ఏపీపీఎస్‌సీ సెంటర్‌లో స్వల్ప మార్పు | small change in appsc center | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్‌సీ సెంటర్‌లో స్వల్ప మార్పు

Published Sat, Apr 22 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

small change in appsc center

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎపీపీఎస్‌సీ గ్రూపు–3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి 23న జరిగే ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఒక సెంటర్‌ను మార్పు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. బి.క్యాంపు మాధవీనగర్‌లోని సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ సెంటరుకు కేటాయించబడిన అభ్యర్థులు సమీపంలోనే ఉన్న నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బిషప్‌ చర్చి ఎదురుగా ఉన్న సాయి సుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌కు చేరుకోవాలని డీఆర్‌ఓ సూచించారు. స్కూల్‌ ఒక్కటేనని.. కేవలం అడ్రస్‌ మారిందని తెలిపారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement