![Scoot Airlines launches network sale with limited time offer - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/15/scoot_airlines_offers.jpg.webp?itok=hcHiaNzO)
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ)లో భాగమైన స్కూట్ నెట్‌వర్క్ తాజాగా చౌక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ నగరాల నుంచి విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. రూ. 6,200 నుంచి చార్జీలు మొదలవుతాయని వివరించింది.
హైదరాబాద్ నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు రూ. 12,900 నుంచి, వైజాగ్ నుంచి సెబూ (ఫిలిప్పీన్స్)కు రూ. 11,900 నుంచి వన్–వే చార్జీలు (పన్నులు సహా) ప్రారంభమవుతాయని స్కూట్ తెలిపింది. ఈ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment