వికలాంగులు, లబ్ధిదారుల ఎదురుచూపులు
జడ్చర్ల : ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పథకం కింద అందజేస్తున్న పించన్‌ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు,తదితర పింఛన్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు పింఛన్లు పంపిణీ చేసే పోస్టాఫీస్ కార్యాలయాల వద్దకు చేరుకుని పింఛన్ తమకు ఎప్పుడు ఇస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. పంపిణీలో సాంకేతిక సమస్యలు, నగదు లేకపోవడం, తదితర కారణంగా పింఛన్‌లు తమ చేతికి అందడం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. సోమవారం బాదేపల్లి, జడ్చర్ల పోస్టాఫీస్‌ల వద్ద పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడినా చివరకు చేతికి అందక నిరాశగా వెనుదిరిగారు. పింఛన్‌ల కోసం పోస్టాఫీస్ చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోతున్నామని, తమకు ఇబ్బందులు కలుగకుండా పింఛన్‌లు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment