pension amount
-
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు?
హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పింఛన్‌ను గత నెలలో రూ.3,016 నుంచి రూ.4,016కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకూ పెంచాలని ఇతర ఆసరా పింఛనుదారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది. వీరికి సైతం వెయ్యి పెంచి రూ.3,016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్ధిదారులకూ త్వరలో పింఛను మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 44,82,254 మందికి పింఛన్లు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో పాటు పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు; గీత, చేనేత, బీడీ కార్మికులు; ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు కలిపి మొత్తం 44,82,254 మందికి పింఛను ఇస్తోంది. ఇందుకు ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల్లో 5,16,890 మంది దివ్యాంగులకు గత నెల నుంచి వెయ్యి పెంచింది. వీరిని మినహాయిస్తే.. ఇతర పింఛనుదారులు 39 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై మరో రూ.450 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. -
EPFO: అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇలా!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలో అధిక పెన్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు.. అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వడంతోపాటు దరఖాస్తు నింపాలి. ఇందుకు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో లింకును అందుబాటులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారు, ప్రస్తుతం సర్వీసులో ఉండి అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు జాయింట్ ఆప్షన్ ఇవ్వాలి. వీరు మే నెల 3 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు గడువు విధించింది. అయితే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలుండి ఆప్షన్ ఇచ్చి ఈపీఎఫ్ఓ ద్వారా తిరస్కరణకు గురైన వారు మాత్రం మార్చి 3లోపు జాయింట్ ఆప్షన్‌తోపాటు వివరాలు సమర్పించాలి. కాగా, అర్హులు ఎవరైనా జాయింట్ ఆప్షన్‌ను ఇవ్వకుంటే భవిష్యత్తులో అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సర్వర్ సతాయింపు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో అధిక పెన్షన్ లింకును ఎక్కువ మంది ఓపెన్ చేస్తున్నారు. దీంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. సాధారణ సమయంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే ఈపీఎఫ్ఓ వెబ్సైట్... తాజాగా అధిక పెన్షన్‌కు సంబంధించిన ఒత్తిడి పెరగడంతో స్తంభించిపోతోంది. వెబ్సైట్లో పేజీ తెరిచి ఆప్షన్ నమోదు లింకు, దరఖాస్తు లింకును క్లిక్చేస్తోంటే చాలామందికి ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీంతో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలున్న వారికి ఈ సాంకేతిక సమస్య గుబులు పుట్టిస్తోంది. -
దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్
నౌపడ: హితారామ్ సత్నామీ. వయోభారంతో ఆరోగ్యం క్షీణించిన వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడని నివసిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్ యోజన’ లబ్ధిదారుడు. స్వయంగా నడవలేడు. ప్రతినెలా దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకొనేవాడు. ఫిబ్రవరిలో మాత్రం అతడికి ఈ ప్రయాణ బాధ తప్పింది. గ్రామ సర్పంచి డ్రోన్ ద్వారా పెన్షన్ అందజేసే ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. సర్పంచ్ సరోజ్ అగర్వాల్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులను తన ఇంటి వద్దకే చేర్చారని హితారామ్ సత్నామీ ఆనందం వ్యక్తం చేశాడు. వృద్ధుడు హితారామ్ గురించి తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఆన్లైన్లో డ్రోన్ కొనుగోలు చేశామని, ప్రతినెలా డ్రోన్ సాయంతో అతడికి పెన్షన్ అందజేయాలని నిర్ణయించామని సర్పంచ్ సరోజ్ అగర్వాల్ చెప్పారు. -
AP: 63.87 లక్షల మందికి రూ.1,759.99 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 63,87,275 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,759.99 కోట్లను పంపిణీ చేయనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదురోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
శభాష్ వలంటీర్!
నరసాపురం రూరల్/ కొయ్యలగూడెం: అనారోగ్యంతోనో, ప్రమాదానికి గురవడం వల్లో వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన లబ్ధిదారులకు వారివద్దకే వెళ్లి పింఛన్ల సొమ్ము అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పలువురు వలంటీర్లు. మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కట్టా కనకరాజు కల్లుగీత కార్మికుడు. ఇటీవల కల్లుగీతకు చెట్టెక్కి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుకు స్థానిక వలంటీర్ గెద్దాడ శివకృష్ణ శుక్రవారం ఆస్పత్రికే వెళ్లి గీత కార్మిక పింఛను సొమ్ము అందజేశాడు. కష్టంలో ఉండగా అందించిన సొమ్ము తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగరాజు సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే కొయ్యలగూడెం మండలం పరింపూడి–2 సచివాలయ ఉద్యోగి సిరాజు తాను సైతం అంటూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లి పింఛను అందజేశాడు. పరింపూడికి చెందిన గాలంకి వెంకటేశం అనే వృద్ధుడు దేవరపల్లి వెళ్లి టైఫాయిడ్ జ్వరం వల్ల అక్కడే ఉండిపోయాడు. స్థానిక వలంటీర్ సెలవుపై ఉండటంతో వెంకటేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సిరాజు శుక్రవారం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశాడు. ఈ సందర్భంగా సిరాజును ఎంపీడీవో కేఆర్ఎస్ కృష్ణప్రసాద్ అభినందించారు. -
భార్య కళ్లముందే గుండెపోటుతో భర్త మృతి
కొత్తవలస: ఆయన రైల్వే విశ్రాంత ఉద్యోగి. ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో భార్యతో కలిసి బయలుదేరారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా.. కష్టసుఖాలు చెప్పుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు మెట్లు ఎక్కనేలేదు. అక్కడ ఉన్న ఏటీఎం వద్ద ఒక్కసారిగా వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో వృద్ధురాలైన భార్య తెలుసుకునేలోపే ప్రాణం విడిచిన హృదయవిదారక ఘటన కొత్తవలస స్టేట్‌బ్యాంకు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన బోదం తాతాలు(75) రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈయన ఇద్దరు పిల్లలకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ మల్లివీడులో ఉంటున్నారు. పెన్షన్ డబ్బుల డ్రా చేసేందుకు భార్య రాములమ్మతో కలిసి బ్యాంకుకు బయలుదేరారు. బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
పేదల నడ్డి విరుస్తోన్న బీజేపీ
ఇల్లందకుంట (హుజూరాబాద్): ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇస్తున్న పింఛన్‌కన్నా మూడు రెట్లు ఎక్కువగా తెలంగాణలో ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం స్వయం సహాయక సంఘా లకు 3.14 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2 వేల పెన్షన్ అమలు చేస్తున్నా రా అని ప్రశ్నించారు. పేదోడికి టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి డబ్బులు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పన్నులు విధించే బీజేపీ వైపు ఉంటారా? ప్రజల అవసరాలు తీర్చే టీఆర్ఎస్ వైపు ఉంటారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇల్లందకుంట మండలంలోని 682 సహాయక సంఘాలకు 3.14 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.1.30 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మండలంలోని 18 పంచాయతీలకుగాను 18 మహిళా సంఘ భవనాలకు 2.36 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. మండల సమాఖ్యకు మరో 70 లక్షలు కేటా యించి, నాలుగు నెలలలోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఒక్క సంఘ భవనం కూడా కట్టించలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నిరుపయోగమని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
మాకు పెన్షన్‌పై ఐటీ మినహాయింపు ఇవ్వండి
దేశంలోని సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించడానికి ఆదాయపు పన్ను నుంచి పెన్షన్‌ను మినహాయించాలని భారతీయ పెన్షనర్ల సంఘం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ ఏడాది ఆగస్టు 25న ప్రధానికి రాసిన లేఖలో, పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యుల పెన్షన్లు పన్ను పరిధిలోకి రాకపోతే, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌పై ప్రభుత్వం ఎందుకు ఆదాయపు పన్ను విధిస్తుందని ఆ సంస్థ వాదించింది. "ప్రతి రిటైర్డ్ వ్యక్తికి అనేక సంవత్సరాలు దేశానికి సేవ చేయడం వల్ల అతని/ఆమె జీవనోపాధి కొరకు రిటైర్ మెంట్ ఫండ్ గా పెన్షన్ చెల్లిస్తున్నట్లు" అని అందులో పేర్కొంది.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు అతిపెద్ద శుభవార్త!) "ఇప్పుడు, పెన్షన్ (రిటైర్డ్ ఉద్యోగుల)పై ఆదాయపు పన్ను ఎందుకు విధిస్తున్నారు అనే ప్రశ్న లేవనెత్తింది. ఇది ఏ సేవ లేదా పని వల్ల వచ్చిన ఆదాయం కాదు. ఎంపిలు, ఎంఎల్ఎల పెన్షన్ పన్ను పరిధిలోకి రాకపోతే, మా పెన్షన్‌పై ఎందుకు పన్ను విధిస్తున్నారు?" అని ఆ సంఘం లేఖలో పేర్కొంది. జూలై 23, 2018న షిర్డీ (మహారాష్ట్ర)లో జరిగిన తన మొదటి అఖిల భారత సదస్సులో ఈ సంస్థ పెన్షన్‌ను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని తీర్మానించింది. అప్పటి నుంచి ఈ సమస్యను ఈ సంస్థ ఆర్థిక మంత్రితో నిరంతరం లేవనెత్తుతోంది, అయితే మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఈ విషయంలో దయచేసి జోక్యం చేసుకోవాలని, పింఛనుదారుల నిజమైన డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించాలని భారతీయ పెన్షనర్ల సంఘం మోడీని కోరింది. -
పుట్టు మూగ, చెవిటి దివ్యాంగుడు.. అయినా అందని పింఛన్
సాక్షి, మరిపెడ (వరంగల్): చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన కోల నర్సయ్యకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉంది. ఇతడికి జూన్ 7, 2011లో జీవితకాలం సదరం సర్టిఫికెట్ జారీ చేసిన గత ప్రభుత్వ హయాంలో నెల నెలా రూ.200 పింఛన్ డబ్బులు అంజేశారు. ఈ క్రమంలో దివ్యాంగుడి తల్లిదండ్రులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వివాహం కాని ఇతడి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు. దీంతో ఊరూరు తిరుగుతూ బంధువుల ఇళ్లల్లో కొద్ది రోజుల పాటు తలదాచుకుంటూ వచ్చాడు. దివ్యాంగుడు నర్సయ్య గ్రామంలో లేని కారణంగా ఇతడికి వచ్చే పింఛన్‌ను అధికారులు కొట్టివేశారు. బంధువులు కూడా సాకలేమనడంతో 6 సంవత్సరాల క్రితం తిరిగి స్వగ్రామమైన విస్సంపల్లి చేరుకున్నాడు. నా అనేవారు లేక పోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా బతికీడుస్తున్నాడు. అప్పటి నుంచి తన దగ్గర ఉన్న జీవిత కాలం దివ్యాంగుడి సర్టిఫికెట్ పట్టుకొని అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఎవరూ కనికరం చూపలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా?
దేశ వ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో సరికొత్త పెన్షన్ పథకం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకంలో చేరడానికి గడువు తేదీని 2023 మార్చి 31 వరకు పొడగించింది. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై వార్షిక ఆదాయం 7.66 శాతం వరకు పొందవచ్చు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు. అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు వారికీ ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనకకు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు! -
ఖతర్నాక్ వలంటీర్.. కలెక్టర్ వేటు
సాక్షి, మడకశిర: ‘వైఎస్సార్ పింఛన్’ డబ్బు కోసం కట్టుకథ అల్లాడు ఓ వలంటీర్. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.43,500 దోచుకెళ్లారంటూ అందరినీ నమ్మించే యత్నం చేశాడు. వివరాల్లోకెళితే... పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శివాపురం పరిధిలో వార్డు వలంటీర్‌గా వీరప్ప పని చేస్తున్నారు. గురువారం 1వ తేదీ కావడంతో లబి్ధదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి తెల్లవారు జామున 4.30 గంటలకే సిద్ధమయ్యాడు. శివాపురం కాలనీ పరిధిలోని కొండ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి దాదాపు రూ.43,500 జేబులో పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో కట్టుకథను అల్లాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు కళ్లలో కారంకొట్టి రూ.43,500 దోచుకెళ్లారని స్థానికులను నమ్మించే యత్నం చేశాడు. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. (మడకశిరలో దోపిడీ దొంగల బీభత్సం) విచారణలో తేలిన నిజం విషయం తెలియగానే స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కమిషనర్ నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరప్పను వారు విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని తేల్చారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. రూ.43,500 ను వలంటీర్ నుండి రికవరీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ నాగార్జున తెలిపారు. విధుల నుంచి తొలగింపు మడకశిరరూరల్: శివాపురం సచివాలయ పరిధిలోని వలంటీర్ వీరప్పను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విధుల నుంచి తొలగించాలని కమిషనర్ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ సొమ్ము రూ.43,500 అపహరణ వ్యవహారంలో వలంటీర్ అసత్యాలు, కట్టు కథ అల్లినట్లు విచారణలో తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
అయ్యా...నా డబ్బులు వచ్చాయేమో చూడు...!
మునుగోడు : నాకు ప్రతి నెలా వస్తున్న ఆసరా పింఛన్ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎందుకు రాలేదు సారు అంటే మండల పరిషత్ కార్యాలయంలో అడుగుపొమ్మని పోస్టాఫీసు ఉద్యోగులు చెప్పారు. అక్కడికి వెళ్లి అడిగితే సరిచేశాం వచ్చే నెలా వస్తుంది తీసుకోమని ఎంపీడీఓ మేడం చెప్పింది...తిరిగి మరుసటి నెల ఫోస్టాఫీసుకు వచ్చి అడిగితే రాలేదని చెప్పారు. దీంతో ఈ రోజైనా వస్తుందేమోనని ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి వారిని చూడమని వేడుకుంటున్నా...అని మండల కేంద్రానికి చెందిన నారగోని మల్లయ్య అనే వృద్ధుడు శనివారం తన గోడును సాక్షికి మొరపెట్టుకున్నాడు. మునుగోడుకు చెందిన మల్లయ్యకు 15 ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అయితే ఆ డబ్బులతో తన కుమారులపై ఆధార పడకుండా అతడికి అవసరమైన వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నాడు. కానీ సెప్టెంబర్ నుంచి డబ్బులు రావడం లేదు. దాంతో ఆయన ఎన్ని కార్యాలయాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇతడితో పాటు మరో 8 మంది లబ్ధిదారులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. విషయాన్ని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పింఛన్ డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. -
చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్
సాక్షి, సిరిసిల్ల : ఉన్నత చదువులు చదివి పంచాయతీ కార్యాలయంలో పింఛన్లు రానివారికి పునరుద్ధరించడానికి అధికారులు తలమునకలు అవుతుంటే.. ఏడో తరగతి చదివిన బీడీ కార్మికుడు ఫ్రాడ్ నంబర్లతో పింఛన్‌దారుల సొమ్మును తన అకౌంట్లో వేసుకున్న తతంగం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.ఎంపీడీవో కార్యాలయం అధికారుల వివరాల ప్రకారం.. బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన సత్యనారాయణ అనే బీడీ కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట వృద్ధుల పింఛన్లను మూడు నెలలుగా స్వాహా చేస్తున్నాడు. ఈ తతంగమంతా పింఛన్ విభాగంలో కంప్యూటర్ విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్ల సహాయంతో చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధిత వృద్ధులు తమకు డబ్బులు రావడం లేదని చెప్పడంతో అనుమానం వచ్చిన అధికారులు సంబంధిత వివరాలను వెతికారు. ఈ క్రమంలోనే ఒక బ్యాంక్ ఖాతాలో మూడు నెలలుగా దాదాపు రూ.60వేలు పలువురివి పలు బ్యాంక్ నంబర్లలో జమ అవుతున్నట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు గుర్తించారు. బ్యాంక్ ఖాతాల వివరాల ప్రకారం ఏపీవో పింఛన్ల బాధ్యుడు పాపారావు, సత్యనారాయణ వివరాలను బ్యాంక్ నుంచి సేకరించి ఏలాగోలా సిరిసిల్లకు రప్పించాడు. పింఛన్లు స్వాహా చేయడానికి సత్యనారాయణ ఎన్నుకున్న విధానం, యూజర్‌నేమ్, పాస్‌వర్డులను తెలుసుకున్న విధానాలను అతడితోనే చెప్పించారు. పింఛన్ విభాగంలో పలువురు ప్రైవేటు ఆపరేటర్లు సమాచారాన్ని బయటకు ఇవ్వడంతోనే మోసాలు జరిగినట్లు చర్చ జరుగుతుంది. నిందితుడు సత్యనారాయణపై చర్యలకు వెళ్తున్నట్లు ఏపీవో పాపారావు తెలిపారు. -
కన్నీటి బతుకులకు ఊరట
సాక్షి, శ్రీకాకుళం : ఏడు నెలలు గడిచాయి.. అయినా వారికి న్యాయం జరగలేదు. ఇంటి యజమానులు పాకిస్థాన్ చెరలో ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు చదువులు లేవు. వృద్ధులకు, మహిళలకు ఆసరా కరువు. అసలు తమవారు తిరిగొస్తారో లేదోనన్న ఆవేదన. ప్రభుత్వం తమ మొర ఆలకిస్తుందో లేదోనన్న ఆందోళన. అర్ధ సంవత్సరం దాటినా పాత ప్రభుత్వం పట్టించుకోలేదు.. కొత్త సర్కారైనా మొర వింటుందన్న ఆశతో ‘స్పందన’కు హాజరయ్యారు.. తమ కన్నీళ్లను కాగితంపై పెట్టి కలెక్టర్‌కు అందించారు. ఆశ్చర్యం.. నాలుగు రోజుల్లోనే అధికారులు స్పందించారు. నెలకు రూ.4,500 వంతున ఏడు నెలలకు రావాల్సిన పింఛన్ మొత్తం రూ.31,500 ఒకేసారి అందించారు. ఇలా బాధిత 12 కుటుంబాల వారికి సాయం అందింది. పాకిస్థాన్ చెర నుంచి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను విడిపించడానికి కేంద్ర ప్రభుతానికి లేఖ రాశామని కలెక్టర్ నివాస్ తెలిపారు. గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఎచ్చెర్ల మండలంలోని కె.మత్స్యలేశం, డి.మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ తదితర గ్రామాలకు చెందిన 12 కుటుంబాలలోని 15 మంది మత్స్యకారులు పాకిస్థానీ సైనికులకు చిక్కారు. వీరిలో ముగ్గురు బోటు డ్రైవర్లు కాగా మిగిలిన వారు కళాసీలుగా పనిచేసేవారు. వారిని విడిపించేందుకు గత ప్రభుత్వం చొరవ చూపలేదు. బాధితులు అప్పటి నాయకులకు ఆశ్రయించినా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. కనీసం పింఛను కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీవెన్స్ సెల్‌ను చిత్తశుద్ధితో నిర్వహించాలని, తక్షణం స్పందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో వారిలో చిన్న ఆశ కలిగింది. ఈనెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమానికి హాజరై పాకిస్థాన్ చెరలో ఉన్న వారిని విడిపించాలని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు శుక్రవారం బాధిత కుటుంబాలకు పింఛను అందజేశారు. 12 మత్య్సకార కుటుంబాలకు చెక్కుల పంపిణీ పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్ల చెక్కులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.4,500ల వంతున రాష్ట్ర ప్రభుత్వం పింఛనును ప్రకటించింది. అందులో భాగంగా 7 నెలలకు రూ. 31,500 వంతున 12 కుటుంబాలకు రూ.3,78,000ల విలువ గల చెక్కులను అందించారు. ప్రభుత్వం నుంచి పింఛను సొమ్ము రావడంలో జాప్యం కావడంతో జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులను జిల్లా కలెక్టర్ సర్దుబాటు చేశారు. చెక్కులు అందుకున్న వారిలో వాసుపల్లి శామ్యూల్, కేసము యర్రయ్య, బాడి అప్పన్న, సూరాడ అప్పారావు, కోనాడ వెంకటేష్, దుండంగి సూర్యనారాయణ, కేసము రాజు, గనగళ్ల రామారావు, చీకటి గురుమూర్తి, మైలపల్లి సన్యాసిరావు, పెంట మణి, షకియా సుమంత్‌ల కుటుంబాలు ఉన్నాయి. వారితోపాటు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వీవీ కష్ణమూర్తి, సంఘ నాయకులు మూగి శ్రీరాములు, వారది యర్రయ్య, మైలపల్లి పోలీసు, మూగి గురుమూర్తి, చింతపల్లి సూర్యనారాయణ, సూరాడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుతానికి లేఖ: కలెక్టర్ నివాస్ పాకిస్థాన్ చెరలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కలెక్టర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న మత్స్యకారుల విడుదలకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ‘స్పందన’ కార్యక్రమంలో అందిన అర్జీ ఆధారంగా మత్స్యకారుల కుటుంబాలకు పింఛన్లు వెంటనే చెల్లించామని కలెక్టర్ తెలిపారు. మత్య్సకారులుకు వలలు, ఇతర వసతులు కల్పించి కుటుంబాలను ఆదుకొంటామని తెలిపారు. నా కుటుంబం నుంచి ముగ్గురు.. పాకిస్థాన్ చెరలో మా కుటుంబం నుంచి ముగ్గురు బందీలుగా ఉన్నారు. వారు లేక పూర్తిగా మా కుటుంబం రోడ్డున పడింది. ఏడు నెలలు గడిచాయి. పలుసార్లు అధికారులను, నాయకులను కలసి మా గోడు వినిపించుకొన్నాం. అయినా పరిష్కారం లేదు. భర్త, పిల్లలు లేక దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాను. –సూరాడ ముగతమ్మ ఉత్తరాలు కూడా రావడం లేదు పాకిస్థాన్ చెరలో చిక్కిన తరువాత కొన్ని నెలలు ఉత్తరాలు వచ్చేవి. ఇటీవల వారి నుంచి సమాచారం కూడా కరువైయింది. వారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తెలుస్తోంది. వారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వారు లేక మేం ఇక్కడ నిరాశ్రయులుగా మారాం. ప్రభుత్వం ఆదుకోవాలి. –గనగళ్ల నూకమ్మ -
వాళ్లు చనిపోయారు..కానీ పింఛన్లు మాత్రం వస్తున్నాయి
ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదనుకున్నారో ఏమో... ఏం చేసినా ఎవరూ గుర్తించరు అనుకున్నారో ఏమో... చనిపోయినవారి పేరుమీద వచ్చిన పింఛన్లు కాజేసినా ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో... ఓ ఇద్దరు ఉద్యోగులు అక్రమానికి తెరతీశారు. అథంటికేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆరు నెలలుగా చనిపోయినవారి పేరున పింఛన్లు తీసేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఇప్పుడు వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సాక్షి, బలిజిపేట(విజయనగరం) : బడుగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను ఓ ఇద్దరు ఉద్యోగులు పక్కదారి పట్టించేశారు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా... ప్రతి నెలా వారి పేరు న తీసేసుకుంటున్నారు. ఆరు నెలలుగా ఈ అక్రమం సాగుతోంది. బలిజిపేట మండలం గలావల్లిలో వెలుగు చూసిన సంఘటన ఇది. గలావల్లి పంచాయతీ పరిధిలోని కడగల రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102371602), చందక సంగయ్య(పెన్షన్ ఐడీ 102394294), మజ్జి రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102137032), రాగోలు రామయ్య(పెన్షన్ ఐడీ 102796572), గేదెలపేటకు చెందిన కొంచాడ సుందరమ్మ(పెన్షన్ ఐడీ 102404322), చందక రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102820571) 6 నెలల క్రితమే మృతి చెందారు. వారిపేర్లు జాబితా నుంచి తొలగించకపోవడంతో పింఛన్లు మంజూరవుతున్నాయి. ఆ మొత్తాలను ఇద్దరు ఉద్యోగులు దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. జూన్‌నెల పింఛన్ల పంపిణీ సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. రాగోలు రామయ్య డిసెంబర్లో పింఛ న్ తీసుకుని మృతి చెందినా ఆ పేరు తొలగించకపోవడంతో అతని పేరున పింఛన్ వచ్చేస్తోంది. అతని భార్య సుందరమ్మకు వితంతు పింఛన్ ఫిబ్రవరి నుంచి ఇస్తున్నారు. ఈ 6 నెలల వ్యవధిలో వ చ్చిన మొత్తాలు గ్రామ కార్యదర్శి మోహన్, రెండు నెలలుగా ఎంపీడీఓ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టైపిస్టే సూత్రధారి గలావల్లిలో మే, జూన్ నెలలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుంఇచ 10నుంచి 20రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పింఛన్ల ఫైలును తనవద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్లు ఆన్లైన్ చేసేటపుడు చేతివాటం చూపుతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. గతంలోనూ పెద్దింపేటలో 6, పలగరలో ఒకటి, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకటి ఆథంటికేషన్ పద్ధతిలో కార్యదర్శులు విత్‌డ్రా చేసిన విషయం విదితమే. ఈ విషయం సోషల్ ఆడిట్‌ద్వారా బయటపడింది. అథంటికేషన్ పేరుతో అక్రమాలు రెండేళ్లుగా బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారులు వేలిముద్రలు వేసి వారి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. మంచంమీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ అవక పింఛన్ పొందలేనివారికి పింఛన్లు పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి మొత్తాలు అందజేస్తారు. ఈ విధంగా చేసేందుకు వారికి గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతం వరకే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. మరణ ధ్రువీకరణ నమోదు కాకే... మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. మృతుడు ఎప్పుడు మృతిచెందాడో వారికి తెలుస్తుంది. వారికి సంబంధించిన సమాచారాన్ని 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చనిపోయిన వారి పేరున మొత్తాలు మంజూరయ్యే అవకాశం ఉండదు. అయితే కావాలనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. దీనిపై ఈఓపీఆర్డీ దేవకుమార్వద్ద సాక్షి ప్రస్తావించగా టైపిస్ట్ ఎక్కడ పింఛన్లు పంపిణీ చేసినా మృత్యువాత పడినవారి పేరున వచ్చే వాటికి ఆథంటికేషన్ వేసి విత్‌డ్రా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తాము గుర్తించినట్టు తెలిపారు. అంతేగాకుండా పింఛన్లు పెట్టేందుకు కార్యాలయానికి వచ్చేవారి నుంచి వెయ్యి నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారనీ, పింఛన్లు పంపిణీ చేసే సమయంలోనూ లబ్ధిదారులనుంచి 10 నుంచి 20రూపాయలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎంపీడీఓకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు గలావల్లిలో అక్రమాలకు పాల్పడినట్టు బట్టబయిలయిందని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. -
పింఛన్ డబ్బులు కాజేశాడని ఫిర్యాదు
బజార్హత్నూర్: మండలంలోని గిర్నూర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నూర్సింగ్ పింఛన్ డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీవో దుర్గం శంకర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. 15వందల పింఛన్‌కు వెయ్యి రూపాయలు, రెండు నెలలకు సంబంధించిన పింఛన్ 2వేలకు వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, బయోమెట్రిక్ ద్వారా వచ్చిన ప్లే స్లిప్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండా చించివేస్తున్నాడని, బుక్కుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో ఈవోపీఆర్డీ విజయ్‌భాస్కర్‌రెడ్డిని గ్రామానికి పంపారు. గ్రామానికి వచ్చి న ఈవోపీఆర్డీ బీపీఎంతో మాట్లాడుతున్న సమయంలో వెయ్యి ఇచ్చి 2వేలు ఇచ్చినట్లు రాయడంతో గ్రామస్తులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ జయరాం, ఎస్సై అబ్ధుల్‌బాఖీ సంఘటన స్థాలానికి చేరుకుని పోస్టల్‌కు సంబంధించిన ఎస్పీఎం, మేయిల్ గార్డ్ అధికారులతో మాట్లాడారు. సోమవారం విచారణ చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ వినోద్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, భూపాల్‌రెడ్డి, గ్రామస్తులు కొమ్ము నారాయణ, బాపురావ్, రాములు, సాయికృష్ణ,లక్కం నారాయణ, గవ్వల సాయిచైతన్య పాల్గొన్నారు. -
పింఛన్ల పరిహాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ పేరుతో లబ్ధిదారులను టీడీపీ నేతలు పరిహాసం చేశారు. ప్రభుత్వ సొమ్మును తమ జేబులో నుంచి తీసి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. వృద్ధులను, వికలాంగులను గంటల తరబడి వేచి ఉండేలా చేసి, తమ దయాదాక్షిణ్యం అన్నట్టుగా పంపిణీ చేశా రు. ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ముడుపులకు కక్కుర్తి పడిన జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు ఇదే అ వకాశంగా చెలరేగి పోయారు. ఎప్పటి మాదిరిగానే పింఛ న్ల లబ్ధిదారుల నుం చి చేతివాటం ప్రదర్శించారు. ఒక్కొక్కరి వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ కమీషన్లు వసూలు చేశారు. కాకినాడ సిటీలోనైతే బాధిత పింఛన్‌దారులు మీడియా ముందుకొచ్చి తమ గోడు బహిరంగంగా చెప్పారు. జన్మభూమి కమిటీ సభ్యురాలు జగదాంబ తమ నుంచి రూ.రెండేసి వందల చొప్పున తీసుకున్నారని లబ్ధిదారులు వరుసగా నిలబడి బాహాటంగానే చెప్పారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగతాచోట్ల కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పింఛన్ ఇస్తున్నామని.. ఇదంతా తమ చలవేనని.. ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు వసూళ్లకు దిగారు.కాకినాడ కార్పొరేషన్ పరిధి 24వ డివిజన్ ముగ్గుపేటలో పింఛన్ లబ్ధిదారుల వద్ద స్థానిక టీడీపీ నేత, జన్మభూమి కమిటీ సభ్యురాలు గుత్తుల జగదాంబ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేశారని లబ్ధిదారులు చెప్పారు. కాకినాడ రూరల్ నేమాం గ్రామంలో పసుపు–కుంకుమ చెక్కులను యానిమేటర్ గంగాభవాని తనతో తీసుకువెళ్లిపోవడంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. ఎంతకీ చెక్కులు ఇవ్వకపోవడంతో 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానిమేటర్ నుంచి చెక్కులు తీసుకుని పంపిణీ చేయాలని ఆదేశించారు. డ్వాక్రా రుణాలు మంజూరు చేసినప్పుడు రూ.లక్షకు రూ.5 వేల చొప్పున తీసుకుంటున్నారని ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారన్న అక్కసుతోనే గంగాభవాని చెక్కులు పంపిణీ చేయకుండా తనతో తీసుకువెళ్లిపోయారని మహిళలు ఆరోపించారు. అల్లవరం మండలం ఎంట్రుకోనలో పసుపు– కుంకుమ పథకంపై మాట్లాడమని ఓ మహిళకు మైకు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్న జాబితాలో తన పేరు ఉన్నా రుణమాఫీ కాలేదని చెప్పింది. రూ.లక్షన్నర అప్పు ఉంటే బంగారం అమ్మి రూ.2.50 లక్షలు వడ్డీ సహా చెల్లించానని చెప్పడంతో టీడీపీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పలుచోట్ల ‘‘ఇదిగో ఈ మూడు వేలు నీకు తీసుకో. చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనకే ఓటు వెయ్యి’’ అంటూ టీడీపీ నాయకులు పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీ గ్రామసభలను ఓట్ల కొనుగోలు సభల్లా మార్చేశారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వచ్చేలోగా లబ్ధిదారులు వెళ్లిపోకుండా ఉండేందుకు వారి పాస్ పుస్తకాలు లాక్కున్నారు. గండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో దివ్యాంగులకు జనవరిలో పెంచిన రూ.1,500, ఫిబ్రవరిలో రూ.3 వేలు కలిపి రూ.4,500 ఇవ్వాల్సి ఉండగా పుస్తకంలో అంతే మొత్తం నమోదు చేశారు. లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. కొత్త పింఛనుదారులకు రూ.3 వేలకు బదులు రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని పలువురు ఆరోపించారు. అధికారులు లేకుండా అధికార పార్టీ కార్యకర్తలే లబ్ధిదారులకు సొమ్ములు ఇచ్చి, సంతకాలు చేయించుకుని, వేలిముద్రలు వేయించుకున్నారు. ఇంకా పలుచోట్ల పదవుల్లో లేని టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్మును తమ సొంత నగదులా పంపిణీ చేశారు. ఇదంతా తమ సొమ్మని, చంద్రబాబుకు ఓటెయ్యకపోతే తీసేస్తామని కొన్నిచోట్ల బెదిరింపులకు దిగారు. రాజమహేంద్రవరం నగరం హరిపురంలో పసుపు–కుంకుమ సొమ్ములు ఇచ్చి, టీడీపీకే ఓట్లు వేయాలని ఒట్లు వేయించుకోవడంతో ప్రజలు విస్తుపోయారు. -
ప్రాణాలు తీసిన ప్రచార ఆర్భాటం
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం తాయిలాల పర్వానికి శ్రీకారం చుట్టింది.. నాలుగున్నరేళ్ల పాటు సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు ఎన్నికలు సమీపిస్తుండటంతో పింఛన్ల రెట్టింపు పేరిట మరో మాయోపాయానికి తెరదీశారు.. పింఛన్ల పంపిణీని ఎన్నికల స్టంట్‌గా వాడుకుని ప్రచార ఆర్భాటంగా నిర్వహించిన సభలు జిల్లాలో ఇద్దరు వృద్ధుల ప్రాణాలు తీశాయి. అత్తిలి మండలం మంచిలిలో ఓ వృద్ధుడు గుండెపోటుతో సభా ప్రాంగణంలోనే కన్నుమూయగా.. తాడేపల్లిగూడెంలో మరో వృద్ధుడు సొమ్మసిల్లి ఆస్పత్రికి తీసుకువెళుతుండగా తుదిశ్వాస విడిచాడు. ఇవి ప్రభుత్వ హత్యలని.. టీడీపీ అధికార దాహానికి నిదర్శనమని పలువురు బహిరంగంగానే విమర్శించారు. అత్తిలి: రెట్టింపు పింఛన్ తీసుకుందామని ఎంతో ఆనందంగా ఇంటి నుంచి పంచాయతీకి వెళ్లిన వృ ద్ధుడు కర్రి వెంకటరెడ్డి (75) విగతజీవిగా తిరి గిరావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో ముని గిపోయింది. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెంచిన పింఛన్, పసుపు–కుంకుమ సొమ్ముల పంపిణీ కార్యక్రమం శనివారం మంచిలి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జరిగింది. గ్రామంలో డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులంతా తప్పక హాజరుకావాలని పంచాయతీ అధికారులు టాంటాం వేయడంతో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఉదయం 7 గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పంచాయతీ సిబ్బంది పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలు తీసుకున్నారు. సాయంత్రం ఎమ్మె ల్యే చేతులమీదుగా పింఛన్ సొమ్ము అందజేస్తామని చెప్పడంతో కొందరు వెళ్లిపోగా.. మరికొందరు వృద్ధులు అక్కడే ఉండిపోయారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి అనే వృద్ధుడు లెప్రసీతో బాధపడుతూ ఇంటికి నడిచి వెళ్లలేక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లో ఉండిపోయాడు. ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు వచ్చి కుర్చీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పంచాయతీ అధికారులు వెంకటరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి ఫోన్లో సమాచారం తెలపడంతో ఇక్కడకు వచ్చి చికిత్స నిమిత్తం పీఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. పింఛన్ కోసం వె ళ్లిన కుటుంబ యజమాని ఇలా విగతజీవిగా రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. పింఛన్ కోసం వెళ్లిన వెంటనే నగదు ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని వారు వాపోయారు. కొద్దిసేపటికి పంచాయతీ సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి మృతుని కుమారుడు సతీష్‌రెడ్డికి పింఛన్ సొమ్ము రూ.3 వేలు అందజేశారు. ప్రచార ఆర్భాటంతో ఎమ్మెల్యే హాజరయ్యే సమావేశానికి జనసమీకరణ కోసం ఇలా వృద్ధులు, వికలాంగులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీ నిపై పంచాయతీ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ను వివరణ కోరగా పింఛన్ కోసం వెంకటరెడ్డి ఉదయమే వచ్చాడని, వేలిముద్రలు తీసుకుని పింఛన్ సొ మ్ములు ఇచ్చేశామని, అయితే అతను అక్కడే కూర్చుండిపోయాడని చెప్పారు. నిరీక్షించి.. నీరసించి.. తాడేపల్లిగూడెం: వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చే కార్యక్రమాలను పండుగలా చేయాలి.. చంద్రన్న క్షీరాభిషేకాలు చేయాలి.. వెల్లువలా జనం తరలిరావాలి.. గంటలకు గంటలు ప్రసంగాలు వినాలి.. అనే ప్రభుత్వ ఆర్భాటానికి ఓ పండుటాకు రాలిపోయింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చి గంటల తరబడి వేచి ఉన్న ఓ వృద్ధుడు ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో కన్నుమూసిన ఘటన శనివారం తాడేపల్లిగూడెం మూడో వార్డులో చోటుచేసుకుంది. పట్టణంలోని మూడో వార్డుకు చెందిన గొర్ల కొండయ్య (80) వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ఉదయం 9 గంటలకు పింఛన్ పంపిణీ చేసే ప్రాంతం ( 2వ వార్డులోని యర్రా నారాయణస్వామి మున్సిపల్ స్కూల్) చేరుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిరీక్షించిన అతడు నీరసించి సొ మ్మసిల్లి పడిపోయాడు. అక్కడ ఉన్నవారు నీళ్లు ఇచ్చి లేపగా కొద్దిసేపు అక్కడే కూర్చుని పింఛన్ సొమ్ములు తీసుకున్నాడు. అతడి మూడో కుమారుడు వచ్చి ఇంటికి నడిపించుకుని తీసుకువెళుతుండగా కోతి బొమ్మ సెంటర్ వద్ద కొండయ్య కాళ్లు పట్టేసి పడిపోయాడు. దీంతో కొండయ్యను ఏరియా ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ప్రచార ఆర్భాటంతో పింఛన్ సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల కొండయ్య కన్నుమూశాడని పలువురు విమర్శించారు. అధికారులు మాత్రం ఈ విషయం తమ దృష్టికి రాలేదని, దర్యాప్తు చేస్తామని అంటున్నారు. పింఛన్ కోసం ఉదయమే వెళ్లాడు ఈ ఒక్కరోజే పింఛన్ ఇస్తామని చెప్పడంతో నాన్న ఉదయమే టిఫిన్ తిని పంచాయతీకి వెళ్లా డు. అక్కడ వేలిముద్రలు తీసుకున్నారు. పింఛన్ సొమ్మును మీ టింగ్‌లో ఇస్తామని చెప్పడంతో అక్కడే కూ ర్చుండిపోయి, అస్వస్థతకు గురై మృతి చెందాడు. వెళ్లిన వెంటనే పింఛన్ సొమ్ము ఇచ్చి ఉంటే ఇంటికి చేరేవాడు. పంచాయతీ సిబ్బంది ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము ఇచ్చి వెళ్లిపోయారు. నేను కూలి పనులు చేసుకుంటూ, నాతల్లి పార్వతి పూతరేకులు తయా రుచేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మాకు దిక్కేవరు. – కర్రి సతీష్‌రెడ్డి, మృతుని కుమారుడు ఇది ప్రభుత్వ హత్యే పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడి వేలిముద్రలు తీసుకున్నాక నగదు ఇ వ్వకుండా మీటింగ్ వర కు వేచి ఉండమనడం దారుణం. ప్రచార ఆ ర్భాటం కోసం ఎమ్మెల్యే వచ్చే వరకు గంటల తరబడి వృద్ధులు, వికలాంగులు, మహిళలను వేచి ఉంచడం దుర్మార్గం. పింఛన్ కోసం వెళ్లిన వెంకటరెడ్డికి సకాలంలో నగదు ఇచ్చి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునేవాడు. ఇది ప్రభుత్వ హత్యే.– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ తణుకు సమన్వయకర్త -
పింఛన్ల పండుగ.. ప్రాణం మీదకొచ్చింది
ఒంగోలు టౌన్/కంభం: పండుగ పింఛన్‌దారుల ప్రాణం మీదకు వచ్చింది. ఇప్పటివరకు అందుకుంటున్న పింఛన్ల మొత్తాన్ని పెంచిన ప్రభుత్వం వారి ఇళ్ల వద్ద ఇవ్వకుండా అందరినీ ఒకచోటకు రప్పించి పండుగ పేరుతో ఇవ్వాలన్న ప్రయత్నం లబ్ధిదారుల ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఇళ్ల వద్ద ప్రశాంతంగా అందుకుంటున్న పింఛన్లను గుంపులు గుంపులుగా ఒక్కచోట చేర్చారు. ఒంగోలు మినీ స్టేడియం వద్దకు పిలిపించిన యంత్రాంగం అక్కడ ప్రసంగాలు జరిగేలోపు పండుటాకులు నీరసపడిపోయారు. కొందరు పింఛన్ల పెంపు మొత్తాన్ని అందుకోకుండానే స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఒక వృద్ధురాలు తలకు గాయం కూడా అయింది. ఇవేమీ పట్టించుకోని యంత్రాంగం వరుసపెట్టి ప్రసంగాలు చేసుకుంటూ వెళుతూ పింఛన్‌దారులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను వారిపాటికి వారిని వదిలేశారు. దీంతో అనేకమంది పింఛన్‌దారుల్లో తాము రెట్టింపు పింఛన్ పొందామన్న ఆనందం కంటే ప్రాణాలమీదకు తెచ్చుకున్నామన్న ఆవేదనే కనిపించింది. జన జాతర.. సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. వృద్దాప్య, వితంతు, దివ్యాంగులతోపాటు ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, హిజ్రాలందరినీ ఒకేచోటకు తీసుకువచ్చి వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పొదుపు గ్రూపు మహిళలకు పసుపు, కుంకుమ కింద ప్రతి గ్రూపు సభ్యురాలుకు పదివేల రూపాయల చొప్పున దశలవారీగా ఇస్తామని ప్రకటించి వారిని కూడా ఒకేచోటకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పింఛన్‌దారులను, మెప్మా పొదుపు గ్రూపు సభ్యులను తరలించే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. శనివారం నుండి సోమవారం వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలకు నగదును అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలిరోజైన శనివారం 1æ నుంచి 16 డివిజన్ల వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలను మినీ స్టేడియంకు తరలించారు. ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పింఛన్‌దారులు, పొదుపు గ్రూపు మహిళల తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మినీ స్టేడియంకు వచ్చారు. ముఖ్యమంత్రి సభను తలపించే విధంగా మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అంతా గందరగోళం.. పింఛన్ల కోసం వేలాదిగా మినీ స్టేడియానికి చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు సంబంధించిన వ్యక్తిగత ప్రచార ఫెక్సీలే అధికంగా ఉన్నాయి. ప్రాంగణమంతా మహిళలతో నిండి ఉండటంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారిని సరిగా గైడ్ చేసేవారు లేకపోవడంతో బారికేడ్లకు అటూ ఇటూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరకు తమకు కేటాయించిన కౌంటర్ల వద్దకు వెళ్లేసరికి అక్కడ గుంపులు గుంపులుగా ఉండటంతో ఆ రద్దీని తట్టుకోవడం అనేక మందికి ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా పింఛన్ల కోసం వచ్చిన వారిలో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్పృహ తప్పి తలకు గాయమై.. ముక్తినూతలపాడుకు చెందిన మాణిక్యమ్మ వృద్ధాప్య పింఛన్ తీసుకునేందుకు వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒంగోలు మినీ స్టేడియానికి చేరుకొంది. పింఛన్ తీసుకునేందుకు అటూ ఇటూ తిరగడంతో స్పృహ తప్పి పడిపోయింది. చివరకు తలకు గాయమైంది. 108వాహనంలో రిమ్స్‌కు పింఛన్లు పొందేందుకు వచ్చిన వారిలో కొంతమంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వైద్య బృందానికి ఈ సమాచారం చేరవేయడంతో హుటాహుటిన 108ను రప్పించి రిమ్స్‌కు తరలించారు. కాపు కళ్యాణ మండపం వద్ద నివసిస్తున్న దానమ్మ, ముక్తినూతలపాడుకు చెందిన వరికూటి వెంకాయమ్మ, గోపాలనగర్‌కు చెందిన సుబ్బరావమ్మలు స్పృహ తప్పి కింద పడటంతో వారిని రిమ్స్‌కు తరలించారు. ‘భోజన’ పాట్లు పింఛన్లు పొందేందుకు, పసుపు కుంకుమ కింద నగదు తీసుకునేందుకు వేలాది మంది మహిళలు మినీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ ప్రకటించారు. మినీ స్టేడియం పక్కనే ఉన్న స్థలంలో షామియానాలు ఏర్పాటుచేసి భోజనాలు పెట్టారు. వందలాది మంది రావడంతో భోజనాలకు ఇబ్బంది పడ్డారు. చివరకు భోజనం ప్లేట్ల కోసం ఎగబడాల్సిన దుస్థితి నెలకొంది. చివర్లో వచ్చిన వారికి పెరుగుతో సరిపుచ్చారు. ఎన్సీసీ క్యాడెట్లు, నర్సింగ్ స్టూడెంట్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకున్నారు. అయితే ఎన్సీసీ క్యాడెట్ల చేత దామచర్ల జనార్ధన్‌రావు పేరుతో తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన క్యాలెండర్లను మహిళలకు పంపిణీ చేయించడంపట్ల విమర్శలు వినిపించాయి. కార్యక్రమానికి హాజరైన మహిళల నుదుటున కుంకుమతోపాటు గంధం పూశారు. పని పోగొట్టుకొని వచ్చా: లాజర్ చిన్న తనం నుంచే తన కుమారుడు నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. మంచానికే పరిమితమైన తన కుమారుడికి పింఛన్ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడకు వచ్చి పింఛన్ తీసుకోకుంటే ఇవ్వమని చెప్పారు. దాంతో తాను పని పోగొట్టుకొని తన కుమారుడిని తీసుకువచ్చాను. ఇక్కడ గంటల తరబడి ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. పెరిగిన పింఛన్ కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినప్పటికీ పట్టించుకోలేదు. పెంచిన పింఛన్ ఇళ్ల వద్ద ఇస్తే బాగుంటుంది. ఇలా ఇక్కడకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నాడు కేశవరాజుగుంటకు చెందిన గద్దల లాజర్. -
పింఛన్ డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వ్యసనాలకు బానిసైన వారు రక్త సంబంధాలను సైతం లెక్క చేయడం లేదు. తమ అవసరం తీరితే చాలు.. ఇక ఏదీ అవసరం లేదనే స్థాయికి వెళుతున్నారు. ఈక్రమంలో మంచి చెడుల విచక్షణ కూడా కోల్పోతున్నారు. తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండానే దారుణాలకు ఒడిగడుతున్నారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పింఛన్ సొమ్ము ఇవ్వలేదనే కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. గోనెగండ్ల: పింఛన్ సొమ్ము కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొడ్డలితో చంపిన ఉదంతం మండలంలోని ఒంటెడుదిన్నె గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. గ్రామానికి చిన్న నర్సన్న, లక్ష్మిదేవి(60) దంపతులకు వీరేషమ్మ, ఉరుకుందమ్మ, ఈరమ్మ కుమార్తెలు. వీరందరికీ పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం వారు పెద్దకుమార్తె వీరేషమ్మ వద్ద కోడుమూరు మండలం వర్కూరులో ఉంటున్నారు. సోమవారం పింఛన్ సొమ్ము తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. కాగా మద్యానికి బానిసైన నర్సన్న పింఛన్ డబ్బు ఇవ్వాలంటూ రాత్రి భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై గొడ్డలితో నరికి చంపి ఇంటి తలుపులు వేసి అక్కడి నుంచి ఉడాయించాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే వారికి తనే ఫోన్ చేసి తన భార్య ఉరివేసుకొని చనిపోయిందంటూ సమాచారం అందించాడు. దీంతో వారు వెళ్లి చూడగా లక్ష్మిదేవి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి మృతురాలి కుమార్తెలకు సమాచారం అందించారు. తల్లి మరణంతో కుమార్తెలు విలపించిన తీరు చూపరులను కంటతటి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. -
సీఎం సారు పింఛన్ అందేలా చూడండి : మాజీ ఎమ్మెల్యే
పలమనేరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మాజీ ఎమ్మెల్యేలకు అందించే పింఛన్ మూడు నెలలుగా తనకు అందలేదని, దాన్నే నమ్ముకుని బతికే తనకు జీవనం కష్టంగా ఉందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వగృహంలో గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ప్రతినెలా రూ.30 వేలు పింఛన్‌గా ఇచ్చేదన్నారు. తాను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి ఏమీ సంపాదించుకోలేదని, ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. కనీసం ఆస్పత్రి ఖర్చులు, దైనందిన జీవనానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని బాధపడ్డారు. ఆర్థికంగా బాగున్న మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్ పెద్ద విషయం కాదని, తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పింఛన్ విషయంగా ఏదేని సమాచారం కావాలంటే అమరావతిలోని ఎమ్మెల్యేల పింఛన్ కార్యాలయం నంబర్‌కు ఫోన్ చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలో ఇలాంటి చెత్త పాలనను ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. కనీసం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా తనకు మూడు నెలల పింఛన్ అందేలా చూడాలని కోరారు. -
మాజీ రిజిస్టార్కు పెన్షన్ కష్టాలు
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలపై భార్యతో కలిసి నిరసనకు దిగారు. ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ యూనివర్సిటీలో మాజీ రిజిస్ట్రార్ ధర్మరాజు పెన్షన్ డబ్బులు రావడం లేదని రిజిస్ట్రార్ చాంబర్లో తన భార్యతో సహా బైఠాయించారు. గత మూడేళ్లుగా పెన్షన్ డబ్బులు రావట్లేదని ఆందోళన చేపట్టారు. భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా రోదిస్తూ...పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతామని, భిక్షం ఎత్తుకుని బతకాలా అంటూ ఆవేదన చెందారు. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఈ అవ్వకు ‘ఆసరా’ ఏది?
వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కోట సమ్మక్క శతాధిక వృద్ధురాలు.. నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు ఆసరా పింఛన్ అందడం లేదు. పెన్షన్ ఇప్పించమని ఇప్పటికి ఆరుసార్లు దరఖాస్తు చేసుకుంది. 2016 మార్చి నుంచి ఆ వృద్ధురాలికి పింఛన్ వస్తుంది. కానీ పంపిణీ చేసే అధికారులే కుటుంబానికి తెలియకుండా పెన్షన్ స్వాహా చేశారు. సమ్మక్క కూతురు ఏమ లస్మక్క భర్త గతంలో మత్యువాతపడడంతో తల్లివద్దే ఉంటోంది. ఇద్దరూ కలిసి వేమనపల్లిలో సమ్మక్క కుమారుడు కోట రాజం వద్ద ఉంటున్నారు రాజం సైతం రెండేళ్ల క్రితం మృతిచెందగా కోడలు మల్లక్కే వారికి దిక్కయ్యింది. విచిత్రం ఏమిటంటే వృద్ధురాలైన సమ్మక్కకు పెన్షన్ రావటం లేదు. కానీ ఆమె కూతురు లస్మక్కకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. వారం రోజుల క్రితం పెన్షన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఆమెకు అసలు విషయం తెలిసింది. సమ్మక్కకు 2016 మార్చి నెలలోనే పెన్షన్ మంజూరైనట్లు జాబితాలో ఉంది. స్థానికంగా ఉండటం లేదని చూపించారు. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల ఒకసారి అధికారులే డ్రాచేశారు. ఆ తర్వాత జూన్, జులై నెలల పెన్షన్ ఆగస్టులో అధికారులే స్వాహా చేశారు. అప్పటి నుంచి వృద్ధురాలు స్థానికంగా ఉండటం లేదని పెన్షన్ రద్దుచేశారు. పెన్షన్ కాజేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల దరఖాస్తును తీసుకుని మళ్లీ మంజూరుకు పంపారు. పెన్షన్డ్రా అయినట్లు ఆన్లైన్లో చూపిస్తున్న దృశ్యం