group3
-
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన సర్కార్ మరో నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రూప్-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. -
సజావుగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్–3 మెయిన్ పరీక్ష తొలిరోజు సజావుగా ముగిసింది. 12 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1,735 మంది అభ్యర్థులకు గానూ 1,620 మంది హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఎస్ఎస్బీఎన్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ విజయకుమార్ 12 కేంద్రాలను తనిఖీ చేశారు. రెండో రోజు సోమవారం ఆరు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. -
పరీక్ష ప్రశాంతం
- 176 కేంద్రాల్లో గ్రూపు-3 పరీక్ష - 56,076 మందికి 36,816 మంది హాజరు - వివరాలు సరిపోలక ఇబ్బందులు - అభ్యర్థుల అండర్‌టేకింగ్‌తో పరీక్షకు అనుమతి కర్నూలు(అగ్రికల్చర్): ఏపీపీఎస్సీ గ్రూపు-3 కేటగిరీలో పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన 176 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12.30 వరకు నిర్వహించిన పరీక్షకు 56,076 మందికిగాను 36,816 మంది హాజరయ్యారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల వారిని ఆళ్లగడ్డ, నంద్యాల.. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు కేటాయించడం వల్ల అభ్యర్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిషు మీడియం స్కూల్ అడ్రసును బి.క్యాంపు మాధవీనగర్ అడ్రసుపై హాల్ టికెట్లు జారీ చేశారు. అయితే పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ కేంద్రం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని బిషప్ చర్చి ఎదుట ఉన్నట్లు అ«ధికారులు ప్రకటించారు. అడ్రసు మారినందునా అభ్యర్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా అధికారులు రెండు కార్లు, 12 ఆటోలను సిద్ధంగా ఉంచారు. వివరాల్లో తేడాలతో ఇక్కట్లు... మొదటి సారిగా అభ్యర్థుల పూర్తి వివరాలతో ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. అయితే ఓఎంఆర్ షీట్, హాల్ టికెట్‌లోని వివరాలు సరిపోలకపోవడంతో ఇన్విజిలేటర్లు అభ్యంతరం తెలిపారు. భార్య పేరుకు బదులు భర్త పేరుండటం, హాల్ టికెట్లో ఫొటోలు తారుమారు కావడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. కర్నూలు సిల్వర్ జుబ్లి కళాశాల, నంద్యాలలోని మరో సెంటరులో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొన్ని సెంటర్లలో ఇంటి పేర్లలోను తేడాలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీ అధికారుల సూచనల మేరకు అభ్యర్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకొని పరీక్షకు అనుమతించారు. రెండు, మూడు అంతస్తుల్లో సీట్లు కేటాయించడంతో అక్కడికి చేరుకునేందుకు వికలాంగులు నానా ఇబ్బంది పడ్డారు. నలుగురు ఎపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు జిల్లాలో జరిగిన పరీక్షను పర్యవేక్షించారు. 11 మంది డిప్యూటీ కలెక్టర్లు అసిస్టెంటు కో ఆర్డినేటర్లుగా, 44 మంది తహసీల్దార్లు లైజన్ అధికారులుగా పరీక్షను పర్యవేక్షించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ సీనియర్ సెక్షన్ అధికారి రమణ తెలిపారు. డీఆర్వో గంగాధర్‌గౌడు, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, డీటీ ఆదినారాయణ, ఇతర రెవెన్యూ అధికారులు బాగా సహకరించాలని కితాబిచ్చారు. -
ఏపీపీఎస్సీ సెంటర్లో స్వల్ప మార్పు
కర్నూలు(అగ్రికల్చర్): ఎపీపీఎస్సీ గ్రూపు–3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి 23న జరిగే ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఒక సెంటర్‌ను మార్పు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. బి.క్యాంపు మాధవీనగర్‌లోని సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్ సెంటరుకు కేటాయించబడిన అభ్యర్థులు సమీపంలోనే ఉన్న నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బిషప్ చర్చి ఎదురుగా ఉన్న సాయి సుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. స్కూల్ ఒక్కటేనని.. కేవలం అడ్రస్ మారిందని తెలిపారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని సూచించారు. -
గ్రూపు–3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
రేపు 176 కేంద్రాల్లో పరీక్ష – హాజరు కానున్న 56,076 మంది అభ్యర్థులు – ఓఎంఆర్ షీటులో అభ్యర్థుల పూర్తి వివరాలు – వైట్నర్ వాడితే 1/3 మైనస్ మార్కులు కర్నూలు(అగ్రికల్చర్): ఏపీపీఎస్సీ గ్రూపు–3 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 23న నిర్వహించనున్నారు. మొత్తం 56,076 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గ్రూపు-3 పోçస్టులు జిల్లాలో 86 ఉండగా ఒక్కో పోస్టుకు 652 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షలో ఏపీపీఎస్సీ కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఓఎంఆర్ షీట్లో మొదటి సారిగా అభ్యర్థి పేరు ఇతర వివరాలన్నీ ముద్రించారు. 1/3 మైనస్ మార్కులు కూడా పెట్టారు. ఓఎంఆర్ షీట్లో వైట్నర్తో ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. అభ్యర్థులు పొరపాటున వైట్నర్ను మూడు సార్లు వాడితే అభ్యర్థికి వచ్చే మొత్తం మార్కుల్లో ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కర్నూలు, కల్లూరుతో పాటు పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరులో మొత్తం 176 సెంటర్లు ఏర్పాటయ్యాయి. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు జరుగుతుంది. పరీక్ష నిర్వహణకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కో–ఆర్డినేటర్‌గా.. 11 మంది డిప్యూటీ కలెక్టర్లు అసిస్టెంట్ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. 44 మంది తహసీల్దార్లు లైజన్ ఆఫీసర్లుగా ఉంటారు. అవగాహన సదస్సు ఏపీపీఎస్సీ గ్రూపు–3 పరీక్షను పురస్కరించుకొని, అసిస్టెంట్ కో– ఆర్డినేటింగ్ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్, అసిస్టెంటు లైజన్ అధికారులకు శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీపీఎస్సీ సీనియర్ సెక్షన్ ఆఫీసర్ సి.వి.రమణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణలు పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.