాతావరణం వల్ల ఈ రుగ్మతకు గురయ్యే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే, బాల్యంలో మానసికంగా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉండే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఈ రుగ్మత ఏర్పడటానికి దోహదం చేస్తుంది. నిర్ధారణ కష్టం.. ఎస్సీపీడీతో సహా ఇతర వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించడం చాలా కష్టం, ఎందుకంటే వ్యక్తిత్వ క్రమరాహిత్యం ఉన్న చాలామంది వ్యక్తులు తమ ప్రవర్తన లేదా ఆలోచనా విధానంలో సమస్య ఉందని భావించరు. మీలో కానీ, మీ సన్నిహితుల్లో కానీ ఎస్సీపీడీ ఉందని భావించినప్పుడు ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి. వారు మీ బాల్యం, మానవ సంబంధాలు, పనిలో మీ ప్రవర్తనపై ప్రశ్నలడిగి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి, పరీక్షలు చేసి సమస్యను నిర్ధారిస్తారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com. -
సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్ కాన్సెప్ట్‌లకు గొప్ప మార్గనిర్దేశం
స్టార్టప్‌లు ప్రారంభించే విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడోస్థానంలో ఉంది. నేటి యువత కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. అయితే, అందులో సక్సెస్ అవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మనదైన ప్రత్యేకతను చాటుకోవాలి. మరి అది జరగాలంటే స్టార్టప్ ప్రారంభించే ముందే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా స్టార్టప్ వ్యవస్థాపకులకు సాధికారత కలిగించే వాటి పై దృష్టి పెట్టాలి. అలాంటి అవకాశమే ఇప్పుడు సిఎక్స్ఓ (CXO) ఫోరమ్ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇటీవల ముగిసిన ఇండియన్ స్టార్ట్-అప్ ఫెస్టివల్ 2023 రెండవ ఎడిషన్ నుంచి వచ్చిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే.. ఆర్థిక పిరమిడ్ దిగువన ఉన్న స్టార్టప్‌ల నిజమైన సమస్యలను పరిష్కరించడానికి దోహద పడాలని. 2023 స్టార్ట్-అప్ ఫెస్టివల్లో భాగంగా స్టార్ట్-అప్ కమ్యూనిటీతో 30కి పైగా రంగాలకు చెందిన ప్రముఖలు ఇన్సైట్ ఫుల్ కీనోట్‌తో పాటు రౌండ్‌టేబుల్ చర్చలు జరిపారు. ఈ రౌండ్ టేబుల్ సిఎక్స్ఓ ఫోరమ్ తరువున ప్రతి కంపెనీలో సీఈఓ, సీఓఓ అండ్ సీఎఫ్ఓ వంటి ప్రముఖ నాయకత్వ పాత్రల గురించి చర్చించారు. కమ్యూనిటీకి సహకరించే ప్రయత్నంలో ఈ నాయకత్వ స్థానాలను కలిగి ఉన్న ప్రముఖ కార్యనిర్వాహకులు సిఎక్స్ఓ ఫోరమ్ అనే సింపోజియంను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రయత్నం వెనుక ఉన్న దార్శనికుడు మేనేజింగ్ డైరెక్టర్ BNY మెల్లన్‌లో ఎంటర్ప్రైజ్ క్వాలిటీ ఇంజనీరింగ్ గ్లోబల్ హెడ్ అట్లూరికి మంచి పేరు ఉంది. స్టార్టప్ ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువకులకు మెంటర్షిప్ అందించడం సిఎక్స్ఓ ఫోరమ్ ప్రాథమిక లక్ష్యం కానుంది. ఈ మార్గదర్శకత్వం వారికి నిర్మాణాత్మక పద్ధతిలో మార్గనిర్దేశం చేస్తోంది. తమ ఆలోచనలకు పెట్టుబడిని పొందడంలో కూడా ఈ 'సిఎక్స్ఓ ఫోరమ్' వారికి సహాయం చేస్తోంది. ఇది కార్పొరేట్లో అత్యున్నత ర్యాంక్‌లను కలిగి ఉన్న గొప్ప నిష్ణాతులైన వ్యక్తులందరూ కలిసి సమాజానికి తిరిగి ఇస్తున్న గిఫ్ట్. ఇండియా స్టార్ట్-అప్ ఫౌండేషన్, ఐఎస్ఎఫ్ 2023లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ విజేతలలో ఒకరైన అట్లూరి దీని గురించి మాట్లాడుతూ, "స్టార్టప్‌లలో, చాలా మంది ఒకే ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం మనం చూస్తాము. ఒకవేళ వారికి వినూత్న ఆలోచనలు ఉంటే.. అలాంటి వారికీ ఒక సరైన రోడ్ మ్యాప్ చూపిస్తే.. వారు చాలా గొప్పగా వృద్ధి చెందుతారని తెలిపారు. ఆలోచన ఎంత ముఖ్యమో.. ఆ ఆలోచనకు సరైన ఆచరణ మార్గం, అవగాహన ప్రక్రియ అంతకన్నా ముఖ్యం. ఆ సరైన ఆచరణ మార్గం, అవగాహన పక్రియను ఈ సిఎక్స్ఓ ఫోరమ్ అందిస్తోంది అంటూ అట్లూరి తెలిపారు. స్టార్ట్-అప్ వ్యవస్థాపకుడు C-లెవెల్ ఎగ్జిక్యూటివ్ రామ్ పుప్పాల మాట్లాడుతూ.. ప్రారంభ దశ స్టార్ట్-అప్లు నిజంగా డబ్బు సంపాదించడం ఎలాగో గుర్తించాలి, లాభపడాల్సిన అవసరం లేదు, కానీ త్వరగా రాబడిని పొందే మార్గాన్ని ఆలోచించాలి అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించి మరో వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ 'రాజ్ అల్లాడ' పరిణామం చాలా ముఖ్యంమని నేను అనుకుంటున్నాను. కస్టమర్ల నిజమైన విలువని కాపాడుకొవడం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. ఇక సీఎక్స్ఓ ఫోరమ్‌లో చేరిన ఇతర ఎగ్జిక్యూటివ్‌ల వివరాల విషయానికి వస్తే.. మురళి వుల్లగంటి (సీఈఓ, పీపుల్ షోర్స్), బ్రహ్మానంద్ రెడ్డి (సీటీఓ, డేటాలింక్ సాఫ్ట్వేర్), బారీ రుడాల్ఫ్ (ఫౌండర్, ఫాల్కన్స్టార్ సాఫ్ట్వేర్), సాయి గుండవల్లి (సీఈఓ, సోలిక్స్), అశోక్ చిటిప్రోలు (సీఈఓ, టెక్స్టార్ గ్రూప్ ), రామ్ పుప్పాల (సీఈఓ, ఏసీఎల్ వరల్డ్‌వైడ్), రాజ్ అల్లడ (ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, మేజర్ వాల్‌స్ట్రీట్ ఫర్మ్), సంతోష్ యంసాని (ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, బీఎన్వై మెల్లన్), అజయ్ తివారీ (ఫౌండర్ & సీఈఓ, హ్యాపీ లొకేట్), యూఎస్ఎస్ ఉప్పులూరి (ఛైర్మన్, EDVENSWA ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్), సోమ రావు (గ్లోబల్ బిజినెస్ లీడర్, జేపీ మోర్గాన్ చేజ్) మొదలైనవారు ఉన్నారు. సీఎక్స్ఓ ఫోరమ్ ఏం చేయబోతుంది? వినూత్న స్టార్టప్ కాన్సెప్ట్‌లతో ముందుకు వచ్చే తెలుగు యువకులకు సీఎక్స్ఓ ఫోరమ్ ఒక ముఖ్యమైన వేదికగా కానుంది. సీఎక్స్ఓ ఫోరమ్ యువకుల ఆలోచనలను ఇంకా అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వారు తమ ఆలోచనలను ప్రపంచ స్థాయిలో సమలేఖనం చేసుకునే అవకాశాన్ని కల్పించడం. అలాగే ఆ ఆలోచనలను అంతర్జాతీయ సాధనాలుగా మార్చడానికి దోహద పడటం. ఇలా ఈ సీఎక్స్ఓ ఫోరమ్ స్టార్టప్ కాన్సెప్ట్‌లకు గొప్పవరం కానుంది. ఉత్తర అమెరికాలోని ఎన్ఏటీఎస్ మరియు తానా వంటి జాతీయ తెలుగు సదస్సులలో సీఎక్స్ఓ ఫోరమ్‌లను రూపొందించడంలో అట్లూరి కీలకపాత్ర పోషించారు. -
గ్రూప్స్ పై సాక్షి అవగాహన సదస్సు
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో వేలాదిగా విడుదల కానున్న సర్కారీ కొలువుల పై సాక్షి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో.. వరంగల్ జిల్లాలోని కేయూ ఆడిటోరియంలో అక్టోబర్ 1న సాక్షి భవిత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 పరీక్షల ప్యాట్రన్ వెల్లడించడంతో లక్షల మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించినట్లయింది. ఇక ఈ నోటిఫికేషన్లలో విజేతలుగా నిలువాలంటే ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి?..ఏ పుస్తకాలను చదవాలి?..వంటి సందేహాలని నివృత్తి చేసి ... అభ్యర్థులను గెలుపు తీరం చేర్చేందుకు సాక్షి ముందుకు వచ్చింది. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 కొత్త సిలబస్ పై నిపుణులతో విశ్లేషణ అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అక్టోబర్1న కేయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవగాహన సదస్సు జరగనుంది. ముఖ్య అతిథులు ప్రొ. ఘంటా చక్రపాణి- చైర్మన్ టీఎస్పీఎస్సీ ప్రొ. హరగోపాల్- సిలబస్ కమిటీ చైర్మన్ టీఎస్సీస్సీ సుధీర్ బాబు- పోలీస్ కమిషనర్(వరంగల్) రామానుజరావు- ప్రిన్సిపాల్ ఆర్ట్&సైన్స్ కాలేజ్ ఎం. అబ్దుల్ కరీం- భారత దేశం హిస్టీరీ ప్యాకల్టీ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈ కింది నెంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకొగలరు. డి. రమేశ్- 9705346414 కె. నర్సింహరాములు-9010501041 జి.ఎస్.రాజు-9505507612