
పట్నా/చెన్నై: సాంకేతిక లోపాలు తలెత్తడంతో సోమవారం స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఒకటి ఢిల్లీ–షిల్లాంగ్ సరీ్వసు కాగా, మరోటి చెన్నై–కోచి విమానం. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అధికారుల సూచనల మేరకు ఉదయం8.52 గంటల సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా, చెన్నై నుంచి కోచికి 117 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment