సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్‌ కాన్సెప్ట్‌లకు గొప్ప మార్గనిర్దేశం | CXO Forum A great guide to startup concepts | Sakshi
Sakshi News home page

సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్‌ కాన్సెప్ట్‌లకు గొప్ప మార్గనిర్దేశం

Published Tue, Aug 29 2023 9:38 PM | Last Updated on Tue, Aug 29 2023 9:39 PM

CXO Forum A great guide to startup concepts - Sakshi

స్టార్టప్‌లు ప్రారంభించే విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడోస్థానంలో ఉంది. నేటి యువత కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. అయితే, అందులో సక్సెస్‌ అవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని మనదైన ప్రత్యేకతను చాటుకోవాలి. మరి అది జరగాలంటే స్టార్టప్‌ ప్రారంభించే ముందే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా స్టార్టప్‌ వ్యవస్థాపకులకు సాధికారత కలిగించే వాటి పై దృష్టి పెట్టాలి. అలాంటి అవకాశమే ఇప్పుడు సిఎక్స్ఓ (CXO) ఫోరమ్ మన కళ్ళ ముందుకు వచ్చింది.          

ఇటీవల ముగిసిన ఇండియన్ స్టార్ట్-అప్ ఫెస్టివల్ 2023 రెండవ ఎడిషన్ నుంచి వచ్చిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే.. ఆర్థిక పిరమిడ్ దిగువన ఉన్న స్టార్టప్‌ల నిజమైన సమస్యలను పరిష్కరించడానికి దోహద పడాలని.  2023 స్టార్ట్-అప్ ఫెస్టివల్లో భాగంగా స్టార్ట్-అప్ కమ్యూనిటీతో 30కి పైగా రంగాలకు చెందిన ప్రముఖలు ఇన్‌సైట్‌ ఫుల్ కీనోట్‌తో పాటు రౌండ్‌టేబుల్ చర్చలు జరిపారు.    

ఈ రౌండ్ టేబుల్ సిఎక్స్ఓ ఫోరమ్ తరువున ప్రతి కంపెనీలో సీఈఓ, సీఓఓ అండ్ సీఎఫ్ఓ వంటి ప్రముఖ నాయకత్వ పాత్రల గురించి చర్చించారు. కమ్యూనిటీకి సహకరించే ప్రయత్నంలో ఈ నాయకత్వ స్థానాలను కలిగి ఉన్న ప్రముఖ కార్యనిర్వాహకులు సిఎక్స్ఓ ఫోరమ్ అనే సింపోజియంను ప్రారంభించడం జరిగింది.  ఈ ప్రయత్నం వెనుక ఉన్న దార్శనికుడు మేనేజింగ్ డైరెక్టర్ BNY మెల్లన్‌లో ఎంటర్‌ప్రైజ్ క్వాలిటీ ఇంజనీరింగ్ గ్లోబల్ హెడ్ అట్లూరికి మంచి పేరు ఉంది.   

స్టార్టప్ ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువకులకు మెంటర్‌షిప్ అందించడం సిఎక్స్ఓ ఫోరమ్ ప్రాథమిక లక్ష్యం కానుంది. ఈ మార్గదర్శకత్వం వారికి నిర్మాణాత్మక పద్ధతిలో మార్గనిర్దేశం చేస్తోంది. తమ ఆలోచనలకు పెట్టుబడిని పొందడంలో కూడా ఈ 'సిఎక్స్ఓ ఫోరమ్' వారికి సహాయం చేస్తోంది. ఇది కార్పొరేట్‌లో అత్యున్నత ర్యాంక్‌లను కలిగి ఉన్న గొప్ప నిష్ణాతులైన వ్యక్తులందరూ కలిసి సమాజానికి తిరిగి ఇస్తున్న గిఫ్ట్.   

ఇండియా స్టార్ట్-అప్ ఫౌండేషన్, ఐఎస్ఎఫ్ 2023లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ విజేతలలో ఒకరైన అట్లూరి దీని గురించి మాట్లాడుతూ, "స్టార్టప్‌లలో, చాలా మంది ఒకే ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం మనం చూస్తాము. ఒకవేళ వారికి వినూత్న ఆలోచనలు ఉంటే..  అలాంటి వారికీ ఒక సరైన రోడ్‌ మ్యాప్‌ చూపిస్తే.. వారు చాలా గొప్పగా వృద్ధి చెందుతారని తెలిపారు. ఆలోచన ఎంత ముఖ్యమో.. ఆ ఆలోచనకు సరైన ఆచరణ మార్గం, అవగాహన ప్రక్రియ అంతకన్నా ముఖ్యం. ఆ సరైన ఆచరణ మార్గం, అవగాహన పక్రియను ఈ సిఎక్స్ఓ ఫోరమ్ అందిస్తోంది అంటూ అట్లూరి తెలిపారు.
 
స్టార్ట్-అప్ వ్యవస్థాపకుడు C-లెవెల్ ఎగ్జిక్యూటివ్ రామ్ పుప్పాల మాట్లాడుతూ.. ప్రారంభ దశ స్టార్ట్-అప్‌లు నిజంగా డబ్బు సంపాదించడం ఎలాగో గుర్తించాలి, లాభపడాల్సిన అవసరం లేదు, కానీ త్వరగా రాబడిని పొందే మార్గాన్ని ఆలోచించాలి అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించి మరో వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ 'రాజ్ అల్లాడ' పరిణామం చాలా ముఖ్యంమని నేను అనుకుంటున్నాను. కస్టమర్‌ల నిజమైన విలువని కాపాడుకొవడం కూడా ఎంతో ముఖ్యం అన్నారు.

ఇక సీఎక్స్ఓ ఫోరమ్‌లో చేరిన ఇతర ఎగ్జిక్యూటివ్‌ల వివరాల విషయానికి వస్తే.. మురళి వుల్లగంటి (సీఈఓ, పీపుల్‌ షోర్స్), బ్రహ్మానంద్ రెడ్డి (సీటీఓ, డేటాలింక్ సాఫ్ట్‌వేర్), బారీ రుడాల్ఫ్ (ఫౌండర్, ఫాల్కన్‌స్టార్ సాఫ్ట్‌వేర్), సాయి గుండవల్లి (సీఈఓ, సోలిక్స్), అశోక్ చిటిప్రోలు (సీఈఓ, టెక్‌స్టార్ గ్రూప్ ), రామ్ పుప్పాల (సీఈఓ, ఏసీఎల్ వరల్డ్‌వైడ్), రాజ్ అల్లడ (ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్, మేజర్ వాల్‌స్ట్రీట్ ఫర్మ్), సంతోష్ యంసాని (ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్, బీఎన్‌వై మెల్లన్), అజయ్ తివారీ (ఫౌండర్ & సీఈఓ, హ్యాపీ లొకేట్), యూఎస్ఎస్ ఉప్పులూరి (ఛైర్మన్, EDVENSWA ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్), సోమ రావు (గ్లోబల్ బిజినెస్ లీడర్, జేపీ మోర్గాన్ చేజ్) మొదలైనవారు ఉన్నారు. 

సీఎక్స్ఓ ఫోరమ్‌ ఏం చేయబోతుంది? 
వినూత్న స్టార్టప్ కాన్సెప్ట్‌లతో  ముందుకు వచ్చే తెలుగు యువకులకు సీఎక్స్ఓ ఫోరమ్ ఒక ముఖ్యమైన వేదికగా కానుంది.  సీఎక్స్ఓ ఫోరమ్ యువకుల ఆలోచనలను ఇంకా అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వారు తమ ఆలోచనలను ప్రపంచ స్థాయిలో సమలేఖనం చేసుకునే అవకాశాన్ని కల్పించడం. అలాగే ఆ ఆలోచనలను అంతర్జాతీయ సాధనాలుగా మార్చడానికి దోహద పడటం. ఇలా ఈ సీఎక్స్ఓ ఫోరమ్ స్టార్టప్ కాన్సెప్ట్‌లకు గొప్పవరం కానుంది. ఉత్తర అమెరికాలోని ఎన్ఏటీఎస్ మరియు తానా వంటి జాతీయ తెలుగు సదస్సులలో సీఎక్స్ఓ ఫోరమ్‌లను రూపొందించడంలో అట్లూరి కీలకపాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement